iDreamPost
android-app
ios-app

దివ్య భారతి మరణం వెనక అసలు కారణం వేరే ఉంది: బాలీవుడ్ స్టార్ హీరో

  • Published Apr 13, 2024 | 12:46 PM Updated Updated Apr 14, 2024 | 5:56 PM

అలనాటి నటి దివ్య భారతి.. దశాబ్దలు గడుస్తున్న ప్రేక్షకుల మదిలొో ఇప్పటికీ అలానే కొలువై ఉన్న నటి. అతి చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ అందలా తార కేవలం 19ఏళ్లకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. కాగా, ఇప్పటికి ఈమె మరణం ఒక మిస్టరీగా మిగిలిపోయింది. అయితే తాజాగా ఈమె మరణం పై ఓ బాలీవుడ్ హీరో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.

అలనాటి నటి దివ్య భారతి.. దశాబ్దలు గడుస్తున్న ప్రేక్షకుల మదిలొో ఇప్పటికీ అలానే కొలువై ఉన్న నటి. అతి చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ అందలా తార కేవలం 19ఏళ్లకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. కాగా, ఇప్పటికి ఈమె మరణం ఒక మిస్టరీగా మిగిలిపోయింది. అయితే తాజాగా ఈమె మరణం పై ఓ బాలీవుడ్ హీరో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.

  • Published Apr 13, 2024 | 12:46 PMUpdated Apr 14, 2024 | 5:56 PM
దివ్య భారతి మరణం వెనక అసలు కారణం వేరే ఉంది: బాలీవుడ్ స్టార్ హీరో

సినీ ఇండస్ట్రీలో చాలామంది తారలు దశాబ్దలు గడుస్తోన్న ప్రేక్షకుల మదిలో మాత్రం ఇప్పటికీ అలానే కొలువై ఉంటారు. మరి అలాంటి హీరోయిన్లలో ‘దివ్య భారతి’ కూడా ఒకరు. అయితే ఇప్పటి జనరేషన్ కు ఈమె పేరు పెద్దగా తెలియకపోవచ్చు కానీ, 90ల్లో సినిమాలు చూసిన వాళ్లు ఈమెను ఇట్టే గుర్తుపట్టేస్తారు. కాగా, అప్పటిలో శ్రీదేవి జయప్రద, తర్వాత ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన ఘనత దివ్య భారతికి సొంతం. కేవలం చిన్న వయసులోనే ఊహించని విధంగా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలా తెలుగు, దక్షిణాది చిత్రల్లో స్టార్ హీరోల సరసన నటించి ఓ ఊపు ఊపింది. ముఖ్యంగా.. వెంకటేశ్ నటించిన బొబ్బిలి రాజా సినిమాలో దివ్య భారతి తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.ఇక కేరీర్ మంచి ఫామ్ లో ఉందనుకునే సమయంలో.. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయింది. అయితే దివ్య భారతి తన 19 ఏళ్ల వయసులో ఇంట్లో ఐదో అంతస్తు నుంచి పడి చనిపోయింది. ఇదిలా ఉంటే.. దివ్య భారతి మరణం అనేది ఇప్పటికి ఒక వీడని మిస్టరీగా మిగిలిపోయింది. ఇక తాజాగా ఈమె మరణంపై ఓ బాలీవుడ్ హీరో కొన్ని షాకింగ్ కామెంట్స్  చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

దివ్య భారతి  17 ఏళ్ల వయసులోనే అగ్ర కథానాయికగా ఇండస్ట్రీలో  వెలుగు వెలిగింది. అలాగే చిన్న వయసులోనే స్టార్ హీరోల సరసన నటించి ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. అయితే , ఆ స్టార్ డమ్ ను అనుభవించకుండానే ఆమె 19 ఏళ్ల వయసులోనే మరణించింది. ముంబైలోని ఐదవ అంతస్తులోని అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి కిందపడి మృతి చెందింది. ఇక అప్పట్లో ఆమె మరణం పై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే.. ఎవరో కావాలనే దివ్య భారతిని పై నుంచి పడేసి హత్య చేశారని పుకార్లు వినిపించాయి. కాగా,ఇప్పటికీ ఇండస్ట్రీలో దివ్యభారతి మరణం వీడని మిస్టరీగా మిగిలిపోయింది. అయితే తాజాగా దివ్య భారతి మృతి పై బాలీవుడ్ నటుడు కమల్ సదానా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్ సదన్ మాట్లాడుతూ.. ‘దివ్యభారతి మరణం చాలా బాధకరం. ఆమె మరణించింది అనే నిజాన్ని నేను తీసుకోలేకపోయాను. ఎందుకంటే.. మంచి టాలెంట్ కలిగిన నటుల్లో ఈమె కూడా ఒకరు. ఇక ఆమెతో కలిసి పని చేయడం చాలా సరదాగా ఉండేది.

Divya Baharthi

కానీ, చిన్న వయసులోనే ఆమె మరణవార్తను విని చాలా షాకయ్యాను. ఎందుకంటే.. ఆమె చనిపోయిన అంతకు మూడు రోజుల ముందే ఆమెతో నేను కలిసి పని చేశాను. అయిేత దివ్వ భారతి మరణం ప్రమాదవశాత్తు జరిగింది. పైగా ఆమె చనిపోయే ముందు కొన్ని డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు. అలాగే ఆమెకు ఎలాంటి ఆనారోగ్య సమస్యలు కూడా లేవు. ఆరోగ్యంగా ఉండేది. అలాగే దివ్య భారతి చనిపోయే సమాయానికి ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అవి దివ్య భారతి చేసి ఉంటే చాలా పెద్ద స్టార్ అయ్యిండేది’ అని కమల్ సదానా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కమల్ సదాన్, దివ్య భారతి పై చేసిన వ్యాఖ్యలు అనేవి నెట్టింట వైరల్ గా మారాయి. మరి, దివ్య భారతి మరణంపై నటుడు కమల్ సదాన్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

marsbahis giriş