ఒకప్పుడు ‘కల్ట్ బొమ్మ’ అనిపించుకున్న సినిమాలకు ఈ మధ్యకాలంలో సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడదే బాటలో ‘బొమ్మరిల్లు’ సినిమా చేరుతున్నట్లు తెలుస్తోంది. 2006లో సిద్ధార్థ్, జెనీలియా జంటగా తెరకెక్కిన ఈ సినిమా.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఇండస్ట్రీ హిట్ అందుకుంది. స్టార్ డైరెక్టర్ దిల్ రాజు నిర్మించిన ఈ కల్ట్ బొమ్మను.. డైరెక్టర్ భాస్కర్ రూపొందించాడు. అతనికి డైరెక్టర్ గా ఇదే డెబ్యూ మూవీ కావడంతో.. తన పేరు బొమ్మరిల్లు భాస్కర్ గా పాపులర్ అయ్యింది. ఆ సినిమా తర్వాత భాస్కర్ డైరెక్టర్ గా అల్లు అర్జున్ తో పరుగు సినిమా తీశాడు. అదికూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఇక అదే ఊపులో మూడో సినిమా ఆరెంజ్ చేశాడు. రామ్ చరణ్ హీరోగా నటించిన ఆ సినిమా.. అప్పట్లో యూత్ కి అర్ధంగాక ఫెయిల్యూర్ గా నిలిచింది. కానీ.. ఇప్పటికి ఆ సినిమాకు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలా భాస్కర్.. రామ్ తో ఒంగోలు గిత్త.. చివరిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు చేశాడు. బొమ్మరిల్లు, పరుగు సినిమాల తర్వాత ఏ సినిమా కూడా ఆ రేంజ్ సక్సెస్ ఇవ్వలేకపోయాయి. కానీ.. చివరిగా చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కాస్త బెటర్ అనిపించుకుంది. ప్రస్తుతం భాస్కర్ తదుపరి సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు. ఈసారి ఎక్స్ పరిమెంట్స్ కాకుండా తనకు లైఫ్ ఇచ్చిన సినిమాకి సీక్వెల్ తీయాలని అనుకుంటున్నాడట.
సినీ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. డైరెక్టర్ భాస్కర్ ఈసారి బొమ్మరిల్లు సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నాడట. అందుకోసం స్టోరీ లైన్ కూడా రెడీ చేస్తున్నాడని అంటున్నారు. కాగా.. 17 ఏళ్ళ తర్వాత తెరకెక్కనున్న సినిమాలో హీరో మారబోతున్నాడని టాక్. బొమ్మరిల్లు సినిమాలో హీరోగా సిద్ధార్థ్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ.. ఇప్పుడు సీక్వెల్ లో హీరోగా డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తాడని వినికిడి. భాస్కర్ ఆల్రెడీ సిద్ధుకి ఓ లైన్ చెప్పి ఓకే చేయించుకున్నాడట. మరి అది బొమ్మరిల్లు సీక్వెల్ యేనా లేక వేరేనా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ బొమ్మరిల్లు సీక్వెల్ ఉంటే గనక.. ఖచ్చితంగా దిల్ రాజు నుండి అప్డేట్ వస్తుంది. సో.. అప్పటిదాకా బొమ్మరిల్లు ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే. మరి బొమ్మరిల్లు సీక్వెల్ ఆలోచనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.