iDreamPost
iDreamPost
ముందు ప్రకటించిన ప్రకారం భీమ్లా నాయక్ ఓటిటి రిలీజ్ ఎల్లుండి జరగాలి. కానీ అనూహ్యంగా నిర్ణయం మార్చుకుని ఒక రోజు ముందు అంటే 24కే ఫిక్స్ చేస్తూ నిన్న సాయంత్రం కొత్త పోస్టర్లు వదిలారు. ఆహా, హాట్ స్టార్ రెండిట్లోనూ ఒకేసారి స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా ఎందుకు చేశారనే సందేహం రావడం సహజం. 25న ఆర్ఆర్ఆర్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మేనియా మాములుగా లేదు. అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద హంగామా ఉంటుంది కాబట్టి అదే పనిగా ఓటిటిలు ఓపెన్ చేసి కొత్త సినిమాలు చూసే మూవీ లవర్స్ తక్కువగా ఉంటారు. ఆ మూడ్ ని కూడా ఎక్స్ పెక్ట్ చేయలేం. ఎంతలేదన్నా దీని ప్రభావం ఉంటుంది.
దానికి తోడు 25న అజిత్ వలిమై జీ5లో వస్తోంది. తెలుగులో పెద్దగా ఆడకపోయినా డిజిటల్ లో చూడాలనుకునే ఆడియన్స్ గట్టిగానే ఉన్నారు. సో భీమ్లా ఇవాళ మిడ్ నైట్ నుంచి రావడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువ. ఆహా మీద ముందు నుంచి క్వాలిటీ విషయంలో కంప్లయింట్స్ ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకుని 4కె, డాల్బీ సౌండ్ అని ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నారు. హాట్ స్టార్ తో పోటీ లేకపోతే ఇబ్బంది లేదు కానీ ఒకే సినిమాని రెండు ప్లాట్ ఫార్మ్స్ షేర్ చేసుకున్నాయి కాబట్టి వ్యూస్ పరంగా డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే ఈ మాత్రం పబ్లిసిటీ అవసరం. 90 కోట్లకు పైగా షేర్ సాధించినప్పటికీ కొన్ని ఏరియాల్లో భీమ్లాకు నష్టాలు తప్పలేదు.
హడావిడిగా ట్రైలర్ కట్ చేసి సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని చెప్పిన భీమ్లా నాయక్ హిందీ డబ్బింగ్ వెర్షన్ దాదాపు ఆగిపోయినట్టే. నిర్మాతలు మౌనంగానే ఉన్నారు. పుష్ప 1లాగా నార్త్ లో క్యాష్ చేసుకుందామని చేసిన ప్రయత్నాలు పారలేదు. పైగా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తాకిడిలో నిలవడం కష్టం. సో టీవీ ఛానల్ లేదా డైరెక్ట్ ఓటిటిలో బాలీవుడ్ ఆడియన్స్ చూడొచ్చు. ఈ నెల ఇదే బిగ్గెస్ట్ డిజిటల్ రిలీజ్ గా చెప్పొచ్చు. అయ్యప్పనుం కోషియంకు రీమేక్ గా కొన్ని కీలక మార్పులతో త్రివిక్రమ్ చేసిన రచనకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. సో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇక ఎన్నిసార్లైనా భీమ్లా నాయక్ ని ఎంజాయ్ చేయొచ్చు
Also Read : RRR Kannada : ఇంత కష్టపడి డబ్బింగ్ చేస్తే ఫలితమిదా