iDreamPost
android-app
ios-app

Harihara Veeramallu: హరిహర వీరమల్లులో అదిరిపోయే యాక్షన్ సీన్స్ ప్లాన్ చేసిన డైరెక్టర్.. అభిమానులకు పూనకాలే!

  • Published Sep 20, 2024 | 8:53 PM Updated Updated Sep 20, 2024 | 8:53 PM

Harihara Veeramallu: 'హరిహర వీరమల్లు' టీమ్ ఇటీవల పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు.

Harihara Veeramallu: 'హరిహర వీరమల్లు' టీమ్ ఇటీవల పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు.

  • Published Sep 20, 2024 | 8:53 PMUpdated Sep 20, 2024 | 8:53 PM
Harihara Veeramallu: హరిహర వీరమల్లులో అదిరిపోయే యాక్షన్ సీన్స్ ప్లాన్ చేసిన డైరెక్టర్.. అభిమానులకు పూనకాలే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక బాగా బిజీ అయిపోయారు. కొత్త చిత్రాలు చేయడం లేదు. అయితే గతంలో తాను ఒప్పుకున్న చిత్రాలను పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. ఈ నేపధ్యంలో ‘హరిహర వీరమల్లు’ టీమ్ ఇటీవల పవన్ కళ్యాణ్‌ను కలిశారు. దాంతో ఈ మూవీ షూటింగ్ కొనసాగుతుందని తెలిసింది. ఈ మూవీ షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు. సెప్టెంబరు 23న ఈ మూవీ షూటింగ్ మళ్ళీ మొదలు కానుందట. ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ మూవీ కోసం మేకర్స్ అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేస్తున్నారు.

హరిహర వీరమల్లు మూవీ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ నిక్ పావెల్ ని తీసుకొస్తున్నారు. ఆయన స్టంట్ డైరెక్షన్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో పవర్ స్టార్ పాల్గొంటారని తెలిసింది. ఇవి భారీ యుద్ధ సన్నివేశాలను తెలుస్తుంది. ఏకంగా 400 మంది సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లతో ఈ ఎపిసోడ్ ఘాట్ చేయనున్నారు. మునుపెన్నడూ చూడని స్థాయిలో యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించేందుకు దర్శకుడు జ్యోతికృష్ణ ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాను స్టార్ట్ చేసింది దర్శకుడు క్రిష్ అయినప్పటికీ.. షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడటం వల్ల మధ్యలోనే ఆయన తప్పుకున్నారు. దీంతో ఈ మూవీ డైరక్షన్ బాధ్యతలని జ్యోతికృష్ణ తీసుకున్నారు. జ్యోతి కృష్ణ ప్లాన్ చేసిన యాక్షన్ సీన్స్ కచ్చితంగా అభిమానులని ఆశ్చర్య పరుస్తాయట. ఈ సీన్స్ లో పవర్ స్టార్ యాక్షన్ చాలా కొత్తగా ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి సంబంధించి పవన్ స్పెషల్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాకు.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తునారు. పవర్ స్టార్ సరసన యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తున్నారు. అలాగే నాజర్, రఘుబాబుతో పాటు సునీల్, అభిమన్యు సింగ్, అయ్యప్పలు ఈ మూవీలో నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో బాబీ డియోల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుండగా.. ఇంకో కీలకమైన పాత్ర కోసం తాజాగా మరో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‌ను రంగంలోకి దింపారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ దయాకర్ రావు భారీ రేంజిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘హరిహర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కానుంది. ఇక మళ్ళీ స్టార్ట్ కానున్న హరిహర మల్లు మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet