iDreamPost
iDreamPost
అభిమానులు కోరుకున్నట్టే పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ భీమ్లా నాయక్ 100 కోట్ల షేర్ కు దగ్గరలో ఉంది. ఏపిలో టికెట్ రేట్ల సమస్య ఉన్నప్పటికీ ఈ స్థాయిలో వసూళ్లు నమోదు కావడం సంచలనమే. పోటీగా ఏ సినిమా లేకపోవడంతో పవర్ స్టార్ కు బ్రేక్ వేసేవాళ్ళు లేకపోయారు. మొన్న వచ్చిన ఆడవాళ్ళూ మీకు జోహార్లు, సెబాస్టియన్ రెండూ సోసోగా టాక్ తెచ్చుకోడంతో జనం మళ్ళీ పవన్ మూవీకే ఓటు వేస్తున్నారు. ఇంకో నాలుగు రోజుల్లో రాధే శ్యామ్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా భీమ్లా స్లో అవ్వడం ఖాయం. ఇంకో పదమూడు కోట్లు వచ్చేస్తే క్లీన్ హిట్ స్టేటస్ తెచ్చేసుకుంటుంది కానీ ఒకవేళ అది జరగడం అంత సులభంగా కనిపించడం లేదు .
రీమేక్ సినిమాతో ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం ఇటీవలి కాలంలో దీనికే జరిగింది. పవన్ కళ్యాణ్ రానాల కాంబినేషన్లో వచ్చిన సీన్లు, తమన్ నేపధ్య సంగీతం, త్రివిక్రమ్ మాటలు, క్యాస్టింగ్, సాగర్ దర్శకత్వ ప్రతిభ మొత్తానికి లాక్ డౌన్ తర్వాత చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ ని బాక్సాఫీస్ కు ఇచ్చింది. ప్రస్తుతం భీమ్లా మూడో వారంలో అడుగు పెట్టింది. నైజామ్ లో పెంచిన టికెట్ ధరలు సవరించే అవకాశం ఉంది. అదే జరిగితే కలెక్షన్లు మళ్ళీ పెరుగుతాయన్నది ఫ్యాన్స్ నమ్మకం. మొదటి రెండు వారాలు హైదరాబాద్ మల్టీ ప్లెక్సుల్లో 295 రూపాయలు టికెట్ ధర పెట్టడం ఓ వర్గం ఆడియన్స్ ని థియేటర్ కు దూరంగా ఉంచిన మాట వాస్తవం.
ఇక లెక్కల విషయానికి వస్తే ఇవేవి అఫీషియల్ గా బయటికి చెప్పడం లేదు కాబట్టి వంద కోట్ల షేర్ అనేది ఖచ్చితమైన వాస్తవంగా చెప్పలేం కానీ 90 కోట్లు దాటినట్టు కనిపిస్తోంది. నైజామ్ 34 కోట్లు, సీడెడ్ 10 కోట్ల 80 లక్షలు, ఉత్తరాంధ్ర 7 కోట్ల 32 లక్షలు, ఈస్ట్ వెస్ట్ కలిపి 10 కోట్లు, గుంటూరు 5 కోట్ల 5 లక్షలు, కృష్ణా 3 కోట్ల 60 లక్షలు, నెల్లూరు 2 కోట్ల 40 లక్షలు, రెస్ట్ అఫ్ ఇండియా 8 కోట్లు, ఓవర్సీస్ 12 కోట్ల 35 లక్షల దాకా వచ్చినట్టు సమాచారం. మొత్తంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ పది రోజుల షేర్ 94 కోట్లకు పైగా తేలుతుంది. ఇక బాలన్స్ పదమూడు కోట్లు రాబట్టడం పెద్ద సవాలే. అసలే కొత్త రిలీజులు క్యూ కడుతున్నాయి. చూడాలి మరి
Also Read : Aadavaallu Meeku Johaarlu : శర్వానంద్ టార్గెట్ కష్టమే