iDreamPost
android-app
ios-app

కర్ణుడు అయిపోయాడు! ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ టచ్ తో ప్రభాస్ న్యూ మూవీ!

  • Published Jul 25, 2024 | 6:20 PM Updated Updated Jul 25, 2024 | 6:20 PM

Prabhas As Freedom Fighter In Hanu Raghavapudi Project Speculation: ప్రభాస్ వచ్చే ప్రాజెక్టులపై క్రేజీ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక ప్రయోగం అనేలా ఉన్నాయి. ఇప్పుడు అన్నింటికి మించి ప్రభాస్ మరో కొత్త క్యారెక్టర్ ట్రై చేస్తున్నాడు అంటున్నారు.

Prabhas As Freedom Fighter In Hanu Raghavapudi Project Speculation: ప్రభాస్ వచ్చే ప్రాజెక్టులపై క్రేజీ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక ప్రయోగం అనేలా ఉన్నాయి. ఇప్పుడు అన్నింటికి మించి ప్రభాస్ మరో కొత్త క్యారెక్టర్ ట్రై చేస్తున్నాడు అంటున్నారు.

  • Published Jul 25, 2024 | 6:20 PMUpdated Jul 25, 2024 | 6:20 PM
కర్ణుడు అయిపోయాడు! ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ టచ్ తో ప్రభాస్ న్యూ మూవీ!

పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దాదాపుగా వచ్చే మూడేళ్లకు ప్రభాస్ మూవీస్ లాక్ కూడా అయిపోయాయి. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు కాదు గానీ.. ఉన్న వాటి నుంచే క్రేజీ వార్తలు వస్తున్నాయి. అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఒక్కో వార్త బయటకు వస్తుంటే.. డార్లింగ్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. సలార్ తర్వాత ఏ కథతో వస్తాడు? ఎలాంటి జానర్ తో వస్తాడు అనుకున్న సమయంలో కల్కితో వచ్చి బాక్సాఫీస్ కా బాప్ అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు కల్కి రూ.1100 కోట్లు కొల్లగొట్టిన తర్వాత నెక్ట్స్ ఏంటి అంటున్నారు. అయితే నెక్ట్స్ వచ్చే ప్రతి ప్రాజెక్ట్ ఓ రేంజ్ లో ఉండబోతోంది అని ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. ఈ వార్త చూస్తే అలాగే అనిపిస్తోంది.

కల్కి సినిమా సక్సెస్ ని పూర్తిగా ఎంజాయ్ కూడా చేయకముందే ఫ్యాన్స్ నెక్ట్స్ ఏంటి అంటున్నారు. ఇప్పటికే రాజా సాబ్ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ఆ తర్వాత స్పిరిట్ ఉంది. కుదిరితే ఈ లోపే సరాల్ 2 కూడా ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా అదిరిపోయే మూవీస్ అనడంలో డౌట్ లేదు. పైగా స్పిరిట్ లో ప్రభాస్ మొట్ట మొదటిసారి పోలీసుగా కనిపించబోతున్నాడు. అక్కడితోనే ఆనందపడిపోతే ఎలా? ఆ తర్వాత వచ్చే ప్రాజెక్ట్ ని కూడా అదే రేంజ్ లో కొత్తగా ట్రై చేస్తున్నాడు అంటున్నారు. అదే ప్రభాస్- హను రాఘవపూడి ప్రాజెక్ట్ అనమాట. అవును.. ఈ మూవీకి సంబంధించే ఇప్పుడు క్రేజీ వార్త టాలీవుడ్ లో వైరల్ అవుతోంది.

సాధారణంగా హను రాఘవపూడితో సినిమా అనగానే అందరూ కచ్చితంగా లవ్ స్టోరీ అనే అనుకున్నారు. కానీ, ఈ మూవీ స్వాతంత్య్రానికి ముందు సాగే కథగా ఉంటుందని చెబుతున్నారు. స్వతంత్ర పోరాటం, ప్రేమకథ రెండూ కలిసి ఉంటాయి అనేది టాక్. ఇందులో ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్ లో సభ్యుడిగా ఉంటారని చెబుతున్నారు. అంటే ఆజాద్ హింద్ ఫౌజ్ ని చూపించాలి అంటే దానిని సృష్టించిన సుభాష్ చంద్రబోస్ ని కూడా చూపించాల్సిందే. అంటే ప్రభాస్- హను రాఘవపూడి కథలో సుభాష్ చంద్రబోస్ కూడా ఉంటారు అనమాట. ఇప్పుడు కల్కిలో కర్ణుడిగా చూస్తున్నాం. స్పిరిట్ లో పోలీస్ అవుతున్నాడు.

ఇంక ఈ ప్రాజెక్ట్ లో స్వాతంత్ర్య సమరయోధుడు అవుతున్నాడనమాట. ఈ వార్త విన్న ప్రభాస్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఫ్రీడమ్ ఫైటర్ గా ప్రభాస్ అంటే ఇది మామూలు హై కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పైగా సినిమా పేరు ‘ఫౌజీ’ అనే ఫైనల్ చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రభాస్ తన చేతిలో ఉన్న ఏ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. మరి.. ఫ్రీడమ్ ఫైటర్ గా ప్రభాస్ ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ సరసన చూస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş