iDreamPost
android-app
ios-app

బాబాయ్ vs అబ్బాయ్.. తెరపైకి కొత్త రచ్చ! ఈసారి ఫ్యాన్స్ తగ్గరేమో!

  • Published Feb 21, 2024 | 5:49 PM Updated Updated Feb 21, 2024 | 5:49 PM

ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈసారి రాబోయే రెండు రీరిలీజ్ చిత్రాలకు ఫ్యాన్ వార్స్ గట్టిగా ఉండేలా ఉన్నాయి. వాటి వివరాలేంటో చూద్దాం.

ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈసారి రాబోయే రెండు రీరిలీజ్ చిత్రాలకు ఫ్యాన్ వార్స్ గట్టిగా ఉండేలా ఉన్నాయి. వాటి వివరాలేంటో చూద్దాం.

  • Published Feb 21, 2024 | 5:49 PMUpdated Feb 21, 2024 | 5:49 PM
బాబాయ్ vs అబ్బాయ్.. తెరపైకి కొత్త రచ్చ! ఈసారి ఫ్యాన్స్ తగ్గరేమో!

గత ఏడాదిలానే ఈ ఏడాది కూడా రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతోంది. గత ఏడాది ఈ రీరిలీజ్ లకు వచ్చిన క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని.. ఈ ఏడాది ఇంకాస్త పక్కా ప్లానింగ్ తో వస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే నిన్న మొన్నటివరకు ఓయ్ సినిమా రీరిలీజ్ హడావిడి చూశాము. ఇక ఇప్పుడు రీరిలీజ్ కు రెడీ గా ఉన్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. సాధారణంగా ఏవైనా కొత్త సినిమాలు విడుదల అయినపుడు. ఫ్యాన్ వార్స్ జరగడం అనేది సహజం. అయితే, ఇప్పుడు రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న క్రమంలో.. ఇప్పటివరకు అయితే ఎటువంటి ఫ్యాన్ వార్స్ జరగలేదు. కానీ, మార్చి 1,2 తేదీలలో రీరిలీజ్ కాబోయే ఇద్దరు బడా హీరోల చిత్రాలకు మాత్రం.. ఈ ముప్పు తప్పేలా లేదని భావిస్తున్నారు నెటిజన్లు. మరి ఆ సినిమాలు ఏంటి ! ఎందుకు సోషల్ మీడియాలో ఇటువంటి టాక్ నడుస్తోంది! అనే విషయాల గురించి తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. అందులోను టాలీవుడ్ ఇండస్ట్రీ లెజెండరీ యాక్టర్ బాలకృష్ణ కు ఎంత మంది అభిమానులు ఉంటారో లెక్కే లేదు. మరో వైపు ఇదే కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ కు ఉండే డై హార్ట్ ఫ్యాన్స్ సెపరేట్. కారణాలు ఏమై ఉంటాయో తెలియదు కానీ.. ఈ బాబాయ్ అబ్బాయిల మధ్య ఎప్పుడు కోల్డ్ వార్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఆ కోల్డ్ వార్ కాస్త సినిమాల విషయానికొచ్చేసరికి ఫ్యాన్ వార్ గా మారిపోతుంది. ఈ క్రమంలో ఇప్పుడు రీరిలీజ్ ట్రెండ్ లో భాగంగా .. మార్చి 1న తారక్ నటించిన “సింహాద్రి”, మార్చి2న బాలకృష్ణ నటించిన “సమరసింహారెడ్డి” సినిమాలు రీరిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. దీనితో ఇప్పుడు బాబాయ్ vs అబ్బాయ్ సినిమాలు మరోసారి తెరపైన కొత్త రచ్చకు దారి తీసేలా ఉన్నాయి. చూడబోతుంటే ఈసారి ఫ్యాన్స్ ఏ మాత్రం తగ్గరేమో అనిపిస్తోంది.

ఇక తారక్ నటించిన సింహాంద్రి సినిమా విషయానికొస్తే.. అప్పట్లో సింహాద్రి సినిమా తారక్ కు మంచి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కల్లెక్షన్లను రాబట్టి .. తారక్ ను తిరుగులేని మాస్ హీరోగా నిలబెట్టింది. ఇక బాలకృష్ణ నటించిన సమరసింహా రెడ్డి సినిమా సీమ ఫ్యాక్షన్ ను అందరికి పరిచయం చేసి.. మరెన్నో చిత్రాలకు లీడ్ ఇచ్చింది. దీనితో బాలకృష్ణ రేంజ్ మరో స్థాయికి మారింది. అప్పట్లోనే అంత బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకున్న ఈ రెండు చిత్రాలు.. ఇప్పుడు వెంటవెంటనే రీరిలీజ్ అవ్వడంతో.. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో వైపు ఈ సినిమాలు ఫ్యాన్ వార్స్ కు కూడా రెడీగా ఉన్నట్లు అనిపిస్తోంది. మరి, త్వరలో రీరిలీజ్ అవ్వబోయే బాబాయ్ అబ్బాయి చిత్రాలు .. అభిమానుల మధ్య విధ్వంసాన్ని సృష్టిస్తాయో లేదా సాఫీగా సాగిపోతాయో వేచి చూడాలి. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetewin girişgrandpashabet