iDreamPost
android-app
ios-app

బాలయ్య సమరసింహారెడ్డి రీ రిలీజ్ డేట్ ఫిక్స్!

  • Published Feb 07, 2024 | 7:40 PM Updated Updated Feb 07, 2024 | 7:40 PM

తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రస్తుతం కొనసాగుతున్న కొత్త ట్రెండ్ రీ రిలీజ్. ఈ క్రమంలో ఈ ఏడాది అతి త్వరలో నందమూరి బాలకృష్ణ సినిమా ఒకటి.. రీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు మేకర్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రస్తుతం కొనసాగుతున్న కొత్త ట్రెండ్ రీ రిలీజ్. ఈ క్రమంలో ఈ ఏడాది అతి త్వరలో నందమూరి బాలకృష్ణ సినిమా ఒకటి.. రీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు మేకర్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Feb 07, 2024 | 7:40 PMUpdated Feb 07, 2024 | 7:40 PM
బాలయ్య సమరసింహారెడ్డి రీ రిలీజ్ డేట్ ఫిక్స్!

సినీ అభిమానులకు .. థియేటర్లకు అదొక తెలియని బంధం ఉంటుంది. సినిమా కొత్తదైనా .. పాతదైనా థియేటర్ లో చూస్తే ఆ కిక్ వేరే ఉంటుంది అనుకుంటారు సినీ ప్రియులు. ఈ క్రమంలోనే .. గత కొంతకాలంగా తెలుగు ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ రీరిలీజ్ అయ్యే సినిమాలు మాత్రం అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు ఈ రీరిలీజ్ ట్రెండ్ ను ఫాలో అవుతూ వస్తున్నాయి. అదేంటో కానీ ఆ సమయాల్లో థియేటర్ లో ఆకట్టుకోలేని ఎన్నో చిత్రాలు.. తిరిగి ఇప్పుడు రీరిలీజ్ చేస్తుంటే మాత్రం ప్రేక్షకులు తెగ చూసేస్తున్నారు. దీనితో మేకర్స్ కూడా .. ఎప్పటికపుడు అప్ డేట్ అవుతూ ఈ కొత్త ట్రెండ్ ను ఫాలో అవుతూ వస్తున్నారు. బహుశా ఇటువంటి సాహసాలు చేయడం కేవలం తెలుగు వారికే సాధ్యమేమో. ఒక్క తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తప్ప.. ఇతర భాషలలో లో ఎక్కడ కూడా ఇటువంటి రీరిలీజ్ సినిమాలు కనిపించవని చెప్పి తీరాలి. అయితే, ఈ క్రమంలో లెజెండరీ యాక్టర్ నందమూరి బాలకృష్ణ.. నటించిన ఓ ఫ్యాక్షన్ సినిమాను రీరిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఆ సినిమా వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకప్పుడు యాక్షన్ చిత్రాలంటే గుర్తొచ్చేది ఫ్యాక్షన్ చిత్రాలే.. ఈ తరహా చిత్రాల్లో ముఖ్యంగా బాలకృష్ణ తనదైన శైలిలో .. కొత్త రుచులను అభిమానులకు పరిచయం చేస్తూ ఉండడంలో ముందుటారు. వాటిలో ముఖ్యంగా ఫ్యాక్షన్ సినిమాల్లో కొత్త రకమైన యాక్షన్స్ కు .. శ్రీకారం చుట్టి బాక్సాఫీస్ రికార్డులను గట్టిగా కొల్లగొట్టిన సినిమా “సమరసింహా రెడ్డి”. 1999 వ సంవత్సరంలో సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా ఎన్నో వివాదాలు , అవాంతరాలు ఎదుర్కొని ..ఆ సమయంలో పండుగ విజేతగా నిలవడం. అంతేకాకుండా చాలా థియేటర్లు ఈ చిత్రం వలన వచ్చిన లాభాలతో రీ మోడలింగ్ చేసుకోవడం, సౌండ్ సిస్టం ఏర్పాట్లు చేసుకోవడం .. ఇలాంటివి చేశారని పత్రికల్లో వచ్చిన కథనాలకు లెక్క లేదు. అలాగే “సమర సింహ రెడ్డి” చిత్రం 29 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ఆడటం అప్పట్లో ఇండస్ట్రీ వర్గాలను షాక్ కి గురి చేసింది. ఇవన్నీ సినీ చరిత్రలో నిలిచిపోయిన ఆ అధ్యాయంలోని కొన్ని విషయాలు.

అయితే, సుమారు పాతికేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు .. “సమర సింహా రెడ్డి” సినిమా రీరిలీజ్ ను ప్రకటించారు మేకర్స్. మార్చి 2 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా.. ఈ సినిమాను రీ మాస్టర్ చేసిన ప్రింట్ తో పాటు.. 7.1 డాల్బీ సౌండ్ లో విడుదల చేయబోతున్నారు. అయితే, ఇప్పుడున్న యువతకు ఈ ఫ్యాక్షన్ టచ్ గురించి అంతగా అవగాహనా లేకపోయినప్పటికీ .. ఒన్స్ ఈ మూవీ చూస్తే మాత్రం థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. సినిమాలో సమరసింహారెడ్డిగా బాలయ్య విశ్వరూపం, ఫస్ట్ హాఫ్ లో అబ్బులుగా కామెడీతో పాటు ఎమోషన్ ను పండించిన విధానం, సిమ్రాన్.. అంజలా ఝవేరిల గ్లామర్, మణిశర్మ అందించిన సంగీతం.. అన్నిటితో కలిపి ఇదొక కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీ. ఈ సినిమాను ఆధారంగా తీసుకుని .. సీమ ఫ్యాక్షన్ తరహాలో వందకు పైగానే సినిమాలు వచ్చాయి.

ఇక ఈ ఏడాది కాస్త నెమ్మదించిన రీరిలీజ్ ట్రెండ్.. “కెమెరామెన్ గంగతో రాంబాబు” చిత్రంతో మళ్ళీ ఫార్మ్ లోకి వస్తున్నాయి. రవితేజ నటించిన “కిక్” ని కూడా మార్చి 2 ప్లాన్ చేసుకున్నారు. అయితే, గతంలో నరసింహనాయుడు సినిమాను రీరిలీజ్ చేశారు కానీ.. పబ్లిసిటీ లోపం వలన అంతగా రీచ్ రాలేదు. అందుకే ఈసారి ముందు నుంచే ప్లాన్ చేసుకుని “సమరసింహా రెడ్డి” చిత్రానికి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఏ సందేహం లేకుండా ఖచ్చితంగా ఈ చిత్రం మరోసారి అందరిని ఆకట్టుకుంటుందని చెప్పి తీరాలి. మరి, ఈ రీరిలీజ్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetMariobetMadridbetbetciomatbet girişjojobetpalazzobetgrandpashabetgrandpashabetJojobet Girişcasibom girişgrandpashabetbetasusJojobetcasibom girişjojobet girişcasibomJojobetGrandpashabetGrandpashabetcasibom