iDreamPost
android-app
ios-app

Ashu Reddy: డ్రగ్స్ కేసు వార్తలపై అషురెడ్డి ఆగ్రహం.. నిజమేంటో వాళ్లకే చెబుతా..!

Ashu Reddy: డ్రగ్స్ కేసు వార్తలపై అషురెడ్డి ఆగ్రహం.. నిజమేంటో వాళ్లకే చెబుతా..!

టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కేసు దుమారం రేపుతోంది. కబాలి సినిమా ప్రొడ్యూసర్ కేపీ చౌదరిని పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతని రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా అతనికి కాంటాక్ట్స్ ఉన్నట్లు గుర్తించారు. కొందరు సినీ, టీవీ తారలతో కేపీ చౌదరి తరచూ కాంటాక్ట్ లో ఉన్నట్లు చెబుతున్నారు. అతని కాల్ డేటాను పోలీసులు డీకోడ్ చేశారు. కేపీ చౌదరితో కొందరు సెలబ్రిటీలు వందల కాల్స్ మాట్లాడినట్లు వెల్లడించారు. అయితే డ్రగ్స్ కేసులో తన పేరును అనవసరంగా ప్రస్తావిస్తున్నారంటూ బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది.

కేపీ చౌదరి కొందరి పేర్లు వెల్లడించాడని.. వారిలో అషురెడ్డి పేరు కూడా ఉందని వార్తలు వచ్చాయి. కేపీ చౌదరితో అషురెడ్డి వందల కాల్స్ మాట్లాడినట్లు కథనాలు వైరల్ అయ్యాయి. అషూ సహా పలువురు ఉన్నారంటూ మరికొంత మంది పేర్లను కూడా రాసుకొచ్చారు. ఈ విషయంపై జూనియర్ సమంత ఆగ్రహం వ్యక్తం చేసింది. తన పేరుని అనవసరంగా ప్రచారం చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తన పేరు, తన ఫోన్ నంబర్ ని ఇష్టమొచ్చినట్లు ప్రదర్శిస్తే.. ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చింది.

“కొన్ని మీడియా సంస్థలు నాకు కొందరు వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నరు. నేను అలా చేయడాన్ని గట్టిగా ఖండిస్తున్నాను. సమయం వచ్చినప్పుడు ఎవరికైతే చెప్పాలో నిజానిజాలను వారికి చెబుతాను. ఇష్టానుసారం నా ఫోన్ నంబర్ ని ప్రదర్శిస్తే.. ఊరుకునేది లేదు” అంటూ అషురెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. రిమాండ్ రిపోర్టులో కేపీ చౌదరి నేరం అంగీకరించినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. కానీ, కేపీ చౌదరి కూడా తాను డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు అనే అభియోగాలను ఖండించాడు. తాను ఫోన్ కాల్స్ మాట్లాడినంత మాత్రాన డ్రగ్స్ అమ్ముతున్నట్లు ఎలా అవుతుందని వ్యాఖ్యానించాడు.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

Jojobet GirişMadridbetMariobetcasibommeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş