అరియానా గ్లోరీ.. ఈ పేరు తెలియని కుర్రకారు ఉండరంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో ఆమె సెన్సేషన్‌గా మారారు. ఎప్పటికప్పుడు తన ఫొటో షూట్స్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలను నెట్టంట ఆమె షేర్ చేస్తుంటారు. గ్లామర్ షోతో యువతను కట్టిపడేసే అరియానాకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమధ్య కాస్త బరువు పెరిగారీ సుందరి. అయితే చక్కనమ్మ బొద్దుగా ఉన్నా అందమే అన్నట్లు తన కొత్త లుక్స్‌తో అందర్నీ మెస్మరైజ్ చేస్తున్నారు అరియానా.
సోషల్ మీడియాలో పాపులరైన అరియానా.. బిగ్ బాస్ షో ద్వారా తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్తోనూ ఈ బ్యూటీకి ఫాలోయింగ్ మరింత ఎక్కువైంది. తొలుత హైదరాబాద్‌లో చిన్న చిన్న జాబ్స్ చేస్తూ వచ్చిన అరియానా.. ఆ తర్వాత యూట్యూబ్ యాంకర్‌గా మారారు. యాంకరింగ్‌లో మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలో అనుకోకుండా ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ అరియానాకు వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మకు తగిన విధంగా బోల్డ్‌గా మాట్లాడి ఆడియెన్స్‌ను ఆకర్షించారామె.
ఆ ఇంటర్వ్యూ తర్వాత అరియానా గురించి ఆర్జీవీ ట్వీట్ చేయడంతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. దీంతో అసలు ఎవరీ అరియానా గ్లోరీ అంటూ నెటిజన్స్ వెతకడం మొదలుపెట్టారు. అలా పాపులర్ అయిన ఈ క్యూటీ.. ఆ తర్వాత బిగ్ బాస్ షోతో అందరికీ సుపరిచితురాలు అయిపోయారు. అలాంటి అరియానా తాజాగా ఒక వీడియోను నెట్టింట పంచుకున్నారు. ఇందులో పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తున్నారీ బ్యూటీ. కారులో జర్నీ చేస్తున్న అరియానా.. ఆ వీడియోలో బొద్దుగా, ముద్దుగా కనిపించారు. న్యూ లుక్‌లో తెగ సిగ్గుపడిపోతున్న అరియానా వీడియో వైరల్ అవుతోంది. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలని ఈ వీడియోకు ఆమె క్యాప్షన్ జతచేశారు.