iDreamPost
android-app
ios-app

తెలుగు డైరెక్టర్స్ పరువు తీసేలా సుందర్. సి సంచలన కామెంట్స్!

  • Published May 03, 2024 | 5:57 PM Updated Updated May 03, 2024 | 5:57 PM

తెలుగు డైరెక్టర్స్ పరువు తీసేలా డైరెక్టర్ కమ్ నటుడు సుందర్ సి సంచలన కామెంట్స్ చేశారు. మన తెలుగు దర్శకులు అలా చేయడం తనను షాక్ కి గురి చేశాయని.. అందుకే వారి మీద ప్రతీకారం కూడా తీర్చుకున్నా అని అన్నారు. ఇంతకు సుందర్ ప్రతీకారం ఎలా తీర్చుకున్నారు?

తెలుగు డైరెక్టర్స్ పరువు తీసేలా డైరెక్టర్ కమ్ నటుడు సుందర్ సి సంచలన కామెంట్స్ చేశారు. మన తెలుగు దర్శకులు అలా చేయడం తనను షాక్ కి గురి చేశాయని.. అందుకే వారి మీద ప్రతీకారం కూడా తీర్చుకున్నా అని అన్నారు. ఇంతకు సుందర్ ప్రతీకారం ఎలా తీర్చుకున్నారు?

తెలుగు డైరెక్టర్స్ పరువు తీసేలా సుందర్. సి సంచలన కామెంట్స్!

టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్, టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీ వర్సెస్ బాలీవుడ్ ఇలా ఇండస్ట్రీల మధ్య బేధాలు ఉండడం సహజమే. ఆయా ఇండస్ట్రీలకు చెందిన అభిమానుల మధ్య విబేధాలు ఎప్పుడూ ఉంటాయి. సోషల్ మీడియా వచ్చాక ఇవి మరింత పెరిగాయి. బాలీవుడ్ సినిమాలు విడుదలైనా, తమిళ్ సినిమాలు రిలీజైనా మనవాళ్ళు ట్రోల్ చేయడం, మన సినిమాలు రిలీజైతే వాళ్ళు ట్రోల్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఒకరంటే ఒకరు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. తమిళ్ వాళ్ళని మనోళ్లు సాంబార్ అని, బాలీవుడ్ వాళ్ళని పానీపూరీ అని ట్రోల్ చేస్తారు. అయితే టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ అనే బేధం అభిమానుల మధ్యే కాకుండా దర్శకుల మధ్య కూడా ఉంటుందా అనే విధంగా సుందర్ సి కామెంట్స్ చేయడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది.

మన తెలుగు దర్శకులపై ఆయనకు పగ ఉందని.. వారి మీద ప్రతీకారం తీర్చుకున్నా అని తాజాగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దర్శకుడిగా, నటుడిగా కోలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుందర్ సి.. తాజాగా అరణ్మనై 4 సినిమాతో (తెలుగులో బాక్) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో తమన్నా, రాశిఖన్నా హీరోయిన్స్ గా నటించగా.. సుందర్ సి, తమిళ కమెడియన్ యోగిబాబు, కోవై సరళ, సంతోష్ ప్రతాప్ లు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకి సుందర్ సి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రమోషన్లలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన తెలుగు దర్శకులపై సుందర్ సి చేసిన ఆరోపణలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను ఒక తెలుగు సినిమా చూసి షాకయ్యానని.. అందులో సీన్స్ తాను తీసిన సినిమాలో ఉన్నట్టే ఉన్నాయని.. చాలా పద్ధతిగా నా కంటెంట్ ని కాపీ కొట్టారని సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఒక్క సినిమానే కాదని.. మరో 4 సినిమాల్లో కూడా తమిళ సినిమా సీన్స్ కనిపించాయని.. ఈ రేంజ్ లో కాపీ కొడతారా అని అనిపించిందని అన్నారు. అందుకే ప్రతీకారం తీర్చుకోవాలనున్నా అని.. వాళ్ళు మావి 5 సినిమాలను కాపీ చేస్తే తాను 8 సినిమాలకు కాపీ కొట్టి మిక్స్ చేసి విన్నర్ సినిమాని తెరకెక్కించానని అన్నారు. హీరో ప్రశాంత్, కిరణ్ రాథోడ్ నటించిన విన్నర్ సినిమా 2003లో విడుదలైంది. ఈ సినిమాతో తెలుగు దర్శకుల మీద ప్రతీకారం తీర్చుకున్నా అని అన్నారు. అయితే ఆయన కాపీ కొట్టిన ఆ 8 తెలుగు సినిమాలు ఏంటన్నది మాత్రం ఆయన చెప్పలేదు. మరి 2003లో విడుదలైన తమిళ్ విన్నర్ మూవీ చూసి ఆ సినిమాలేంటో కామెంట్ చేయండి.