iDreamPost
android-app
ios-app

స్టేజిపై డైరెక్టర్ కి రాఖీ కట్టి.. షాకిచ్చిన హీరోయిన్!

  • Published Feb 05, 2024 | 11:32 AM Updated Updated Feb 05, 2024 | 11:32 AM

Anupama Parameswaran: మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన చక్కని చిరునవ్వుతోనే కుర్రాళ్లను పడేస్తుంది. అలాంటి ఈ అమ్మడు తాజాగా ఈగల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అందరిని ఆశ్చర్యానికి గురి చేసే పని ఒకటి చేసింది.

Anupama Parameswaran: మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన చక్కని చిరునవ్వుతోనే కుర్రాళ్లను పడేస్తుంది. అలాంటి ఈ అమ్మడు తాజాగా ఈగల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అందరిని ఆశ్చర్యానికి గురి చేసే పని ఒకటి చేసింది.

  • Published Feb 05, 2024 | 11:32 AMUpdated Feb 05, 2024 | 11:32 AM
స్టేజిపై డైరెక్టర్ కి రాఖీ కట్టి.. షాకిచ్చిన హీరోయిన్!

సినీ పరిశ్రమలో ఎన్నో రకాల స్వభావం కలిగిన వారు ఉంటారు. కొందరు అందరితో కలిసిపోయే గుణం, మరికొందరు చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయానికి వస్తే..వాళ్లు చాలా మౌనంగా, రిజర్వ్డ్ గా ఉంటారు. సినోమా షూట్ సమయంలో ఎలా ఉన్నప్పటికీ, మూవీలకు సంబంధించిన ఈవెంట్స్ సమయంలో చాలా మొహమాటంగా ఉంటారు. అన్ని విషయాల్లో ఓపెన్ అవ్వలేరు. అందరూ హీరోయిన్లు ఇలానే ఉంటారా? అంటే  ఎస్ అని చెప్పలేము. కొందరు చాలా బోల్డ్ గా కూడా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ బ్యూటీ.. స్టేజిపై దర్శకుడుకి  రాఖీ కట్టింది. మరి.. ఆ బ్యూటీ ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరు గురించి తెలుగు  ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చక్కటి చిరునవ్వుతో కోట్లాది మంది అభిమానుల మనసులను కొల్లగొట్టేసింది. ఆమె రీసెంట్ నటించిన సినిమా ఈగల్. మాస్ మహారాజా రవితేజ నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు మూవీ మేకర్స్. ఈ క్రమంలోనే స్టేజీ పైకి వచ్చిన అనుపమ చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈగల్ సినిమాకు సంబంధించిన అనేక విషయాలను ఈ బ్యూటీ షేర్ చేసుకున్నారు.

ఇంకా ఈ మలయాళ బ్యూటీ మాట్లాడుతూ…డైరెక్టర్ గురించి పలు విషయాలను షేర్ చేసుకున్నారు. ఆయనతో నాలుగు సినిమాలు చేశానని, కార్తీక్ తో మంచి అనుబంధం ఉందని తెలిపింది. ఆయనను అన్నయ్య అనడమే అలవాటైపోయిందని, దానిని మార్చుకోలేనంటూ ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఈలోపు యాంకర్ సుమ ఓ రాఖీ తీసుకొచ్చి అనుపమకి ఇవ్వడం.. ఆమె స్టేజి పైన డైరెక్టర్ కార్తీక్ కు రాఖీ కట్టి హగ్ ఇచ్చింది. అంతేకాక అన్నయ్య అంటూ పిలుస్తూ తెగ సందడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా  అవుతోంది. ఇక ఈగల మూవీ విషయానికి వస్తే.. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తుండగా,  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనుపమ పరమేశ్వర్ విషయానికి వస్తే.. ఆమె అనేక తెలుగు సినిమాల్లో నటించి.. తెలుగుమ్మాయి అనేంతలా మారిపోయింది. ఆమెకు కుర్రకారుల మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే కార్తీకేయ-2 సినిమాతో మంచి  హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఈగల్ సినిమాతో ప్రేక్షకులను ఈ అమ్మడు పలకరించనున్నారు. మరి.. అనుపమకు సంబంధించి వైరల్ అవుతోన్న వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom