iDreamPost
android-app
ios-app

అనసూయకు ఏమైంది.. మొహంపై ఆ దెబ్బలేంటీ..?

Anasuya Bharadwaj: స్మాల్ స్క్రీన్ ను షేక్ చేసి వెండితెరపై అడుగుపెట్టిన బ్యూటీ అనసూయ భరద్వాజ్. రంగమ్మత్తగా అలరించి, దాక్షాయణిగా భయపెట్టింది. ఇప్పుడు సింబా మూవీతో పలకరించింది. అయితే ఆమె షేర్ చేసిన ఫోటోలు హాట్ టాపిక్ అయ్యాయి.

Anasuya Bharadwaj: స్మాల్ స్క్రీన్ ను షేక్ చేసి వెండితెరపై అడుగుపెట్టిన బ్యూటీ అనసూయ భరద్వాజ్. రంగమ్మత్తగా అలరించి, దాక్షాయణిగా భయపెట్టింది. ఇప్పుడు సింబా మూవీతో పలకరించింది. అయితే ఆమె షేర్ చేసిన ఫోటోలు హాట్ టాపిక్ అయ్యాయి.

అనసూయకు ఏమైంది.. మొహంపై ఆ దెబ్బలేంటీ..?

యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ భరద్వాజ్‌ను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. బుల్లితెరపై హోస్టుగా అలరించి.. ఆ తర్వాత వెండితెరపై తన నటనతో ఆకట్టుకుంటుంది. వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ రోజు ఆమె కీలక పాత్రలో నటించిన సింబా మూవీ ఆగస్టు 9న థియేటర్లలో రిలీజైంది. జగపతి బాబు కీ రోల్ ప్లే చేస్తున్నాడు. సైకలాజికల్ థ్రిలర్ మూవీగా వచ్చింది. రాజేందర్ రెడ్డితో కలిసి ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మించారు. కథ, డైలాగ్స్ అందించాడు. మురళీ మనోహార్ దర్శకుడు. ఈ శుక్రవారం నుండి థియేటర్లలో ఈ మూవీ సందడి చేస్తుంది. సినిమాపై పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ సమయంలో అనసూయ పెట్టిన పోస్టు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

రక్తంతో తడిసిన మొహంతో కనిపిస్తుంది అనసూయ. మరికొన్ని ఫోటోల్లో గాయాలతో, కమిలిన ఫేస్ రివీల్ చేసింది. దీంతో ఈ నటికి ఏమైందంటూ కంగారు పడుతున్నారు ఫ్యాన్స్. అయితే అవి సింబా మూవీ వర్కింగ్ స్టిల్స్ అని ఆమె ఇచ్చిన హ్యాష్ ట్యాగ్స్ బట్టి అర్థమౌతుంది. ఇందులో అనసూయ యాక్షన్ సీక్వెన్స్‌లో నటించినట్లు ట్రైలర్‌లో కనిపిస్తుంది. అందులో విలన్స్‌ను రఫ్ ఆడించే సీన్స్‌లో యాక్ట్ చేసింది. ఈ బ్లడ్, ఇతర ఫోటోలు చూస్తే అప్పుడివే అని తెలుస్తుంది. సినిమా విడుదల సందర్భంగా సింబా మూవీ షూటింగ్ సమయంలో తాను పడ్డ కష్టాన్ని చూపిస్తూ ఆ ఫోటోలను షేర్ చేసుకుంది అనసూయ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే. .

what happend to anasuya

జబర్దస్త్ షోతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ యాంకర్.. వెండితెరపై అడుగులు వేసింది. క్షణంలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో మెప్పించిన అనసూయ.. రంగస్థలం మూవీతో రంగమ్మత్త పాత్రలో ఆకట్టుకుంది. అక్కడ నుండి చూజీగా క్యారెక్టర్స్ ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది. పుష్పతో ఆమె క్రేజ్ పాన్ ఇండియా స్టాయికి చేరింది. ఇప్పుడు ఆమె చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. సుకుమార్-బన్నీ కాంబోలో రాబోతున్న పుష్ప 2లో నటిస్తోంది. ఇది కాకుండా ప్లాష్ బ్యాక్, ఉల్ఫ్ అనే తమిళ సినిమాలు చేస్తుంది. అంతే కాకుండా బుల్లితెరపై కిరాక్ బాయ్స్, కిలాడీ లేడీస్‌లో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి విదితమే. ఇక సోషల్ మీడియాలో కూడా ఫోటోలు షేర్ చేస్తూ ఎప్పుడూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది అను.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)