Venkateswarlu
2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. తర్వాత 2016లో వచ్చిన ‘‘క్షణం’’ సినిమాలో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేశారు..
2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. తర్వాత 2016లో వచ్చిన ‘‘క్షణం’’ సినిమాలో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేశారు..
Venkateswarlu
జబర్థస్త్ టీవీ షోతో రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న అనసూయ.. తర్వాత సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు.. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. 2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. తర్వాత 2016లో వచ్చిన ‘‘క్షణం’’ సినిమాలో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేశారు. ఏసీపీ జయ భరద్వాజ్‌గా కనిపించారు. నెగిటివ్ సేడ్స్ ఉన్న పాత్ర చేశారు. అయితే, ఈ పాత్రలో అనసూయను నటింప జేయడానికి అడివి శేష్ చాలా కష్టాలు పడ్డారట.
సినిమా హీరోలపై అనసూయకు ఉన్న ఓ చెడు అభిప్రాయం కారణంగా ఓ పొరపాటు జరిగిందట. అనసూయ చాలా రోజులు అడివి శేష్‌కు దూరంగా ఉండటానికి ప్రయత్నించారట. ఈ విషయాన్ని స్వయంగా అనసూయే చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తాను 2013లో దేవిశ్రీ ప్రసాద్‌తో పని చేశానని చెప్పారు. ఆ సమయంలో తనకు అడివి శేష్‌తో పరిచయం ఏర్పడిందని అన్నారు. హీరోలంతా లైన్ వేయడానికి అప్రోజ్ అవుతారని అనుకుంటూ ఉండేదాన్నని చెప్పారు.
ఆ కారణంతోనే అడవి శేష్‌ను బాగా అవాయిడ్ చేసేదాన్నని అన్నారు. మూడు నెలల తర్వాత ఓ కాఫీ షాపులో శేష్ తనను కలిశాడని, తనను కూర్చో బెట్టి స్టోరీ నరేషన్ ఇచ్చాడని తెలిపారు. వాళ్ల సినిమాకు తన అవసరం అర్థమైందని అన్నారు. జబర్థస్త్‌లో తాను సీరియస్‌గా ఉండటం చూసిన శేష్.. ఆ పాత్రకు తనను ఎంపిక చేశారని చెప్పారు. కాగా, అనసూయ ప్రస్తుతం ఫ్లాష్ బ్యాక్ అనే తమిళ సినిమాలోనూ.. పుష్ప 2లోనూ నటిస్తున్నారు. మరి, హీరోలపై ఉన్న చెడు అభిప్రాయం కారణంగా అనసూయ.. అడివి శేష్‌ను దూరంగా పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
హీరో లు అందరు లైన్ వెయ్యడానికి అప్రోచ్ అవుతారు అనుకోని నేను తెగ avoid చేసేదాన్ని
Video Credit @rajeshmanne1 pic.twitter.com/ManFtpwRii
— Milagro Movies (@MilagroMovies) November 5, 2023