iDreamPost
android-app
ios-app

పుష్ప వాకింగ్ స్టైల్.. అప్పట్లోనే శ్రీహరి చేసి చూపాడు! సేమ్ టూ సేమ్ దించేశారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా చిత్రం పుష్ప. దీనికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు దర్శకుడు సుకుమార్. అయితే సుకుమార్ కూడా ఓ హీరోను కాపీ కొట్టాడట. ఇంతకు ఏంటంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా చిత్రం పుష్ప. దీనికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు దర్శకుడు సుకుమార్. అయితే సుకుమార్ కూడా ఓ హీరోను కాపీ కొట్టాడట. ఇంతకు ఏంటంటే..?

పుష్ప వాకింగ్ స్టైల్.. అప్పట్లోనే శ్రీహరి చేసి చూపాడు! సేమ్ టూ సేమ్ దించేశారు!

అల్లువారి పిల్లగాడు అర్జున్ అలియాస్ బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. స్టైలిష్ స్టార్ కాస్తా ఐకాన్ స్టార్‌గా అవతరించిన ఈ కుర్రాడు.. 80 ఏళ్లకు పైగా ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి హీరోగా జాతీయ అవార్డును తెచ్చిపెట్టి చరిత్రలో నిలిచిపోయాడు. కేరళలో మాత్రమే మల్లు అర్జున్‌గా గుర్తింపు పొందిన అతడిని ఇండియా వైడ్ కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కేలా చేసిన సినిమా పుష్ప. 2021లో రిలీజైన ఈ సినిమా డైలాగులు, పాటలు, డ్యాన్సులు విపరీతంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి విదితమే. ఇందులో ఇక పుష్ప.. పుష్ఫ రాజ్ అంటూ అతడి వాకింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీకి ప్రేక్షకులు ఫిదా అయిపోయి.. బ్లాక్ బస్టర్ హిట్ అందించారు.

ఇందులో పుష్పకు స్పెషల్ మ్యానరిజం ఉంటుంది. అదే ఓ భుజం పైకెత్తి (గూని వచ్చినట్లుగా) నడుస్తూ ఉంటాడు. ‘చూపే బంగారమాయేనా శ్రీవల్లి’ పాటలో అయితే ప్రత్యేకంగా కనిపిస్తుంది కూడా. సినిమా అంతా అలా మెయిన్ టైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఇది ఎప్పుడో ట్రై చేశాడు రియల్ స్టార్ శ్రీహరి. ఇప్పుడు అతడికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. అందులో శ్రీహరి వాకింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ పుష్పలో అల్లు అర్జున్ పోలినట్లు ఉంటుంది. ఇంతకు ఆ సినిమా ఏంటంటే.. ‘పృథ్వీ నారాయణ’ . 2002లో వచ్చిన ఈ సినిమాలో శ్రీహరి డ్యూయల్ రోల్‌లో నటించాడు. ఇందులో పృధ్వీ అనే క్యారెక్టర్ పోలీసు ఆఫీసర్ పాత్రలో.. నారాయణ అనే నెగిటివ్ క్యారెక్టర్‌లో కనిపిస్తాడు ఈ దివంగత నటుడు.

అందులోని నారాయణ క్యారెక్టర్ ఓ సన్నివేశంలో పుష్ప మేనరిజంతో కనిపిస్తాడు. మూవీ మొత్తం భుజం పైకెత్తి  నడుస్తాడు శ్రీహరి. ఇప్పుడు ఆ సీనే నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. పుష్ప కన్నా 19 సంవత్సరాల కన్నా ముందు ఈ సినిమా వచ్చింది. కాగా, అప్పుడే శ్రీహరి విలన్ పాత్రల నుండి హీరోగా షిఫ్ట్ అవుతున్న సమయంలో వచ్చిన చిత్రమే పృధ్వీ నారాయణ. దీన్ని చూసిన సోషల్ సైనికులు.. శ్రీహరిని కాపీ కొట్టారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తొలిసారిగా సుకుమార్ కాపీ కొట్టాడు అంటున్నారు. పుష్ప మేనరిజం అప్పట్లోనే శ్రీహరి చేశారంటూ రాస్తున్నారు. ఇక ఇలాంటి మేనరిజమే ట్రై చేశాడు వర్సటైల్ యాక్టర్ రావు రమేష్ కూడా. మహా సముద్రం సినిమాలో గూని బాబ్జీ పాత్రలో మెప్పించాడు. ఈ సినిమాకు కూడా 2021లో పుష్పకు రిలీజ్ కావడానికి రెండు నెలల ముందు రావడం గమనార్హం. ఇప్పుడు అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.