iDreamPost
android-app
ios-app

బ్రహ్మానందం ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్.. ఎందుకంటే?

  • Author singhj Published - 07:19 PM, Fri - 25 August 23
  • Author singhj Published - 07:19 PM, Fri - 25 August 23
బ్రహ్మానందం ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్.. ఎందుకంటే?

స్టార్ ప్రొడ్యూసర్​ అల్లు అరవింద్ తనయుడిగా, టాప్ హీరో చిరంజీవి మేనల్లుడిగా బరువు, బాధ్యతలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అల్లు అర్జున్. అహర్నిశలు శ్రమించి పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్​ను, ఫ్యాన్ ఫాలోయింగ్​ను సంపాదించుకున్నారు. చిన్న వయసులోనే తెరంగేట్రం చేసిన బన్నీ.. లైఫ్​కు సంబంధించిన ఎన్నో విలువైన పాఠాలను ఇక్కడే నేర్చుకున్నారు. గెలుపు వస్తే పొంగిపోకుండా, ఓటమి వస్తే కుంగిపోకుండా నిలబడటం అలవర్చుకున్నారు. తనను విమర్శించే నోళ్లను విజయాలతో మూయించారు. తనపై వేలెత్తి నిందించిన వారందరికీ నటనతోనే సమాధానం చెప్పారు.

తాజాగా నేషనల్ అవార్డు రావడంతో మరోమారు వార్తల్లో నిలిచారు అల్లు అర్జున్​. సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’లో అద్భుతమైన నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి పురస్కారానికి ఎంపికయ్యారు బన్నీ. ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్​గా కనిపించేందుకు ఆయన ఎంతగానో శ్రమించారు. కొన్ని గంటల పాటు మేకప్ వేయించుకునేవారు. చిత్తూరు మాండలికంలో మాట్లాడేందుకు స్పెషల్​గా ట్రైనింగ్ తీసుకున్నారు. సౌకర్యాలు లేని అడవుల్లో రేయింబవళ్లు షూట్​లో పాల్గొన్నారు. ఆయన శ్రమ ఏమాత్రం వృథా పోలేదు. ‘పుష్ప’ పాన్ ఇండియా హిట్​గా నిలవగా.. తాజాగా జాతీయ అవార్డు కూడా రావడంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. నేషనల్ బెస్ట్ యాక్టర్​గా ఎంపికైన బన్నీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డుకు ఎంపికైన తొట్ట తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్​ను అందరూ మెచ్చుకుంటున్నారు. దీంతో ఆయన నిన్నంతా అందరికీ థ్యాంక్స్ చెబుతూ గడిపేశారు. ఇవాళ హఠాత్తుగా హాస్య నటుడు బ్రహ్మానందం ఇంటికి వెళ్లారు బన్నీ. బ్రహ్మీ-బన్నీలు కలసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీళ్లిద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. సందర్భం దొరికినప్పుడల్లా బ్రహ్మానందాన్ని కలుస్తూనే ఉంటారు అల్లు అర్జున్. అయితే ఇటీవల బ్రహ్మీ రెండో కొడుకు మ్యారేజ్ జరిగింది. కానీ ఆ వేడుకకు బన్నీ వెళ్లలేకపోయారు. దీంతో ఇప్పుడు స్వయంగా బ్రహ్మీ ఇంటికెళ్లి, ఆయన ఫ్యామిలీని కలిశారు. వారితో చాలా సేపు స్పెండ్ చేశారు అల్లు అర్జున్.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetHoliganbetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbet