iDreamPost
android-app
ios-app

Video: హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టిన తమిళ్ హీరో అజిత్!

  • Published May 28, 2024 | 1:59 PM Updated Updated May 28, 2024 | 1:59 PM

Ajith Kumar: బైక్ రైడింగ్ అనగానే సౌత్ ఇండస్ట్రీలో ఠక్కున గుర్తుకువచ్చేది.. తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్. ఈయనకు బైక్ లన్నా, వాటిని రైడింగ్ చేయడం అన్న ఎంతో ఇష్టమనే సంగతి మనందరికి తెలిసిందే. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Ajith Kumar: బైక్ రైడింగ్ అనగానే సౌత్ ఇండస్ట్రీలో ఠక్కున గుర్తుకువచ్చేది.. తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్. ఈయనకు బైక్ లన్నా, వాటిని రైడింగ్ చేయడం అన్న ఎంతో ఇష్టమనే సంగతి మనందరికి తెలిసిందే. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

  • Published May 28, 2024 | 1:59 PMUpdated May 28, 2024 | 1:59 PM
Video: హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టిన తమిళ్ హీరో అజిత్!

చాలా మందికి బైక్ రైడ్ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే ధనవంతుల పిల్లలు ఖరీదైన బైకులను కొనుగోలు చేసి.. రైడ్స్ చేస్తుంటారు. అలానే పలువురు సెలబ్రిటీలు కూడా  బైక్ లను నడిపేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అలా బైక్ రైడింగ్ అనగానే సౌత్ ఇండస్ట్రీలో ఠక్కున గుర్తుకువచ్చేది.. తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్. ఈయనకు బైక్ లన్నా, వాటిని రైడింగ్ చేయడం అన్న ఎంతో ఇష్టమనే సంగతి మనందరికి తెలిసిందే. ఇప్పటికే ఆయనఅనేక బైక్ రేసుల్లో పాల్గొని అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఆయన హైదరాబాద్ రోడ్లపై బైక్ రైడింగ్ చేసి.. అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

తమిళ్ సూపర్ స్టార్ అజిత్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్ సినిమాలతో పాటు తెలుగులోనూ అనేక సినిమాల్లో నటించాడు. ఆయనకు టాలీవుడ్ లో కూడా గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విభిన్నమైన సినిమాల్లో నటిచడంలో అజిత్ ముందుంటారు. ఇక ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే.. అజిక్ కి బైక్ లంటే పిచ్చి. ఖాళీ సమయం దొరికిందంటే చాలు తన వద్ద ఉన్న సూపర్‌ బైక్‌ తో బయట చక్కర్లు కొడుతుంటారు. బైక్ లపై ఉన్న ఆసక్తితో ఒక్కోసారి వందల కిలోమీటర్లు సైతం రైడ్స్ చేస్తుంటారు. తాజాగా అజిత్‌ తన సూపర్‌ బైక్‌పై హైదరాబాద్‌ నగర రోడ్లపై చక్కర్లు కొట్టారు.

ప్రస్తుతం అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ అనే యాక్షన్ డ్రామా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్  నిర్మాణంలో అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో షూటింగ్‌ కోసం అజిత్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. దీంతో విరామం దొరికిన సమయంలో తన వద్ద ఉన్న బైక్‌పై సరదాగా రైడ్‌కు వెళ్తున్నాడు. సోమవారం సాయంత్రం కూడా అజిత్  తన సూపర్‌బైక్‌పై భాగ్యనగర రోడ్లపై చక్కర్లు కొడుతూ కనిపించారు. సాధారణ వ్యక్తిలాగానే ఎటువంటి సెక్యూరిటీ లేకుండా నగర రోడ్లపై అజిత్ బైక్ రైడ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

ఇక ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో గుడ్‌ బ్యాడ్ అగ్లీ షూటింగ్‌  జరుగుతుండగా.. అజిత్‌ కుమార్ టీంపై వచ్చే సీన్స్ ను చిత్రీకరిస్తున్నారని సమాచారం. హైదరాబాద్‌ షెడ్యూల్ పూర్తయిన తర్వాత  అజిత్‌ బృందం రష్యాకు వెళ్లనుందని ఇండస్ట్రీలో  ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మొత్తంగా అజిత్ హైదరాబాద్ రోడ్లపై బైక్ రైడ్ చేయడంతో ఆయన అభిమనులు ఖుషీ అవుతున్నారు. మరి.. ఈ వీడియోను మీరు వీక్షించించి..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş