Swetha
చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాను జనవరి 10 కి రిలీజ్ చేస్తాం అని ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ ఊహించని విధంగా ఆ ప్లేస్ లోకి గేమ్ ఛేంజర్ వచ్చింది. సో కొడుకు కోసం తండ్రి త్యాగం చేశాడు . అయితే ఇప్పుడు సంక్రాంతి రేస్ లో మరో ఇద్దరు బడా హీరోల సినిమాలు ఉన్నాయి.మరి రేస్ లో ఉన్న ఇద్దరిలో ఎవరు డ్రాప్ అవుతారు అనే సందేహాలు మొదలయ్యాయి.
చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాను జనవరి 10 కి రిలీజ్ చేస్తాం అని ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ ఊహించని విధంగా ఆ ప్లేస్ లోకి గేమ్ ఛేంజర్ వచ్చింది. సో కొడుకు కోసం తండ్రి త్యాగం చేశాడు . అయితే ఇప్పుడు సంక్రాంతి రేస్ లో మరో ఇద్దరు బడా హీరోల సినిమాలు ఉన్నాయి.మరి రేస్ లో ఉన్న ఇద్దరిలో ఎవరు డ్రాప్ అవుతారు అనే సందేహాలు మొదలయ్యాయి.
Swetha
రామ్ చరణ్ -శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ. ఇప్పటికే ఈ సినిమా అదిగో ఇదిగో అంటూ చాలా రిలీజ్ డేట్స్ మార్చింది. ముందుగా అనౌన్స్ చేసిన దాని ప్రకారం ఈ సినిమా ఆల్మోస్ట్ డిసెంబర్ లో రావాల్సింది. కానీ దానిని కాస్త 2025 సంక్రాంతికి పోస్ట్ పోన్ చేశారు. దీనితో చిరు సినిమా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాను జనవరి 10 కి రిలీజ్ చేస్తాం అని ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ ఊహించని విధంగా ఆ ప్లేస్ లోకి గేమ్ ఛేంజర్ వచ్చింది. సో కొడుకు కోసం తండ్రి త్యాగం చేశాడు . అయితే ఇప్పుడు సంక్రాంతి రేస్ లో మరో ఇద్దరు బడా హీరోల సినిమాలు ఉన్నాయి. చిరు కాబట్టి చరణ్ కోసం వెనక్కి తగ్గాడు. మరి రేస్ లో ఉన్న ఇద్దరిలో ఎవరు డ్రాప్ అవుతారు అనే సందేహాలు మొదలయ్యాయి.
చిరు సినిమాతో పాటు.. సంక్రాంతి రేస్ లో బాలకృష్ణ , వెంకటేష్ సినిమాలు ఉన్నాయి. వీటిలో అనిల్ రావి పూడి- వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే సినిమాకు.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అటు గేమ్ ఛేంజర్ కూడా ఇదే బ్యానర్ నుంచి వస్తుంది. సో ఒకే బ్యానర్ నుంచి రెండు చిత్రాలు వస్తే.. థియేటర్స్ కొరత తప్పదు. 2023 లో ఇదే జరిగింది. మైత్రి మూవీ బ్యానర్స్ నుంచి వాల్తేరు వీరయ్య , వీర సింహారెడ్డి సినిమాలు రిలీజ్ అయ్యాయి. అప్పుడు చాలా సెంటర్స్ లో బాలకృష్ణ సినిమాకు థియేటర్స్ దొరకలేదు. నిజానికి దానికంటే ముందే దసరాకు ఆ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అది కాస్త సంక్రాంతి వరకు వచ్చింది. ఇక ఇప్పుడు కూడా బాలకృష్ణ విషయంలో ఇదే రిపీట్ అయింది. బాలకృష్ణ- బాబీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ దసరాకు రిలీజ్ చేస్తారనే టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ మూవీ సంక్రాతి బరిలో నిలిచింది. ఇలా బాలకృష్ణకు సంక్రాంతికి రావడం ఆనవాయితిగా మారింది.
సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. ప్రతి ఏటా రెండు మూడు పెద్ద సినిమాలతో పాటు.. ఒకటి రెండు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. సోలోగా వచ్చి ఏలేద్దాం అనుకుంటే కుదరదు. కాంపిటీషన్ కచ్చితంగా ఉంటుంది. బాలకృష్ణ కే కాదు.. అటు వెంకటేష్ కు కూడా సంక్రాంతి అంటే సెంటిమెంట్ ఏ . సంక్రాంతికి వచ్చిన F2 మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలియనిది కాదు. ఇలా బాలకృష్ణ, వెంకటేష్ ,చరణ్ సినిమాలు ఒకేసారి రిలీజ్ చేస్తాం అంటే మాత్రం.. థియేటర్స్ కొరత తప్పదు. ఇందులో రెండు సేమ్ బ్యానర్ నుంచి ఉన్నాయి కాబట్టి.. వాటిలో వెంకీ మూవీ వెనక్కు తగ్గాల్సిందే. ఒకవేళ వెంకటేష్ మూవీ డ్రాప్ అయితే ఆ ప్లేస్ లో తండేల్ మూవీ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. లేదంటే తండేల్ మూవీ డిసెంబర్ లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక సంక్రాంతి బరిలో ఏ మూవీ తగ్గుతుందో.. ఏ మూవీ రిలీజ్ అవుతుందో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.