సినీ రంగంలో నిర్మాతగా రతన్ టాటా.. ఆయన నిర్మించిన ఏకైక సినిమా ఏదంటే?

Ratan Tata Aetbaar: ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా బిజినెస్ లోనే కాదు సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టారు. ఆయన బాలీవుడ్ లో ఓ సినిమాను నిర్మించారు. ఆ మూవీ ఏదంటే?

Ratan Tata Aetbaar: ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా బిజినెస్ లోనే కాదు సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టారు. ఆయన బాలీవుడ్ లో ఓ సినిమాను నిర్మించారు. ఆ మూవీ ఏదంటే?

రతన్ టాటా ఇక లేరు అన్న విషయాన్ని యావత్ ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది. వృద్ధాప్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణంతో దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థిస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఉన్న బిజినెస్ టైకూన్లలో ఒకరిగా రతన్ టాటా చెరగని ముద్ర వేశారు. వ్యాపార సామ్రాజ్యంలో మకుటం లేని రారాజుగా వెలుగొందారు. పారిశ్రామిక రంగంలో విశేషమైన కృషి చేశారు. టాటా కంపెనీని ఎవరెస్ట్ శిఖరం ఎత్తుకు తీసుకెళ్లిన ఘనత రతన్ టాటాదే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

టాటా ప్రొడక్ట్స్ పై ప్రజల్లో ఎనలేని నమ్మకం ఉంటుంది. వివిధ వ్యాపారాల్లోకి విస్తరించి అన్నింటిలో రానించారు. బిజినెస్ ఒక్కటే కాదు దేశం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు. పేదలను ఆదుకునేందుకు వేల కోట్లు ఖర్చు పెట్టారు. విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో ఆయన అందించిన సేవలు మరువలేనివి. ఏ వ్యక్తికైనా ఒక రంగంలో సక్సెస్ వచ్చిన తర్వాత మరో రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటారు. కొందరు బిజినెస్, రాజకీయాలు, సినిమాలు ఇలా ఎవరకి నచ్చిన రంగంలో వారు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. ఇదే రీతిలో వ్యాపార దిగ్గజం రతన్ టాటా బిజినెస్ లోనే కాకుండా సినీ రంగాన్ని కూడా పలకరించారు. సినీ నిర్మాతగా తన లక్ ని పరీక్షించుకున్నాడు. సినిమాలంటే ఇష్టం ఉన్న ఆయన ఓ సినిమా కూడా నిర్మించారు.

ఆయన నిర్మించిన మొదటి, చివరి సినిమా అదే. ఇంతకీ ఆ సినిమా ఏంటీ? అని ఆలోచిస్తున్నారా? అమితాబ్ బచ్చన్ నటించిన ఏత్ బార్ అనే మూవీ. బిగ్ బీ నటించిన ఏత్ బార్ అనే చిత్రానికి రతన్ టాటా నిర్మాతగా వ్యవహరించారు. నిజానికి ఈ సినిమాకు నలుగురు నిర్మాతలు ఉన్నారు. వారిలో రతన్ టాటా ఒకరు. జతిన్ కుమార్, ఖుష్రు బుద్రా, మన్‌దీప్ సింగ్ కూడా ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టారు. అయితే రతన్ టాటానే ఈ చిత్రానికి ప్రధాన నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా 2004లో విడుదలైంది.

1992లో వచ్చిన హాలీవుడ్ సినిమా ‘ఫియర్’ స్ఫూర్తితో ఏత్ బార్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు డైరెక్టర్ విక్రమ్ భట్. 2002లో విడుదలైన ఈ సినిమా బడ్జెట్ 9.50 కోట్లు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం 7.50 కోట్లు మాత్రమే రాబట్టింది. ప్రేక్షకులను మెప్పించలేక బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. ఈ చిత్రం బాక్స్ ఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో రతన్ టాటా మళ్లీ సినీ ఇండస్ట్రీవైపు చూడలేదు. మరి రతన్ టాటా సినిమా నిర్మించిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments