iDreamPost
android-app
ios-app

స్టార్ హీరో ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్ కొన్న అదా శర్మ!

  • Author singhj Published - 08:00 PM, Sat - 26 August 23
  • Author singhj Published - 08:00 PM, Sat - 26 August 23
స్టార్ హీరో ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్ కొన్న అదా శర్మ!

ఏ రంగంలోనైనా ఆటుపోట్లు, ఒడిదొడుకులు సహజమే. విజయం సాధించాలంటే కష్టాల కడలిని దాటాల్సిందే. సక్సెస్ వస్తే సంబురపడకుండా దాన్ని కొనసాగిస్తూ నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే మరిన్ని మైలురాళ్లు అధిగమించి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. సినీ రంగంలో కూడా కష్టాలు సహజమే. అంత సులువుగా ఇక్కడ సక్సెస్ దక్కదు. నిరంతరం శ్రమించే వారికే అది దక్కుతుంది. ఓటమిని ఒప్పుకోకుండా ప్రయత్నిస్తూ సక్సెస్ అయిన స్టార్స్ కొందరు ఉన్నారు. ఆ అరుదైన కోవలోకే వస్తారు ప్రముఖ నటి అదా శర్మ. ‘ది కేరళ స్టోరీ’ సినిమాతో ఆమె పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించారు.

ఈ స్థాయికి చేరుకోవడానికి అదా శర్మ చాలా కష్టపడ్డారు. తెలుగులో ఆమె చేసిన ‘హార్ట్ ఎటాక్’ మూవీ అంతగా ఆడలేదు. ఆ తర్వాత నటించిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలు మంచి హిట్స్​గా నిలిచినా అదాకు క్రెడిట్ దక్కలేదు. దీంతో తన మకాంను బాలీవుడ్​కు మార్చిన ఈ అందాల భామ.. అక్కడ కొన్ని సినిమాలతోనే మంచి గుర్తింపును దక్కించుకున్నారు. ఈ ఏడాది రిలీజైన ‘ది కేరళ స్టోరీ’తో బ్లాక్ బస్టర్​ హిట్​ అందుకున్నారు అదా. అలాంటి ఈ స్టార్ నటి నెక్స్ట్ సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అలాంటి టైమ్​లో అదాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది.

‘ఎంఎస్ ధోని’ మూవీతో ఆడియెన్స్ మనసులు దోచుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్. అయితే ఊహించని పలు పరిణామాలతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ముంబై బాంద్రా మాంట్ బ్లాంక్ అపార్ట్​మెంట్​లోని తన ఫ్లాట్​లో సుశాంత్ సూసైడ్ చేసుకున్నారు. అయితే ఆయన ఇంటిని ‘ది కేరళ స్టోరీ’ స్టార్ అదా శర్మ కొనుగోలు చేశారని బీటౌన్ సమాచారం. గతంలో ఈ ఇంటిని సుశాంత్ సింగ్ అద్దెకు తీసుకున్నారట. ప్రతి నెలా రూ.4.5 లక్షలు రెంట్ చెల్లించేవారట. ఇప్పుడు అదే ఇంటిని అదా కొన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఆమె ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అదా త్వరలో కొత్తింటికి మారబోతున్నారని రూమర్స్ వస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Tellychakkar Official ® (@tellychakkar)

Jojobet GirişMadridbetMariobetcasibommeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş