iDreamPost
android-app
ios-app

నా పెళ్ళి మీరు చేసేయకండ్రా బాబూ..

  • Published Mar 13, 2024 | 4:31 PM Updated Updated Mar 13, 2024 | 4:31 PM

టాలీవుడ్ అందాల నటి తాప్సి తన పెళ్లి గురించి కొన్ని వస్తున్న వార్తలపై.. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

టాలీవుడ్ అందాల నటి తాప్సి తన పెళ్లి గురించి కొన్ని వస్తున్న వార్తలపై.. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

  • Published Mar 13, 2024 | 4:31 PMUpdated Mar 13, 2024 | 4:31 PM
నా పెళ్ళి మీరు చేసేయకండ్రా బాబూ..

హ్హహ్హహ్హ.. ఈ కామెంట్ ఎవరు చేశారో తెలుసా? తెలుగు ప్రేక్షకులందరికీ చిరపరిచితురాలైన కథానాయకి తాప్సీ. ఈ మధ్య తాప్సీ పెళ్ళి గురించి పెద్ద హల్ చలే జరిగింది సోషల్ మీడియాలో. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జాతకాలు చెప్పేశారు. ముహూర్తాలు పెట్టేశారు. కానీ అవేవీ నామమాత్రంగా కూడా జరగలేదు. సరికదా.. తాప్సీకి హోంప్రంట్ లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయంట. మాకు చెప్పకుండా నువ్వు ముందు లీకులు ఇస్తున్నావేంటని ఇంట్లో వాళ్ళు కూడా పాపం అమ్మడిని నిలదీశారట. దాంతో తాప్సీ కొంచెం కాదు బాగా ఎక్కువగానే డిస్టర్బ్ అయింది. మరో విషయం మరో విషయం అయితే పోనీ అనుకోవచ్చు. కానీ పెళ్ళ కదా.. దాంతో తాప్సీ తట్టుకోలేకపోయింది. ఎవరి మట్టుకు వాళ్ళు తన పెళ్ళి బాధ్యతను నెత్తిమీద వేసుకుని తన నెత్తిమీదకి తీసుకొస్తున్నారని మండిపడింది. అంతకన్నా ఏం చెయ్యగలదు? వేయి కళ్ళతో కాపలా కాస్తున్న సోషల్ మీడియా నుంచి ఎవరైనా తప్పించుకోగలుగుతున్నారా?

తాప్సీ ఇందుకు మినహాయింపు కానే కాదు. సోషల్ మీడియా కళ్యాణమంటపంలో తాప్సీ పెళ్ళి చాలా సార్లు ఇప్పటికే చాలా సార్లు అయిపోయింది. ఇంక ఓర్చుకోలేక తాప్సీ నోరు పెట్టుకు పడింది. తప్పలేదు. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఈ మధ్య రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగానీలాటి సెలబ్రిటీల మేరేజెస్ జరిగిపోతుంటే ఉత్సాహం ఎక్కువై చాలా పబ్లికేషన్స్ కాస్త ముందడుగు వేశాయి.
ఈ బెడద పూర్తిగా తారా స్థాయికి చేరుకున్న తర్వాత తాప్సీ తలపడింది. కొంతమందిని అనుకున్న తర్వాత ఫైనల్ గా మిధయిస్ బోలో తన వరుణ్ణి వెతుక్కుందన్న విషయం ఇప్పటికే పబ్లిక్ కి తెలుసు. ఆ విషయాన్నే మరింత క్లారిటీతో తాప్సీ చెప్పింది.

Taapsee about her marriage

‘’ఎంతో వెతుకులాట తర్వాత నాకు నచ్చిన లేదా నాకు సరైన మనిషి దొరికాడు. నాకు కుర్రాడు కాదు కావాల్సింది. ఒక మెచ్యూర్డ్ మేన్ కావాలి. రెండిటికీ చాలా తేడా ఉంది. రిలేషన్ షిప్ లో రక్షణ,స్థిరత్వాన్ని నేను చూసుకుంటున్నాను. ఎమోషనల్ కనెక్ట్ లో కాంప్రమైజ్ కోరుకోవడం లేదు. నా పర్సనల్ అండ్ పొఫెషనల్ లైఫ్ మీద డీప్ ఇన్ఫ్లూయన్స్ చూపించే ఈ వ్యవహారంలో కుర్రాడిని కాదు, మెచ్యూర్డ్ మేన్ నే నేను కోరుకుంటున్నాను. ఇది ఒత్తిడిలో చేసే పనికాదు. నాకు నిశ్చయం అయినప్పుడు నేనే చెప్తాను కదా. మీరెందుకు ముందే తొందరపడిపోతారు. అన్నీ క్లియర్ అయిన తర్వాత నేను ప్రకటిస్తాను. అంతవరకూ నా ఫెళ్ళి నా ప్రమేయం లేకుండా మీరందరూ కలిపి చేసేయకండి’’ అని విరుచుకుపడింది తాప్సీ.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio