iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ బోల్డ్ హీరోయిన్! డేరింగ్ సినిమాలకి కేరాఫ్!

  • Published Apr 18, 2024 | 9:27 PM Updated Updated Apr 18, 2024 | 9:27 PM

పింక్ గౌను వేసుకుని.. డ్రస్ పట్టుకుని, బార్బీ బొమ్మలా ఫోజులిస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్. టాలీవుడ్ ప్రేక్షకులను తన చూపులతో, నవ్వులతో కవ్వించేస్తూ ఉంటుంది. ఇంతకు ఆమె ఎవరో చెప్పుకోండి చూద్దాం.

పింక్ గౌను వేసుకుని.. డ్రస్ పట్టుకుని, బార్బీ బొమ్మలా ఫోజులిస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్. టాలీవుడ్ ప్రేక్షకులను తన చూపులతో, నవ్వులతో కవ్వించేస్తూ ఉంటుంది. ఇంతకు ఆమె ఎవరో చెప్పుకోండి చూద్దాం.

  • Published Apr 18, 2024 | 9:27 PMUpdated Apr 18, 2024 | 9:27 PM
ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ బోల్డ్ హీరోయిన్! డేరింగ్ సినిమాలకి కేరాఫ్!

గతంలో సామాజిక మాధ్యమాలు లేనప్పుడు.. హీరోలు, హీరోయిన్లు షూటింగ్ లేనప్పుడు ఏం చేస్తారు.. ఏం తింటారు, ఎక్కడికి వెళుతుంటారు అనే అత్యుత్సాహంతో ఉండేవాళ్లు అభిమానులు. ఇక వారి ఫోటో పేపర్లలో పడితే.. కట్ చేసుకుని గోడలకు అంటించుకుని తమ అభిమానాన్ని ప్రదర్శించేవారు. అలాగే వారి గురించి న్యూస్ వస్తే పండుగ. రూమర్స్ వచ్చినప్పుడు హార్ట్ అయ్యేవారు. కానీ నేడు సోషల్ మీడియా పుణ్యమాని సెలబ్రిటీల ప్రైవేట్ లైఫ్ గురించి కూడా తెలుస్తోంది. ఇప్పుడు నేరుగా వారితోనే చిట్ చాట్ చేస్తున్నారు. గతంలో వచ్చిన రూమర్స్ క్లారిటీ చేసుకుంటున్నారు. అలాగే సెలబ్రిటీలు కూడా ఎప్పుడు లైమ్ లైట్‌లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ ఫోటో షూట్, ఫ్యామిలీ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.

ఇప్పుడు అలాంటి ఓ పిక్ నెట్టింట్లో దర్శనమిస్తోంది. ఇదిగో అదే ఈ ఫోటో. పింక్ గౌనులో బుట్టబొమ్మలా రెడీ అయిన ఈ చిన్నారి ఎవరో తెలుసా..? డేరింగ్ అండ్ గ్లామరస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఈ హీరోయిన్. యాక్టింగ్ అంటే విపరీతమైన ఫ్యాషన్.  నటించాలనుకుంటే నెగిటివ్, హీట్ పుట్టించే చిత్రాలకు కూడా నో చెప్పదు. బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చేందుకు ఎంతకైనా సిద్ధపడుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, పంజాబ్ చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు కుర్రాళ్ల గుండెల్లో కోపానికి బలైంది. అలాగే తన అందచందాలతో వీణలు మీటింది. ఇంతకు ఆమె ఎవరంటే.. ది మోస్ట్ టాలెంట్ అండ్ వర్సటైల్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఢిల్లీ నుండి వచ్చిన ఈ గర్ల్.. పంజాబీ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. అక్కడి గుడియాగా మారింది.

హిందీలో వీర్ కీ వెడ్డింగ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకుంది. తెలుగులో ఆర్ఎక్స్ 100 మూవీతో ఆమె నటనను చూసి.. భయపడిపోయారు కుర్రకారు. ప్రియుడు శివను మోసం చేసే ఇందు పాత్రలో నటించి మెప్పించింది. ఆ సమయంలో తీవ్రమైన నెగిటివిటీని మూటకట్టుకుంది. ఇది ఆమెకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టేలా చేశాయి. ఆర్డీఎక్స్ లవ్ , వెంకీ మామ, డిస్కో రాజా చిత్రాల్లో మంచి రోల్స్ దక్కాయి. అనగనగా ఓ అతిధి ఆహాలో విడుదలై గుడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. తీస్ మార్ ఖాన్, జిన్నా, మాయ పేటికతో పాటు హిందీ, పంజాబ్, కన్నడ చిత్రాలు చేసింది. త్రీ రోజెస్ వెబ్ సిరీస్ కూడా అలరించింది. ఇందులో జాన్వీ పాత్రలో మెరిసింది ఈ డాల్.

కానీ ఆమె పేరు మారుమోగేలా చేసిన చిత్రం మంగళవారం. గత ఏడాది రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. శైలు పాత్రలో పాయల్ నటించిందని చెప్పనక్కర్లేదు.. జీవించిందని చెప్పొచ్చు. ఓ డిజాస్టర్ బారిన పడటం.. దాని కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. నియంత్రించుకోలేకపోవడం వంటి సన్నివేశాల్లో ఆమె నటన సూపర్బ్. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. గోల్ మాల్, ఏంజెల్ అనే రెండు తమిళ సినిమాలున్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet