iDreamPost
android-app
ios-app

అభిమానులకు నయనతార స్పెషల్ రిక్వెస్ట్.. అలా చేయకండి అంటూ..!

  • Published Sep 13, 2024 | 6:21 PM Updated Updated Sep 13, 2024 | 6:21 PM

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి సీని ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా లేడీ సూపర్ స్టార్ గా మారింది. తాజాగా అభిమానులకు ఈ బ్యూటీ ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేసింది.

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి సీని ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా లేడీ సూపర్ స్టార్ గా మారింది. తాజాగా అభిమానులకు ఈ బ్యూటీ ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేసింది.

  • Published Sep 13, 2024 | 6:21 PMUpdated Sep 13, 2024 | 6:21 PM
అభిమానులకు నయనతార స్పెషల్ రిక్వెస్ట్.. అలా చేయకండి అంటూ..!

ఇటీవల కాలంలో సైబర్ కేటుగాళ్లు బాగా రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరిని  మోసం చేస్తున్నారు. అంతేకాక సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సినీ, రాజకీయ ప్రముఖలకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ కు గురువుతున్న సంగతి తెలిసింది. ఇప్పటికే పలువురు హీరో, హీరోయిన్స్ ఇన్ స్టా, ఎక్స్ అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి. తాజాగా ఈ లిస్ట్ లో కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం చేరింది.  తాజాగా త‌న ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయిన‌ట్ల నయనతార తెలిపింది.  ఈ క్రమంలోనే అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేసింది. మరి..ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి సీని ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా లేడీ సూపర్ స్టార్ గా మారింది. లేడీ ఓరియోటేడ్ సినిమాలు అనగానే నయనతారే గుర్తుకు వస్తుంది. సౌత్ ఇండియాలోని స్టార్ హీరోలందరి సరసన ఈ బ్యూటీ నటించింది. దర్శకుడు విఘ్నేశన్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇదే సమయంలో ఆమె సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అలానే అభిమానులు అడిగే ప్రశ్నలకు ఆమె రిప్లయ్ ఇస్తుంటారు. ఇది  ఇలా ఉంటే తాజాగా ఆమె ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఇదే విషయం ఆమె స్వయంగా చెప్పారు. ఈ మేరకు త‌న అకౌంట్ నుంచి వ‌చ్చే మేసేజ్ లకు కానీ, ట్విట్ల‌కు కానీ స్పందించకండి అంటూ ఎక్స్ వేదిక‌గా రాసుకోచ్చింది. త‌న అకౌంట్ హ్యాక్‌పై సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాన‌ని త్వ‌ర‌లోనే మీ ముందుకు వస్తానని వెల్లడించింది.

ఇక నయనతార సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఇండస్ట్రీతో సంబంధం లేకుండా మూవీలు చేస్తోంది. గత ఏడాది షారుఖ్ ఖాన్ సరసన ‘జవాన్’ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ సినిమాతో ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు తమిళ్ తో పాటు కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా ఉంది. టెస్ట్ సినిమాతో పాటు త‌ని ఒరువ‌న్ పార్ట్ 2, మ‌న్న‌న్‌గ‌ట్టి 1960, డియ‌ర్ స్టూడెంట్స్ ఇలా బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ తో నయనతార బిజీగా ఉంది. మరీ..ఇలా సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom