iDreamPost
android-app
ios-app

మోహన్ బాబు నన్ను కావాలనే తోసేశారు.. ’సూపర్ ఉమెన్‘ లిరిషా

  • Published Mar 21, 2024 | 11:50 AM Updated Updated Mar 21, 2024 | 11:50 AM

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన డిసిప్లేన్, పంక్చువాలిటీకి ప్రాధాన్యతనిస్తారన్న సంగతి విదితమే. అయితే ఆయనపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది నటి లిరిషా

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన డిసిప్లేన్, పంక్చువాలిటీకి ప్రాధాన్యతనిస్తారన్న సంగతి విదితమే. అయితే ఆయనపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది నటి లిరిషా

  • Published Mar 21, 2024 | 11:50 AMUpdated Mar 21, 2024 | 11:50 AM
మోహన్ బాబు నన్ను కావాలనే తోసేశారు.. ’సూపర్ ఉమెన్‘ లిరిషా

ఇండస్ట్రీలో ఉన్న బడా ఫ్యామిలీల్లో ఒకటి మంచు ఫ్యామిలీ. మంచు మోహన్ బాబు నుండి మొదలైన నటనా వారసత్వం.. ఆయన మనవడు అవ్రామ్ వరకు పాకింది. అవ్రామ్ కూడా త్వరలో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కన్నప్పతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక ఈ కుటుంబానికి పెదరాయుడు మంచు మోహన్ బాబు. గాంభీర్యమైన గొంతు, ముక్కుసూటి తనం, పంక్చువాలిటీ ఆయన్ను ఇండస్ట్రీలో కోపిష్టిగా నిలబెట్టాయి. హీరోయిన్లపై అరిచేవారన్న అపవాదు కూడా ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఓ సీనియర్, సీరియల్ నటి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఆమె ఎవరంటే లిరిషా కూనపురెడ్డి అలియాస్ సరళా దేవి. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో ‘సూపర్ ఉమెన్’ పోలీసాఫీసర్ క్యారెక్టర్‌లో నటించింది ఈమెనే.. ఆ సినిమాతో లిరిషా ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకుంది.

ఎప్పటి నుండో బుల్లితెర, వెండితెరపై కనిపిస్తున్నప్పటికీ.. ఆమెకు పేరు తెచ్చింది మాత్రం వకీల్ సాబే. చిన్న, చితకా సినిమాలు చేసిన.. ఆమెకు గుర్తింపు దక్కిన చిత్రం పొలిటికల్ రౌడీ. పొలిటికల్ రౌడీ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మోహన్ బాబుపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ‘పొలిటికల్ రౌడీ సినిమాలో ఛార్మీ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో చేశాను. అందులో నన్ను చూసుకోవాలి..అద్బుతం, అదొక కళాఖండం( వెటకారం). అక్కడ నుండి ఇక్కడ వరకు ఎలా మారాను, ఎలా నేర్చుకున్నాను అనేది నాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆలీ సర్.. ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉందని చెప్పి..మోహన్ బాబుది వచ్చేసేయ్ అన్నారు. మోహన్ బాబు అంటే నాకు భయం. ఆయన్ను సడెన్‌గా చూసే సరికి నోట మాటరాలేదు. కానీ ఆయన చాలా ఫ్రెండ్లీ’ అని చెప్పారు లిరిషా.

Mohan Babu pushed me at will

‘ఫస్ట్ డే వెళ్లాను.. హాయ్ సర్ అన్నాను. ఓకే నువ్వేనా.. ఊ.. చేయ్ అన్నారు. నేను ఫస్ట్ డే షూట్ సమయంలో ఎక్కువ ఛార్మీతో ఉన్నాను. ఆదినారాయణ డైరెక్టర్ చాలా కష్టపడి.. నాతో వర్క్ చేయించుకున్నారు. సీన్ టు సీన్ ఎక్స్ ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చాను. ఈ మూవీ సమయంలో ప్రకాష్ రాజ్ నన్ను తోసేసే సీన్ ఉంది. ఎంత కష్టపడ్డా నేను పడలేకపోతున్నా. అప్పుడు కొత్త పడమంటే.. ఎలా పడతాను. మోహన్ బాబు గారూ చూసి.. చూసి.. టేక్ పెట్టండని చెప్పి.. వెనక నుండి వచ్చి ఒక్క తోపు తోస్తే కింద పడిపోయాను. ఇలా చూశాను. షాక్ ఆయన ఉన్నారు.  కరెక్ట్ గా వచ్చింది సార్ అని అనగానే.. అది అని అన్నారు మోహన్ బాబు. అంతలో కింద రాళ్లు ఉండటంతో చేతులు కొట్టుకపోయాయి. వెంటనే వాటర్, క్రీమ్ తెప్పించి.. ఆయిల్ మెంట్ రాసి ఇది యాక్టింగ్ అని చెప్పి వెళ్లిపోయారు’ అని వెల్లడించింది.

షూటింగ్ సమయంలో ఆయనతో జరిగిన ఎక్స్ పీరియన్స్ గురించి మాట్లాడుతూ ‘ఆయనతో చాలా ఎక్స్ పీరియన్స్ జరిగింది. కూర్చొబెట్టుకుని ఆ .. ఏంటీ.. ఎన్ని గంటలకు వచ్చావ్ అని అడిగారు. ఆయన మూవీలో 5 లేదా 5.30కి సెట్స్‌కి వచ్చేసేదాన్ని. ఈ టైం విషయంలో ఎవరికో క్లాస్ పీకడం గురించి చూశా. దీంతో నేను అనిపించుకోకూడదని వచ్చేసేదాన్ని. ఆయనకు చాలా డిసిప్లేన్. ఆయన దగ్గర నుండి అదే నేర్చుకున్నాను. ఒక యాక్టర్ ఎలా ఉండాలి. ఎలా బిహేవ్ చేయాలి అని మోహన్ బాబు దగ్గర నుండి చాలా నేర్చుకున్నా’ అని పేర్కొంది సూపర్ ఉమెన్ లిరిషా.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet