iDreamPost
android-app
ios-app

Anjali:16 అడుగుల ఎత్తు నుంచి దూకేసిన అంజలి! అసలేం జరిగిందంటే..

అంజలి.. ఈ పేరు  తెలియని టాలీవుడ్ ప్రేక్షకులను ఉండరు. తెలుగు అమ్మాయే అయినప్పటికే.. తమిళ ఇండస్ట్రీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే తన 50 సినిమాలో ఓ డేరింగ్ యాక్టివిటి చేసింది.

అంజలి.. ఈ పేరు  తెలియని టాలీవుడ్ ప్రేక్షకులను ఉండరు. తెలుగు అమ్మాయే అయినప్పటికే.. తమిళ ఇండస్ట్రీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే తన 50 సినిమాలో ఓ డేరింగ్ యాక్టివిటి చేసింది.

Anjali:16 అడుగుల ఎత్తు నుంచి దూకేసిన అంజలి! అసలేం జరిగిందంటే..

సినిమాలు అంటే కేవలం మనకు వెండితెరపై కనిపించే ఎంజాయ్ మాత్రమే కాదు.. తెర వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ముఖ్యంగా కొందరు హీరో, హీరోయిన్లు సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేస్తుంటారు. ఇక మూవీ బాగా వచ్చేందుకు వాళ్లు ఎంత రిస్క్ తీసుకోవడానికైన వెనుకాడరు.  అలా కష్టపడి పని చేసిన చాలా మంది హీరోలు..నేడు సూపర్ స్టార్లుగా వెలుగొందుతున్నారు. అలానే కొందరు హీరోయిన్లు కూడా అదే స్థాయిలో సినిమాల కోసం ప్రాణం పెట్టి పని చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో సాహసాలు సైతం చేస్తుంటారు. తాజాగా అంజలి కూడా అలాంటి ఓ డేరింగ్ యాక్టివిటీ చేసింది.  16 అడుగుల ఎత్తు నుంచి దూకేసినట్లు సమాచారం. ఇక అసలు స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

అంజలి.. ఈ పేరు  తెలియని టాలీవుడ్ ప్రేక్షకులను ఉండరు. తెలుగు అమ్మాయే అయినప్పటికే.. తమిళ ఇండస్ట్రీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఏ క్యారెక్టర్ లో అయినా ఒదిగిపోయే అతి తక్కువ మంది నటీమణుల్లో అంజలి కూడా ఒకరు అని చెప్పొచ్చు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడిని మార్చి టాలీవుడ్ తో నటిగా పరిచయమైనా, కోలీవుడ్ లో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. షాపింగ్ మాల్, జర్నీ వంటి సినిమాలతో సూపర్  క్రేజ్ సంపాదించింది. ఆ తరువాత అనేక సినిమాల్లో నటించింది. అంతేకాక టాలీవుడ్ లోని పలువురు స్టార్ హీరోల సరసన కూడ అంజలి నటించింది. టాలీవుడ్ లో మంచి మంచి పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది అంజలి.

ఇక అంజలి కెరీర్‌ ప్రారంభంలో పలు వివాదాల్లో చిక్కుకున్నా… ఆ తర్వాత వాటికి దూరంగా రావడంతో పాటు మళ్లీ ట్రాక్ లో పడింది. ఇక ఈ బ్యూటీ పేరు చెప్పగానే తమిళం, తెలుగు భాషల్లో సినిమాలే ఎక్కువగా గుర్తుకు వస్తాయి. కట్రదు తమిళ్, అంగాడి తెరు, గీతాంజలి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె పువ్వు, మసాలా, వకీల్ సాబ్ , జర్నీ వంటి చిత్రాలు అంజలికి  మంచి గుర్తింపు తెచ్చాయి. మొత్తంగా అంజలి కెరీర్‌ పరంగా అర్ధ సెంచరీని దిగ్విజయంగా టచ్‌ చేసేంది. ప్రస్తుతం 50 సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఇప్పటికీ సినిమాలు, వెబ్‌ సీరీస్‌ల్లో యాక్ట్ చేస్తూ ఈ అమ్మడు బిజీ బిజీగా ఉంది. తాజాగా అంజలి హీరోయిన్ ఈగై అనే సినిమాలో నటిస్తుంది.

ఇది అంజలి కెరీర్ 50వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాకు అశోక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక సన్నివేశం కోసం అంజలి 16 అడుగుల ఎత్తు నుంచి ఎలాంటి డూప్‌ లేకుండా కిందికి దూకినట్లు మూవీ టీమ్ తెలిపింది. ఇది ఇలా ఉంటే…శంకర్‌ దర్శకత్వంలో రామ్ చరణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న గేమ్‌చేంజర్‌ చిత్రంలో అంజలి ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. అలానే ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కూడా అంజలి కనిపించింది. ఆ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొత్తంగా 16 అడుగుల ఎత్తు నుంచి డూప్ లేకుండా అంజలి దూకేసిన విషయంలో పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet