వీడియో వైరల్: భారీ వర్షంను సైతం లెక్కచేయని సోనూసూద్.. దేవుడిలా ప్రజలకు సాయం

Sonu Sood: రీల్ స్టార్ నుంచి రియల్ స్టార్ గా మారి లక్షలాదిమంది అభిమానులను సొంత చేసుకున్నారు సోనూసూద్. ఈయన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. సాయం అనే మాటకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ నటుడు తాజాగా మరోసారి భారీ వర్షంను సైతం లెక్క చేయకుండా సాయం కోసం వచ్చిన ప్రజలను కలిశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sonu Sood: రీల్ స్టార్ నుంచి రియల్ స్టార్ గా మారి లక్షలాదిమంది అభిమానులను సొంత చేసుకున్నారు సోనూసూద్. ఈయన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. సాయం అనే మాటకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ నటుడు తాజాగా మరోసారి భారీ వర్షంను సైతం లెక్క చేయకుండా సాయం కోసం వచ్చిన ప్రజలను కలిశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వెండితెరపై రీల్ స్టార్ గా అలరించిన నటులుకన్నా.. బయట రియల్ స్టార్ గా మెరిసిన నటులు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ ప్రముఖ నటుడు ‘సోనూ సూద్’ ఒకరు. ఈయన పేరు తెలియని ప్రేక్షకలంటూ ఎవ్వరూ ఉండరు. ముఖ్యంగా ఈయన మంచితనం, సాయం చేసే గుణం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుంటే మహామ్మరి కరోనా వంటి విపతత్కర పరిస్థితుల్లో కనిపించని దేవుడుకంటే.. కనిపించిన దేవుడిగా పేదలందర్నీ హక్కున చేర్చుకొని తనవంతు సాయం అందించి ఎన్నటికి మరువనీ రియల్ హీరోగా, స్టార్ గా నిలిచారు సోనూ సూద్. అంతేకాకుండా.. ఎవరికి ఏ చిన్నా కష్టమోచ్చిన నేను ఉన్నంటూ ముందుకు వచ్చి అందర్నీ అదుకునే మంచి దయగల హృదయం కలిగిన నటుడు సోన్ సూద్.

ఈ క్రమంలోనే ఒక నటుడిగా కాకుండా.. రియల్ హీరోగా మారి లక్షలాది మంది అభిమానులను సొంత చేసుకున్నాడు. ఇకపోతే ఎప్పుడు సినిమాల్లో నటిస్తూ బిజిబిజీగా గడిపిన ఈ నటుడు ఈ మధ్య ఎక్కువ శాతం సమయాన్ని ప్రజలకే కేటాయిస్తున్నారు. ఈ క్రమంలోనే వందలాది మంది ప్రజలు సాయం కోసం సోనూ సూద్ ఇంటికి వెళ్తుంటారు. అలాగే సోనూ సూద్ కూడా కోరి తన దగ్గరకు వచ్చే వారి కష్టాలు విని తన అభయహస్తం అందిస్తారు. ఇదిలా ఉంటే..  గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నా విషయం తెలిసిందే. దీంతో ముంబై నగరం అంతా వరదలతో ముంచేత్తుంది. దీంతో అక్కడ నగర ప్రజలంతా అవసరమైతే తప్ప మరి దేనికి కాలు బయట పెట్టలేక ఇంటికే పరిమితమయ్యారు.

కానీ, తాజాగా అక్కడ నగర ప్రజలు వందలాది సంఖ్యల్లో సోనూ సూద్ ను కలవడానికి ఆయన ఇంటికి దగ్గరకు వెళ్లారు. అయితే సోనూసూద్ భారీ వర్షంలో కూడా గొడుగుతో బయటకు వచ్చి  సాయం కోసం వచ్చిన ప్రజలను కలిసి మరోసారి రియల్ హీరోగా మారారు. ఇక ఆ వర్షంలోనే.. ప్రజల కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. తన వంతు సాయం చేస్తానని వారికి మాట ఇచ్చాడు. అలాగే ఎవరినీ కాదనకుండా ఎంతో ఓపికగా అందరితో సెల్ఫీలు, ఫొటోలు దిగి వారి కళ్లల్లో ఆనందం నింపాడు. ప్రస్తుతం  ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్, అభిమానులు మరోసారి ఈ నటుడి గొప్పతనానికి మురిసిపోతూ ప్రశంసించారు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సోనూ సూద్ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments