Krishna Kowshik
జూనియర్ ఎన్టీఆర్-వివి వినాయక్ కాంబోలో వచ్చిన చిత్రం ఆది. యంగ్ టైగర్ నట విశ్వరూపాన్ని చూపించిన సినిమా ఆది. ఈ మూవీ మే 20న తారక్ పుట్టిన రోజును పురస్కరించుకుని రీ రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్ గా నటించింది కీర్తి చావ్లా. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
జూనియర్ ఎన్టీఆర్-వివి వినాయక్ కాంబోలో వచ్చిన చిత్రం ఆది. యంగ్ టైగర్ నట విశ్వరూపాన్ని చూపించిన సినిమా ఆది. ఈ మూవీ మే 20న తారక్ పుట్టిన రోజును పురస్కరించుకుని రీ రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్ గా నటించింది కీర్తి చావ్లా. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
Krishna Kowshik
నందమూరి వారసుడైనా సరే.. ఎటువంటి సపోర్టు తీసుకోకుండా ఎదిగిన నటుడు జూనియర్ ఎన్టీఆర్. చైల్డ్ ఆర్టిస్టుగా అలరించారు. అత్యంత చిన్న వయస్సులోనే హీరోగా మారి రెండో మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. లవ్ స్టోరీలతో మెప్పించాల్సిన వయస్సులోనే ఫ్యాక్షనిజం, రివేంజ్ వంటి వయస్సుకు మించిన పాత్రలతో మెప్పించాడు. ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా ఎవరికీ అందని క్రేజ్ దక్కించుకున్నాడు యంగ్ టైగర్. ప్రస్తుతం దేవర, వార్ 2, ప్రశాంత్ నీల్ మూవీలతో బిజీగా ఉన్నాడు తారక్. కాగా, మే 20న మ్యాన్ ఆఫ్ ది మాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సూపర్ హిట్ మూవీ ఆదిని రీ రిలీజ్ చేయగా.. ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. విజిల్స్, కేకలతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి.
యంగ్ టైగర్ నట విశ్వరూపాన్ని చూపించిన చిత్రమే ఆది. నిండా 20 ఏళ్లు లేని ఓ నూనుగు మీసాల కుర్రాడు.. 22 ఏళ్ల క్రితం కలెక్షన్లను షేక్ చేసేశాడు. ఇందులో తారక్ టూ షేడ్స్ ఆఫ్ యాంగిల్లో కనిపిస్తాడు. 2002 మార్చి 28న విడుదలైన ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకుడు. ఈ సినిమాలో మణి శర్మ అందించిన మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ మూవీకే హైలెట్. పాటలు బ్లాక్ బస్టర్ హిట్. ‘సున్నుండ తీసుకో ఓ మామ, నీ నవ్వుల చల్లదనాన్ని, పట్టు ఒకటో సారి, తొలి పిలుపే.. ఇది తొలి పిలుపే’ సాంగ్స్ ఇప్పటికీ వీనుల విందుగా ఉంటాయి. ఇక ఇందులో హీరోయిన్‌గా నటించింది అందాల భామ కీర్తి చావ్లా. నందు పాత్రలో కుర్రకారు గుండెల్ని మెలి పెట్టేసింది. బూరె బుగ్గలతో బబ్లీ బబ్లీగా తారక్‌కు ఫర్ ఫెక్ట్ జోడీగా మారింది.
గులామ్ ఏ ముస్తఫా అనే చిత్రంలో హిందీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్టుగా అడుగుపెట్టిన కీర్తి.. ఆది మూవీతో హీరోయిన్ అయ్యింది. ఈ సినిమా హిట్ కొట్టడంతో కుర్రాళ్ల క్రష్ బ్యూటీ అయిపోయింది. కానీ ఆ తర్వాత మెరుపులు చూపించలేకపోయింది. కాశీ, శ్రావణ మాసం, ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు, సాధ్యం, బ్రోకర్ వంటి చిత్రాల్లో నటించింది. అలాగే మన్మధుడు మూవీలో సాంగ్‌లో అలా వచ్చి.. ఇలా మాయం అయిపోతుంది. తెలుగులో అంత క్రేజ్ రాకపోయే సరికి కోలీవుడ్ వెళ్లిపోయింది. బొద్దుగా ఉండే భామలకు తమిళ ఇండస్ట్రీ బ్రహ్మరథం పడుతుంది కనుక.. అక్కడ మంచి పేరు తెచ్చుకుంది. 2011 బ్రోకర్ సినిమా తర్వాత తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. 2016లో ఓ తమిళ సినిమా చేసింది. ఆతర్వాత ఆమె కనిపించలేదు. అయితే ఇన్ స్టాలో ఆమె పేరుతో ఓ అకౌంట్ అయితే ఉంది. ఇందులో ఎప్పటికప్పడు ఆమెకు సంబంధించిన అప్ డేట్స్ ఉంటాయి. తాజాగా తారక్ పుట్టిన రోజును పురస్కరించి.. ఓ మేసేజ్ కూడా రాసింది ఈ బ్యూటీ. ఈమె మన హీరోయిన్ కీర్తిని అయ్యి ఉంటే.. ఇప్పటికీ ఏ మాత్రం అందం తగ్గలేదని అనిపిస్తోంది.