iDreamPost
android-app
ios-app

Aa Okkati Adakku: ‘ఆ ఒక్కటీ అడక్కు’.. మళ్లీ అంత హిట్ అవుతుందా?

  • Published Mar 05, 2024 | 12:19 PM Updated Updated Mar 05, 2024 | 12:19 PM

టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్స్​లో ఈవీవీ సత్యనారాయణ ఒకరు. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ చాలా స్పెషల్ ఫిల్మ్. ఎంతో హిస్టరీ ఉన్న ఈ మూవీ టైటిల్​తో మరో సినిమా వస్తోంది.

టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్స్​లో ఈవీవీ సత్యనారాయణ ఒకరు. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ చాలా స్పెషల్ ఫిల్మ్. ఎంతో హిస్టరీ ఉన్న ఈ మూవీ టైటిల్​తో మరో సినిమా వస్తోంది.

  • Published Mar 05, 2024 | 12:19 PMUpdated Mar 05, 2024 | 12:19 PM
Aa Okkati Adakku: ‘ఆ ఒక్కటీ అడక్కు’.. మళ్లీ అంత హిట్ అవుతుందా?

‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఈ సినిమాకు ఓ చరిత్ర ఉంది. మొదటి చిత్రం ‘చెవిలో పువ్వు’తో ఫ్లాప్ ఇచ్చి.. రెండో సినిమా ‘ప్రేమఖైదీ’తో సూపర్ హిట్ కొట్టారు ఈవీవీ సత్యనారాయణ. దర్శకుడుగా ఎస్టాబ్లిష్ అయ్యాక ‘సీతారత్నంగారి అబ్బాయి’, ‘అప్పుల అప్పారావు’తో హిట్ ఫిల్మ్​మేకర్​గా పేరుపడ్డాక 1992లో తీసిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఇళయరాజా మ్యూజిక్. రాజేంద్రప్రసాద్ హీరోగా, రంభని హీరోయిన్​గా ఇంట్రడ్యూస్ చేస్తూ గ్రేట్ బ్యానర్ ఏవియం నిర్మించిన సినిమా ఇది. జాతకాలు, నమ్మకాలు.. ఈ గొడవంతా భలే హిలేరియస్​గా ఉంటుంది సినిమా. ఈవీవీ రేంజ్​ను బాగా పెంచేసిన మూవీగా ‘ఆ ఒక్కటి అడక్కు’ గట్టిగా రికార్డయింది.

ఇప్పుడు మళ్లీ 32 ఏళ్ల తర్వాత ఈవీవీ సన్ అల్లరి నరేష్ హీరోగా అదే టైటిల్ తో మేకింగ్ లో ఉంది ‘ఆ ఒక్కటి అడక్కు’. టీజర్ చూస్తే ఇదీ పెళ్లి హడావుడి సినిమానే. అల్లరి నరేష్ చేస్తున్న 61వ ఫిల్మ్ ఇది. మల్లి అంకం తొలిసారి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ అయితే ‘ఆ ఒక్కటీ అడక్కు’ గానీ టీజర్ చూస్తే మాత్రం ఆ కథకి ఈ కథకీ ఏ మాత్రం సంబంధం లేదని తెలుస్తోంది. ‘మల్లీశ్వరి’ సినిమాలో వెంకటేష్ చేసిన పెళ్లికాని ప్రసాద్ వ్యవహారంలా కనిపిస్తోంది. ‘నాంది’, ‘ఉగ్రం’, మొన్నీ మధ్య హిట్ అయిన ‘నా సామిరంగా’ సినిమాల్లో పూర్తిగా తన కామెడీ ఎంటర్​టైన్​మెంట్ ఇమేజ్ నుంచి దూరం వెళ్లి మరీ సక్సెస్​ఫుల్ ఇమేజ్ సాధించుకున్న అల్లరి నరేష్ మళ్లీ ఎంటర్​టైన్ చేయడానికి సిద్ధమవుతున్నాడు.

టైటిల్ కారణంగా చాలా లౌడ్ బజ్​నే అందుకుంది ఈ ‘ఆ ఒక్కటీ అడక్కు’. అఫ్​కోర్స్.. నరేష్ కూడా చాలా ప్లస్ అవుతాడు సినిమాకి. తనకున్న పాపులారిటీ, గతంలో ఫాదర్ తీసిన సూపర్ హిట్ రెండూ ఈసారి సినిమాని చాలా వరకూ కాపాడుతాయి. కానీ ఈ పెళ్లికాని ప్రసాద్ గతంలో ఒకటి రెండు సార్లు వచ్చినదే కావడం, పైగా వెంకటేష్ చేసిన ‘మల్లీశ్వరి’ సినిమా అప్పుడు ధియేటర్లలోనే కాదు, తర్వాత టీవీల్లోనూ, యూట్యూబ్ లోనూ, రీల్స్, షాట్స్.. ఒకటి కాదు సవాలక్ష రకాలుగా పాపులర్ అయింది. పబ్లిక్ కూడా పదేపదే ఆ సీన్లు చూసిచూసి ప్రతీ డైలాగ్ కంఠస్తం పట్టేశారు.

ఇటువంటి పాపులర్ కంటెంటు, క్యారెక్టరు తీసుకుని మల్లి అంకం చేస్తున్న సాహసమే నరేష్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. మార్చి 21న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లు ఇంకా మొదలు పెట్టలేదు. క్యాంపెయిన్​లో ఏం చెప్తారో, ఎలా సినిమాని విశ్లేషిస్తారో మరి. మరో ప్లస్ పాయింట్.. ‘జాతిరత్నాలు’ వంటి హిట్ సినిమాలో హీరోయిన్ గా చేసిన ఫరీదా అబ్దుల్లా ఇందులో హీరోయిన్ కావడం. ఫరీదా ‘జాతిరత్నాలు’ తర్వాత మళ్లీ ఏ సినిమాలోనూ నటించలేదు. ఆ క్రేజ్ కొంత వరకూ సినిమాకి యాడ్ అవుతుంది. ఫైనల్ గా కథ, నెరేషన్ మాత్రమే సినిమాని నిలబెట్టాలి. బెస్టాఫ్ లక్ టు నరేష్ అండ్ డైరెక్టర్ మల్లి అంకం. మరి.. ‘ఆ ఒక్కటీ అడక్కు’ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: చరణ్‌ని ఇన్సల్ట్ చేసిందే కాకుండా కవర్ చేసే ప్రయత్నాలు

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet