iDreamPost
android-app
ios-app

ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్స్ 2023.. తగ్గని RRR హవా! 

68th Filmfare Awards South (Telugu) 2023: ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్స్ 2023ను తాజాగా ప్రకటించారు. ఈ అవార్డ్స్ లో ఆర్ఆర్ఆర్ మూవీ పంట పండింది. అత్యధికంగా అవార్డ్స్ ను కైవసం చేసుకుని సత్తాచాటింది. ఈ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ ఎన్ని గెలుచుకుంది? మిగతా సినిమాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

68th Filmfare Awards South (Telugu) 2023: ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్స్ 2023ను తాజాగా ప్రకటించారు. ఈ అవార్డ్స్ లో ఆర్ఆర్ఆర్ మూవీ పంట పండింది. అత్యధికంగా అవార్డ్స్ ను కైవసం చేసుకుని సత్తాచాటింది. ఈ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ ఎన్ని గెలుచుకుంది? మిగతా సినిమాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్స్ 2023.. తగ్గని RRR హవా! 

RRR.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ రికార్డు కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టడమే కాక.. ఏకంగా ఆస్కార్ అవార్డ్ ను సైతం దక్కించుకుంది. ఇక ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రకటించిన  ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్స్ 2023లో కూడా ఆర్ఆర్ఆర్ హవా ఇంకా తగ్గలేదు. ఈ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ ఎన్ని గెలుచుకుంది? మిగతా సినిమాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్స్ 2023ను తాజాగా ప్రకటించారు. గత సంవత్సరంతో పాటుగా 2022లో థియేటర్లలో విడుదలైన చిత్రాలను కూడా పరిగణంలోకి తీసుకుని ఈ అవార్డ్స్ ను ప్రకటించారు. దక్షిణాదిలోని నాలుగు భాషల్లో రిలీజ్ అయిన సినిమాలు లెక్కలోకి తీసుకున్నారు. ఇక ఈ అవార్డ్స్ లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ తన హవా చూపించింది. ఉత్తమ నటుడు విభాగంతో పాటుగా ఏకంగా 7 అవార్డులను దక్కించుకుంది. ఆ తర్వాత హనురాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం మూవీకి 5 అవార్డులు దక్కాయి. విరాట పర్వం, భీమ్లానాయక్ మూవీలు సైతం అవార్డ్స్ దక్కించుకున్నాయి. మరి ఏఏ మూవీ ఏ విభాగంలో అవార్డ్స్ దక్కించుకున్నాయో తెలుసుకుందాం.

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2023(తెలుగు) విన్నర్స్ వీరే:

    • ఉత్తమ సినిమా  – RRR
    • ఉత్త‌మ ద‌ర్శ‌కుడు – రాజ‌మౌళి RRR
    • ఉత్తమ యాక్ట‌ర్స్‌ – రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ (RRR )
    • బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – కీర‌వాణి (RRR)
    • ఉత్తమ ప్లేబ్యాక్ సింగ‌ర్ (మేల్) – కాల భైర‌వ (RRR కొమ‌రం భీముడో)
    • బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌ – రానా (భీమ్లా నాయ‌క్)
    • ఉత్తమ నటి – మృణాల్ ఠాకూర్ (సీతారామం)
    • బెస్ట్ ప్లే బ్యాక్ సింగ‌ర్ (ఫిమేల్) – చిన్మ‌యి శ్రీపాద (సీతారామం)
    • ఉత్త‌మ గేయ ర‌చ‌యిత‌గ – సిరివెన్నెల సీతారామ శాస్త్రి (సీతారామం)
    • ఉత్త‌మ స‌హాయ న‌టి – నందితా దాస్ (విరాట ప‌ర్వం)
    • బెస్ట్ యాక్ట‌ర్ క్రిటిక్స్ – దుల్క‌ర్ స‌ల్మాన్ (సీతారామం)
    • బెస్ట్ ఫిలిం క్రిటిక్స్ – సీతారామం
    • బెస్ట్ యాక్ట‌ర్ క్రిటిక్స్‌ విభాగం – సాయి ప‌ల్ల‌వి ( విరాట ప‌ర్వం)
    • ఉత్తమ కొరియోగ్రాఫర్ – ప్రేమ్ రక్షిత్(ఆర్ఆర్ఆర్-నాటు నాటు)
    • ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – సాబు సిరిల్(ఆర్ఆర్ఆర్)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి