P Krishna
Actress Aparna Passed away: ఈ మధ్య కాలంలో పలు ఇండస్ట్రీల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటుంన్నాయి. సినీ సెలబ్రెటీలు కన్నుమూయడంతో అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు.
Actress Aparna Passed away: ఈ మధ్య కాలంలో పలు ఇండస్ట్రీల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటుంన్నాయి. సినీ సెలబ్రెటీలు కన్నుమూయడంతో అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు.
P Krishna
ఇటీవల సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలతో పాటు ఇతర సాంకేతిక రంగానికి చెందిన ప్రముఖులు కన్నుమూస్తున్నారు. వయోభారం, అనారోగ్య సమస్యలు, హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాల వల్ల కొంతమంది చనిపోతే..మరికొంతమంది ఇండస్ట్రీలో సరైన కెరీర్ లేక మనస్థాపానికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఏది ఏమైనా సెలబ్రెటీలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకంది.. ప్రముఖ యాంకర్, నటి కన్నుమూశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ యాంకర్, నటి అపర్ణ వస్తారే (57) గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆమె లంగ్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.నటిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అపర్ణ తర్వాత కాలంలో టీవీ యాంకర్ గా వ్యవహరిస్తూ వచ్చారు. కన్నడలో మజా టాకీస్ షోలో వరలక్ష్మిగా బుల్లితెరపై మంచి పాపులారిటీ సంపాదించారు. మసవాడ పువ్వు చిత్రం అపర్ణకు ఎంతో మంది పేరు తీసుకువచ్చింది. నటి అపర్ణ 1966లో జన్మించింది. 1985 లో పుట్టన్న కనగల్ దర్శకత్వంలో ‘మసవాడ పువ్వు’ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది.
స్టార్ హీరో అంబరీష్ తదితరులు ఈ సినిమాలో నటించారు. ఆ తర్వాత సంగ్రామ, సాహసవీర, మాతృ వాత్సల్య, ఒలవిన ఆసరే, ఇన్స్‌పెక్టర్ విక్రమ్ ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. ఆమె చివరి చిత్రం ‘గ్రే గేమ్స్’. 2003లో ‘మూదల మావే’ సీరియల్ తో పాపులర్ అయిన అపర్ణ తర్వాత పలు సీరియల్స్ లో నటించారు. 2013లో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. 1998లో దీపావళి కార్యక్రమంలో ఎనిమిది గంటల పాటు నిరంతరంగా హూస్ట్ చేసి రికార్డు క్రియేట్ చేశారు. రెండేళ్లుగా ఆమె ఊపిరి తిత్తుల క్యాన్సర్ తో బాధపడుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆమె మరణ వార్త విన్న కన్నడ ఇండస్ట్రీ ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయింది. సినీ ప్రములు ఆమెకు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.