iDreamPost
android-app
ios-app

Bholaa Shankar : మెగా మూవీ భారమంతా మెహర్ మీదే

  • Published Mar 01, 2022 | 1:36 PM Updated Updated Mar 01, 2022 | 1:39 PM
  • Published Mar 01, 2022 | 1:36 PMUpdated Mar 01, 2022 | 1:39 PM
Bholaa Shankar : మెగా మూవీ భారమంతా మెహర్ మీదే

ఇవాళ మహా శివరాత్రి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. మాస్ మేనరిజంతో చిరు ఇచ్చిన ఫోజుకు అభిమానులు ఫుల్ హ్యాపీ అయ్యారు. మరి భయం దేని గురించనుకుంటున్నారా. వేదాళం రీమేక్ గా రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు దర్శకుడిగా మెహర్ రమేష్ ని ఫిక్స్ చేసినప్పటి నుంచి ఫ్యాన్స్ లో ఒకరకమైన టెన్షన్. అతని ట్రాక్ రికార్డు అలాంటిది మరి. ప్రభాస్ బిల్లా ఓ మోస్తరుగా ఆడినా అది ప్యూర్ రీమేక్ కావడంతో పూర్తి క్రెడిట్స్ ఇవ్వలేం. జూనియర్ ఎన్టీఆర్ పిలిచి మరీ శక్తి, కంత్రి ఆఫర్లు ఇస్తే వాటిని కనీస స్థాయిలోనూ రూపొందించలేక ఫ్లాపులు అందుకోవడం అంత సులభంగా మర్చిపోలేం.

ఏదో మేకోవర్ ప్లస్ డిఫరెంట్ గా ఉంటుందని వెంకటేష్ షాడోకు ఒప్పుకుంటే అది ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. వీటి దెబ్బకు మెహర్ రమేష్ చాలా కాలం దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత చిరంజీవి కోరి కోరి ఆఫర్ ఇస్తే దాన్ని ఉపయోగించుకుంటారా లేదా అనే అనుమానం లేకపోలేదు. ఇవాళ ఫస్ట్ లుక్ ఆ భయాన్ని కొంత వరకు తగ్గించిందనే చెప్పాలి. ఈ వయసులోనూ చిరంజీవి స్టైలిష్ లుక్ చూసి మూవీ లవర్స్ పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. కంటెంట్ యావరేజ్ ఉన్నా చాలు వసూళ్లకు గ్యారెంటీ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి మెహర్ ఎలా తీర్చిదిద్దుతున్నారో చూడాలి మరి.

భోళా శంకర్ లో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. సైరా తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా చిరుతో రెండో సినిమా చేస్తున్నారు. కీర్తి సురేష్ చెల్లెలి పాత్రకు ఒప్పుకోవడం మరో ఆకర్షణకు తోడయ్యింది. మెగాస్టార్ కు ఎన్నో ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ ఇచ్చిన మణిశర్మ వారసుడు మహతి స్వరసాగర్ కు వచ్చిన అతి పెద్ద ప్రాజెక్ట్ ఇదే. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ బడ్జెట్ తోనే దీన్ని రూపొందిస్తున్నారు. తమిళంలో గొప్ప విజయం సాధించిన వేదాళం రెగ్యులర్ యాక్షన్ డ్రామానే అయినప్పటికి కమర్షియల్ సినిమాకు కావాల్సిన హంగులన్నీ ఉంటాయి. కాకపోతే వాటిని మెహర్ పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేస్తే హిట్టు పడ్డట్టే

Also Read : RRR : రాజమౌళి టీమ్ దానికి భయపడటం లేదు

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet giriş