iDreamPost
android-app
ios-app

RRR : రాజమౌళి టీమ్ దానికి భయపడటం లేదు

  • Published Feb 28, 2022 | 4:21 PM Updated Updated Feb 28, 2022 | 4:21 PM
RRR : రాజమౌళి టీమ్ దానికి భయపడటం లేదు

ఇంకో పాతిక రోజుల్లో ఇండియా బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గ్రాండియర్ ఆర్ఆర్ఆర్ థియేటర్లలో రానుంది. ఈసారి ఎలాంటి అడ్డంకులు లేనట్టే. కరోనా దాదాపుగా తగ్గిపోయింది. ఎక్కడా సీరియస్ కేసులు లేవు. ఒక్క మహారాష్ట్ర తప్పించి అన్ని చోట్ల వంద శాతం ఆక్యుపెన్సీలు ఇచ్చేశారు. అక్కడ కూడా వచ్చే వారం నుంచి అన్ని ఆంక్షలు తీసేయబోతున్నారు. సో లేట్ అయినా సరే రాజమౌళి టీమ్ కి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చేందుకు ప్రేక్షక లోకం, ట్రేడ్ వర్గం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాయి. గత కొన్నేళ్లలో బాహుబలి తర్వాత ఆ స్థాయి ఓపెనింగ్స్ దీనికే దక్కబోతున్నాయని ముందస్తు విశ్లేషణలు చెబుతున్నాయి. రికార్డులు మిగలవని ఫ్యాన్స్ బలమైన నమ్మకం.

ఇక్కడా కొన్ని ట్విస్టులు లేకపోలేదు. ఆర్ఆర్ఆర్ రిలీజైన మరుసటి రోజే ఐపీఎల్ మొదలు కానుంది. దీనికి ఏ స్థాయి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ దీని గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎంత క్రికెట్ లవర్స్ అయినా సినిమాలు త్యాగం చేసి మరీ దానికే అతుక్కుపోరుగా. ట్రిపులార్ టాక్ బాగుందని తెలిస్తే ఆటోమేటిక్ గా వీలు చూసుకుని హాలుకు వెళ్ళిపోతారు. కాబట్టి ఇబ్బందేమీ లేదు. గతంలో బాహుబలి 2 కూడా ఐపీఎల్ కాంపిటీషన్ నిఫేస్ చేసింది. కానీ జక్కన్న మేజిక్ ముందు దాని ఎత్తులు పని చేయలేదు. సో ఈసారి ఏకంగా ఇద్దరు హీరోలు అండగా నిలబడ్డారు కాబట్టి భయపడాల్సిన పని లేదు. సంచలనాలు పక్కా.

ఆర్ఆర్ఆర్ థియేట్రికల్ బిజినెస్ కు సంబంధించిన డీటెయిల్స్ ఇంకా బయటికి రావడం లేదు. ఏపిలో కొత్త జిఓ త్వరలోనే రానుందన్న అంచనాతో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ లు వెయిటింగ్ లో ఉన్నారు. ఈ కారణంగానే మార్చి 11న వస్తన్న రాధే శ్యామ్ తాలూకు వివరాలు కూడా తెలియలేదు. ఒకవేళ టికెట్ రేట్లకు సంబంధించి అందులో సానుకూల అంశాలు ఏమైనా ఉంటే డీల్స్ కు సంబంధించిన ఫిగర్స్ లో ఖచ్చితమైన మార్పులు ఉంటాయి. లేదూ పాత ధరలే కొనసాగాలంటే మాత్రం రేట్లలో తగ్గుదల ఖాయం. సో టాలీవుడ్ కు మార్చి నెల అన్ని రకాలుగా చాలా కీలకంగా మారనుంది. ముఖ్యంగా రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ ల విషయంలో.

Also Read : Sebastian Trailer : రాత్రిపూట కళ్ళు కనిపించని పోలీసు కథ