nagidream
Best Budget Clothes Dryer Useful In Rainy Season For Who Lives In Apartments: వర్షాకాలం వచ్చిందంటే చాలు బట్టలు అస్సలు ఆరవు. తడితడిగా తేమగా ఉంటాయి. వేసుకోవాలంటే ఇరిటేషన్ వస్తుంది. అలాంటప్పుడు ఈ చిన్న మెషిన్ మీ ఇంట్లో ఉంటే నిమిషాల్లో బట్టలు ఆరబెట్టుకోవచ్చు. ధర కూడా తక్కువే.
Best Budget Clothes Dryer Useful In Rainy Season For Who Lives In Apartments: వర్షాకాలం వచ్చిందంటే చాలు బట్టలు అస్సలు ఆరవు. తడితడిగా తేమగా ఉంటాయి. వేసుకోవాలంటే ఇరిటేషన్ వస్తుంది. అలాంటప్పుడు ఈ చిన్న మెషిన్ మీ ఇంట్లో ఉంటే నిమిషాల్లో బట్టలు ఆరబెట్టుకోవచ్చు. ధర కూడా తక్కువే.
nagidream
వర్షాకాలం వచ్చిందంటే బట్టలు అస్సలు ఆరవు. ఇక అపార్ట్మెంట్లలో నివసించే వారి పరిస్థితి అయితే మరీ ఘోరం. ఉన్న మేడ మీద ఆరబెడదామంటే బోరున వర్షం.. బాల్కనీలో ఆరబెడదామంటే అక్కడ ఎన్నో బట్టలు పట్టవు. కొంతమందికైతే అసలు బట్టలు ఆరబెట్టుకోవడానికి బాల్కనీలే ఉండవు. దీంతో చాలా మంది బట్టలు ఆరబెట్టుకోవడానికి ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ సరికొత్త క్లాత్స్ డ్రైయర్. దీంతో మీరు మీ దుస్తులను ఈజీగా ఆరబెట్టుకోవచ్చు. మీరు టైంకి ఆఫీసులకు, పిల్లలు స్కూల్ కి వెళ్లిపోవచ్చు. క్షణాల్లో బట్టలు ఆరిపోతాయి.
సూప్ వాక్స్ కంపెనీకి చెందిన పోర్టబుల్ క్లాత్స్ డ్రైయర్ అప్ గ్రేడెడ్ మినీ డ్రైయర్ ఒకటి ఈ వర్షాకాలంలో బాగా ఉపయోగపడుతుంది. ఇది 600 వాట్ పవర్ అవుట్ పుట్ తో.. స్మార్ట్ టైమర్ ఫీచర్ తో వస్తుంది. చిన్న చిన్న బట్టలు, బేబీ దుస్తులు, ఇన్నర్ వేర్స్ వంటి వాటిని ఈజీగా ఆరబెట్టుకోవచ్చు. దుస్తుల మీద చిన్న చిన్న సూక్షజీవులు ఉంటే తొలగిస్తుంది. ముక్కు వాసన రాకుండా ఆపుతుంది. అంతేకాదు ముడతలను కూడా తొలగిస్తుంది. చిన్న చిన్న దుస్తులను అయితే వెంటనే ఆరబెడుతుంది. అయితే చొక్కాలు, ప్యాంట్లు వంటివి మాత్రం ఆరడానికి సమయం పడుతుంది. సిల్క్, వూల్, రియల్ సిల్క్, డౌన్ ఫెదర్ వంటి దుస్తులు ఆరడానికి 60 నుంచి 180 నిమిషాల సమయం పడుతుంది. అదే కాటన్, హెస్సేన్, నైలాన్, చిన్లాన్ వంటి దుస్తులను ఆరబెట్టేందుకు 180 నుంచి 300 నిమిషాల సమయం పడుతుంది. 360 డిగ్రీల వేడి గాలి ప్రసరణతో ఇది పని చేస్తుంది. త్రీ డైమెన్షనల్ స్పీడ్ డ్రైయింగ్ ఫీచర్ తో వస్తుంది.
ఇది చాలా చిన్నదిగా ఉంటుంది. ఊర్లు వెళ్ళినప్పుడు వెంట తీసుకుని వెళ్ళవచ్చు. దీనికొక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్ లో దుస్తులను పెట్టాలి. ఆ తర్వాత ఈ డ్రైయర్ ని ఆన్ చేస్తే మీ దుస్తులను ఆరబెడుతుంది. ప్యాంటు, షర్టు వంటివి ఆరబెట్టడానికి సమయం పట్టినా గానీ అర్జెంట్ గా బయటకు వెళ్లాల్సి వచ్చిన సమయంలో ఇన్నర్ వేర్స్ తడిగా ఉంటే వెంటనే ఆరబెట్టుకోవచ్చు. పై బట్టలు బైక్ మీద వెళ్తున్నప్పుడు గాలికైనా ఆరతాయ్ కానీ లోదుస్తులు అంత త్వరగా ఆరవు. దీని వల్ల సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఈ వర్షాకాలంలో బట్టలు ఆరడం లేదని బాధపడేవారికి ఈ మెషిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 5,249 కాగా ఆఫర్ లో మీరు దీన్ని రూ. 3,498 కే సొంతం చేసుకోవచ్చు. అదనంగా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల మీద 500 రూపాయల వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/3Y5rZTI)
జోటిమో కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వార్మర్ మెషిన్ ఉంది. ఒకేసారి 8 బట్టలను ఆరబెట్టుకోవచ్చు. 10 కేజీల కెపాసిటీతో వస్తుంది. క్విక్ డ్రై, డెలికేట్ ఫీచర్స్ ఇచ్చారు. క్విక్ డ్రై ఫీచర్ తో 20 నిమిషాల్లో 9 దుస్తులను ఆరబెడుతుంది. రిమోట్ తో ఆపరేట్ చేసేలా ఇంటిలిజెంట్ రిమోట్ కంట్రోల్ ని ఇచ్చారు. ఇది హ్యాంగర్ తో పాటు వస్తుంది. దీని అసలు ధర రూ. 5,999 ఉండగా ఆఫర్ లో రూ. 3,499కే అందుబాటులో ఉంది. అదనంగా ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డుల మీద రూ. 500 వరకూ తగ్గింపు లభిస్తుంది. ఈ మెషిన్ ని కప్ బోర్డులో లేదా ఎక్కడైనా ఒక స్టాండ్ కి తగిలించుకుని దాని హ్యాంగర్ కి దుస్తులు తగిలించి మెషిన్ ఆన్ చేస్తే చాలు బట్టలు వేగంగా ఆరిపోతాయి. దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/3y5OnSa)
కోస్టార్ మ్యాటర్ హ్యాంగబుల్ అండ్ ఫోల్డబుల్ వార్మర్ మెషిన్ ఒకటి ఉంది. ఇది ఒక బ్యాగ్ తో పాటు వస్తుంది. ఈ బ్యాగ్ లో దుస్తులను పెట్టుకుని ఆరబెట్టుకోవచ్చు. దీని అసలు ధర రూ. 3,999 కాగా ఆఫర్ లో రూ. 2,554కే అందుబాటులో ఉంది. ఇది గంటలో 6 దుస్తులను ఆరబెడుతుంది. దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/4f3vPme)
డీఎంఆర్ 3 కేజీ ఫ్రంట్ లోడ్ టంబుల్ డ్రైయర్ మెషిన్ ఉంది. ఇది వాషింగ్ మెషిన్ కాదు. బట్టలను ఉతకదు, స్పిన్ చేయదు. కేవలం ఆరబెడుతుంది అంతే. వాషింగ్ మెషిన్ లో స్పిన్ అయిన దుస్తులను ఆరబెడుతుంది. చూడ్డానికి చిన్న వాషింగ్ మెషిన్ లా ఉంటుంది. అప్పుడే ఉతికిన బట్టలను ఈ మెషిన్ లో వేస్తే నిమిషాల్లో ఆరబెట్టేస్తుంది. దీని అసలు ధర రూ. 39,999 కాగా ఆఫర్ లో రూ. 16,299కే లభిస్తుంది. అదనంగా పలు బ్యాంక్ క్రెడిట్ కార్డుల మీద రూ. 1500 వరకూ తగ్గింపు పొందవచ్చు. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/3YaENrK)