iDreamPost
android-app
ios-app

10th పాసైతే చాలు.. TTDలో సర్టిఫికేట్ కోర్సులు.. ట్రైనింగ్ పూర్తైతే లక్ష రూపాయలు!

మీరు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? తిరుమల తిరుపతి దేవస్థానం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. టెన్త్ పాసైతే చాలు టీటీడీ సర్టిఫికేట్ కోర్సులు పూర్తి చేస్తే లక్ష రూపాయలు పొందొచ్చు.

మీరు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? తిరుమల తిరుపతి దేవస్థానం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. టెన్త్ పాసైతే చాలు టీటీడీ సర్టిఫికేట్ కోర్సులు పూర్తి చేస్తే లక్ష రూపాయలు పొందొచ్చు.

10th పాసైతే చాలు.. TTDలో సర్టిఫికేట్ కోర్సులు.. ట్రైనింగ్ పూర్తైతే లక్ష రూపాయలు!

ఉద్యోగం కోసం ఎదురుచూసి అలసిపోయారా? ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్టంగా మారిందా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. కేవలం పదోతరగతి పాసైతే చాలు లైఫ్ సెట్ అయ్యే అవకాశం కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీలో సర్టిఫికేట్ కోర్సుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ కోర్సులకు ఎంపికైతే ఉచిత భోజనం, వసతి కూడా కల్పిస్తోంది టీటీడీ. అంతే కాదు శిక్షణ పూర్తైతే లక్ష రూపాయలు కూడా అందిస్తోంది. మీరు చేయాల్సిందల్లా ఆలస్యం చేయకుండా అప్లై చేసుకోవడమే. మరి ఈ కోర్సుల కాలవ్యవధి ఎన్ని సంవత్సరాలు? వయోపరిమితి ఎంత? పూర్తి వివరాలు మీకోసం.

తిరుమల తిరుపతి దేవస్థానాలు శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల 2024-25 అకాడమిక్ ఇయర్ కి డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులో(సంప్రదాయ కళంకారి కళ) ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ కోర్సులలో చేరిన విద్యార్థిని విద్యార్థులకు ఒక లక్ష రూపాయల చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది టీటీడీ. ఆ తర్వాత శిక్షణలో ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులకు నిబంధనలకు లోబడి లక్ష రూపాయలు అందిస్తారు. ఈ సర్టిఫికేట్ కోర్సులకు అప్లై చేసుకునేందుకు 01-05-2024 నుంచి 17-06-2024 అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి. లేదా 0877-2264637, 9866997290 నెంబర్లను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.

ముఖ్యమైన సమాచారం:

కోర్సులు:

  • డిప్లొమా కోర్సు- 04 సంవత్సరాలు
  • సర్టిఫికేట్ కోర్సు- 02సంవత్సరాలు

విభాగాలు:

  • శిలా శిల్ప, సుదా(సిమెంట్) శిల్ప, ఆలయ నిర్మాణం, దారు(కొయ్య) శిల్ప, లోహ శిల్ప, సంప్రదాయ చిత్ర లేఖనం.

అర్హత:

  • అభ్యర్థులు పదోరతగతి పాసై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 15-20 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

  • రాత పరీక్ష, మౌఖిక పరీక్ష ఆధారంగా ఈ కోర్సులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ:

  • టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో అప్లై చేసుకుని, శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల, అలిపిరి రోడ్, తిరుపతి చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 01-05-2024

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 17-06-2024