ఈ కోర్సులు నేర్చుకుంటే జాబ్ వచ్చినట్లే! ప్రస్తుతం డిమాండ్ ఉన్న ఉద్యోగాలు ఇవే..

  • Author Soma Sekhar Published - 12:44 PM, Thu - 23 November 23

బిజినెస్ సొల్యూషన్స్ సేవల సంస్థ క్వెస్ కార్ఫ్ తన నివేదికలో ప్రస్తుతం మార్కెట్ లో డిమాండ్ ఉన్న జాబ్స్ కు, కోర్సులను సూచించింది. ఈ కోర్సులు నేర్చుకుంటే దాదాపు జాబ్ వచ్చినట్లే అని వివరించింది. మరి ఆ కోర్సులు ఏవో? ఇప్పుడు చూద్దాం.

బిజినెస్ సొల్యూషన్స్ సేవల సంస్థ క్వెస్ కార్ఫ్ తన నివేదికలో ప్రస్తుతం మార్కెట్ లో డిమాండ్ ఉన్న జాబ్స్ కు, కోర్సులను సూచించింది. ఈ కోర్సులు నేర్చుకుంటే దాదాపు జాబ్ వచ్చినట్లే అని వివరించింది. మరి ఆ కోర్సులు ఏవో? ఇప్పుడు చూద్దాం.

  • Author Soma Sekhar Published - 12:44 PM, Thu - 23 November 23

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగం రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతూ.. దూసుకెళ్తోంది. ఇక ఈ రంగానికి సంబంధించిన వివిధ కోర్సులు నేర్చుకుని ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం మార్కెట్ లోకి వస్తున్నారు. అయితే ఇలా మార్కెట్ లోకి వచ్చిన వారందరికీ జాబ్స్ రావడం లేదు. వారు చేసే చిన్న చిన్న పొరపాట్లకు తోడు.. వారు ఎంచుకునే కోర్సులు కూడా దీనికి కారణం అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఐటీ రంగంలో నియామకాలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. ఈ రంగానికి సంబంధించిన కొన్ని విభాగాల్లో నిపుణులకు మాత్రం డిమాండ్ బాగానే ఉంది. ఈ క్రమంలోనే బిజినెస్ సొల్యూషన్స్ సేవల సంస్థ క్వెస్ కార్ఫ్ తన నివేదికలో ప్రస్తుతం మార్కెట్ లో డిమాండ్ ఉన్న జాబ్స్ కు, కోర్సులను సూచించింది. ఈ కోర్సులు నేర్చుకుంటే దాదాపు జాబ్ వచ్చినట్లే అని వివరించింది. మరి ఆ కోర్సులు ఏవో? ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐటీ రంగంలో నియమకాలు గణనీయంగా తగ్గాయి. కానీ కొన్ని విభాగాల్లో మాత్రం నిపుణులకు డిమాండ్ మెరుగ్గానే ఉంది. “ప్రస్తుత మార్కెట్ లో ఫస్ట్ టైమ్ ఐటీ సర్వీసుల కంపెనీల్లో సిబ్బంది సంఖ్య, గైడెన్స్ తగ్గింది. దీంతో రాబోయే రోజుల్లో కంపెనీలు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిస్థితి ఒకటి, రెండు త్రైమాసికాల పాటు కొనసాగుతుందని భవిస్తున్నాం” అని క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈవో విజయ్ శివరామ్ చెప్పుకొచ్చారు. కాగా.. రాబోయే రెండు సంవత్సరాల్లో కృత్రిమ మేథ(ఏఐ)పై ఇన్వెస్ట్ చేయాలని 85 శాతానికి పైగా భారత కంపెనీలు భావిస్తున్నాయని ఆయన తెలిపారు. దీంతో యువత ఈ దిశగా కోర్సులు నేర్చుకోవాల్సిందిగా ఆయన సూచించారు.

అందులో భాగంగా.. తమ సంస్థ గమనించిన డిమాండ్, సరఫరా గణాంకాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు విజయ్ శివరామ్ తెలిపారు. ఈ నివేదికలో.. ఈఆర్పీ (ఎంటర్ ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్), ఆటోమోటీవ్ డిజైన్, టెస్టింగ్, డెవలప్ మెంట్, అడ్మినిస్ట్రేషన్ లాంటి ఈ 5 కోర్సులకు రాబోయే రోజుల్లో ఫుల్ డిమాండ్ ఉంటుందని సంస్థ తెలిపింది. ఇక ఈ నైపుణ్యాలకు సంబంధించి.. మెుత్తం ఉద్యోగాల్లో 65 శాతం వాటా ఉంటుందని తెలిపింది. ఈ కోర్సులకే కాకుండా.. డేటా సైన్స్, క్లౌడ్, జెన్ ఏఐ, ఆటోమోటివ్ ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ, నెట్ వర్కింగ్ స్పెషలైజేషన్ లాంటి కోర్స్ లకు కూడా భవిష్యత్ లో డిమాండ్ నెలకొంటుందని క్వెస్ తన నివేదికలో పేర్కొంది. ఇదిలా ఉండగా.. దేశంలోనే టెక్నాలజీ హబ్ గా పేరొందిన హైదరాబాద్, బెంగళూరును దాటి దూసుకెళ్తోంది. ఐటీ రంగంలో స్థిరపడాలనుకునేవారు ఈ కోర్సులు నేర్చుకుంటే భవిష్యత్ లో మంచి అవకాశాలు ఉంటాయని తెలిపింది.

Show comments