iDreamPost
android-app
ios-app

అడుగడుగునా అవమానాలు.. ఇది హార్దిక్ తప్పు కాదు.. ముమ్మాటికీ ముంబైదే!

  • Published Apr 02, 2024 | 1:55 PM Updated Updated Apr 02, 2024 | 1:55 PM

ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు అడుగడుగునా అవమానాలే ఆహ్వానం పలుకుతున్నాయి. ఆఖరికి జట్టు సొంత మైదానమైన వాంఖడేలోనూ పాండ్యాకు అభిమానుల నుంచి నిరసన సెగ తగిలింది.

ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు అడుగడుగునా అవమానాలే ఆహ్వానం పలుకుతున్నాయి. ఆఖరికి జట్టు సొంత మైదానమైన వాంఖడేలోనూ పాండ్యాకు అభిమానుల నుంచి నిరసన సెగ తగిలింది.

  • Published Apr 02, 2024 | 1:55 PMUpdated Apr 02, 2024 | 1:55 PM
అడుగడుగునా అవమానాలు.. ఇది హార్దిక్ తప్పు కాదు.. ముమ్మాటికీ ముంబైదే!

అడుగడుగునా అవమానాలు, ఆడిన ప్రతి చోట ఛీత్కారాలు, దీనికి తోడు ఎగతాళి.. ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా పరిస్థితి ఇది. అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబై.. వెన్యూ మారినా హార్దిక్ సిచ్యువేషన్ మాత్రం మారలేదు. ఎక్కడికి వెళ్లి ఆడినా ఫ్యాన్స్ అతడ్ని టార్గెట్ చేసుకొని మరీ ట్రోల్ చేస్తున్నారు. వాంఖడే స్టేడియంలో రాజస్థాన్​తో నిన్న జరిగిన మ్యాచ్​లోనూ ఇది రిపీట్ అయింది. టాస్ దగ్గర నుంచి మ్యాచ్ పూర్తయ్యే వరకు అతడ్ని లక్ష్యంగా చేసుకొని బూ అంటూ ఎగతాళి చేశారు అభిమానులు. దీంతో కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ‘బిహేవ్’ అంటూ ఆడియెన్స్​ మీద సీరియస్ అయ్యాడు. అయినా వాళ్లు ఆగలేదు. బ్యాటింగ్​కు వస్తున్న టైమ్​లోనూ పాండ్యాను అవమానించారు. అయితే ఇందులో అతడి తప్పేమీ లేదు. అడుగడుగునా హార్దిక్ అవమానులు ఎదుర్కోవడానికి కారణం ముంబైనే.

ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఆ ఒక్క తప్పు చేయకపోయి ఉంటే హార్దిక్ సిచ్యువేషన్ మరోలా ఉండేది. కెప్టెన్సీ ఆఫర్ రావడంతో రెండేళ్ల కింద ఎంఐని వీడి వెళ్లిపోయాడు పాండ్యా. జీటీకి ఆడుతూ ఒక ఏడాది టీమ్​ను ఛాంపియన్​గా నిలిపాడు, మరో ఏడాది ఫైనల్స్​కు తీసుకెళ్లాడు. అదే కంటిన్యూ అయితే ఇప్పుడు కూడా గుజరాత్​కు ఆడుతూ హ్యాపీగా ఉండేవాడు పాండ్యా. కానీ జట్టు భవిష్యత్తు ముఖ్యం, రోహిత్ ఎక్కువ కాలం ఆడలేడు, కాబట్టి కొత్త సారథి కావాలని డిసైడ్ అయిన ముంబై ఫ్రాంచైజీ ఐపీఎల్-2024కు ముందు జరిగిన మినీ ఆక్షన్​లో పాండ్యాను ఏరికోరి తెచ్చుకుంది. భారీగా డబ్బులు వెచ్చించి మరీ తీసుకొచ్చి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పింది. అయితే ఇక్కడే ఆ టీమ్ మిస్టేక్ చేసింది. కెప్టెన్సీ మార్పు సమయంలో ముంబై వ్యవహరించిన తప్పిదమే హార్దిక్ కొంపముంచింది.

సూర్యకుమార్ యాదవ్, జస్​ప్రీత్ బుమ్రా లాంటి ఆప్షన్స్ ఉన్నా హార్దిక్ పాండ్యానే కెప్టెన్సీకి పర్ఫెక్ట్ అని ముంబై యాజమాన్యం భావించింది. అంతవరకు ఓకే, కానీ టీమ్​కు 5 కప్పులు అందించిన రోహిత్ శర్మ నుంచి సారథ్య బాధ్యతల్ని సక్రమంగా పాండ్యాకు అప్పగిస్తే బాగుండేది. కెప్టెన్సీ మార్పు టైమ్​లో జాగ్రత్తగా వ్యవహరించాల్సింది. కానీ హిట్​మ్యాన్​ను అవమానకర రీతిలో తొలగించడమే ఎంఐ చేసిన తప్పు. ఆడియెన్స్, ఫ్యాన్స్ హృదయాలు నొచ్చుకునేలా వ్యవహరించింది. అలా కాకుండా వాళ్ల మనులు గెలుచుకునేలా ఈ తతంగాన్ని ముగించి ఉంటే ఇప్పుడు హార్దిక్​కు అందరి నుంచి సపోర్ట్ దొరికేది. ఈ అవమానాలు, ఛీత్కారాలు అతడికి తప్పేవి. దీనికి ముమ్మాటికీ ముంబై యాజమాన్యం దుందుడుకు స్వభావం, అనవసర దూకుడు, నిర్లక్ష్యమే కారణమనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. మరి.. పాండ్యా సిచ్యువేషన్​కు ఎంఐ వ్యవహరించిన తీరే కారణమని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: RCB vs LSG: బెంగళూరు vs లక్నో.. గెలుపెవరిదంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!