iDreamPost

RCB vs LSG: బెంగళూరు vs లక్నో.. గెలుపెవరిదంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

  • Published Apr 02, 2024 | 11:22 AMUpdated Apr 02, 2024 | 11:22 AM

ఒకవైపు సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్న బెంగళూరు.. మరోవైపు విజయాల జోరును కొనసాగించాలని భావిస్తున్న లక్నో. ఈ ఇద్దరు హేమాహేమీల మధ్య పోరుకు చిన్నస్వామి స్టేడియం సిద్ధమైంది.

ఒకవైపు సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్న బెంగళూరు.. మరోవైపు విజయాల జోరును కొనసాగించాలని భావిస్తున్న లక్నో. ఈ ఇద్దరు హేమాహేమీల మధ్య పోరుకు చిన్నస్వామి స్టేడియం సిద్ధమైంది.

  • Published Apr 02, 2024 | 11:22 AMUpdated Apr 02, 2024 | 11:22 AM
RCB vs LSG: బెంగళూరు vs లక్నో.. గెలుపెవరిదంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

ఒకవైపు సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్న టీమ్.. మరోవైపు విజయాల జోరును కొనసాగించాలని చూస్తున్న జట్టు. ఈ ఇద్దరు హేమాహేమీల మధ్య పోరుకు చిన్నస్వామి స్టేడియం సిద్ధమైంది. ఆ జట్లు మరేవో కావు.. ఒకటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మరొకటి లక్నో సూపర్ జియాంట్స్. లాస్ట్ మ్యాచ్​లో ఓడిన ఆర్సీబీ.. గెలుపుతో గాడిన పడాలని చూస్తోంది. మొదటి మ్యాచ్​లో ఓడి, రెండో మ్యాచ్​లో నెగ్గిన లక్నో అదే జోరును కంటిన్యూ చేయాలని చూస్తోంది. ఈ రెండు టీమ్స్ మధ్య మంగళవారం రాత్రి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి? ఎవరు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి? లాంటివి ఇప్పుడు చూద్దాం..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఈ సాలా కప్ నమ్దే అంటూ సీజన్​ను నమ్మకంతో స్టార్ట్ చేసింది బెంగళూరు. తొలి మ్యాచ్​లో చెన్నై చేతిలో ఓడినా బాగానే పెర్ఫార్మ్ చేసింది. రెండో మ్యాచ్​లో పంజాబ్ కింగ్స్​ను ఓడించి మంచి ఊపు మీద కనిపించింది. కానీ కోల్​కతాపై మ్యాచ్​లో చేతులెత్తేసింది. సొంతగడ్డపై 7 వికెట్ల తేడాతో పరాజయం పాలై అభిమానుల్ని తీవ్రంగా నిరుత్సాహపర్చింది. మళ్లీ గాడిన పడాలని చూస్తున్న ఆర్సీబీలో చాలా నెగెటివ్స్ కనిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీ ఒక్కడు తప్ప ఎవరూ కన్​సిస్టెంట్​గా రన్స్ చేయడం లేదు. కెప్టెన్ డుప్లెసిస్ పూర్ ఫామ్ ఆ టీమ్​కు పెద్ద మైనస్.

కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్​వెల్ పరుగులు చేస్తున్నా వారి దగ్గర నుంచి ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా రాలేదు. రజత్ పాటిదార్ వరుసగా విఫలమవుతూ జట్టుకు భారంగా మారాడు. అనూజ్ రావత్ కూడా ఆశించిన మేర పెర్ఫార్మ్ చేయడం లేదు. వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్ తన రోల్​ను సరిగ్గా నిర్వర్తించడం కలిసొచ్చే అంశం. ఆర్సీబీకి ఇంకో పెద్ద మైనస్ బౌలింగ్. సిరాజ్, యష్ దయాల్, అల్జారీ జోసెఫ్​లు వికెట్లు తీయకపోగా భారీగా పరుగులు ఇచ్చుకుంటున్నారు.

లక్నో సూపర్ జియాంట్స్

పంజాబ్​పై గెలుపుతో లక్నో మంచి జోష్​లో ఉంది. తాత్కాలిక కెప్టెన్ నికోలస్ పూరన్ చెలరేగి బ్యాటింగ్ చేస్తుండటం లక్నోకు బిగ్ ప్లస్. క్వింటన్ డికాక్ ఫామ్​లోకి రావడం, కృనాల్ పాండ్యా జోరు మీద ఉండటం ఆ టీమ్​కు కలిసొచ్చే అంశాలు. కేఎల్ రాహుల్, పడిక్కల్ కూడా పరుగులు చేస్తే లక్నోకు తిరుగుండదు. గత మ్యాచ్ హీరో మయాంక్ యాదవ్ ఆ జట్టుకు అదనపు బలంగా మారాడు. గంటకు 150 కిలోమీటర్లకు తగ్గని బౌలింగ్​తో ప్రత్యర్థి బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడతను. మోసిన్ ఖాన్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నాడు. మిగిలిన బౌలర్లు కూడా రిథమ్​లోకి వస్తే లక్నోను ఆపడం కష్టమే.

ప్రిడిక్షన్

రెండు టీమ్స్ బలాబలాలను బట్టి ఈ మ్యాచ్​లో లక్నో గెలవడం పక్కా. జోరు మీదున్న లక్నోను బ్యాటింగ్​తో పాటు బౌలింగ్ యూనిట్ ఫెయిల్యూర్​తో బాధపడుతున్న బెంగళూరు ఆపడం కష్టం. ఇప్పటిదాకా ఈ ఇరు జట్లు నాలుగుసార్లు తలపడ్డాయి. అందులో 3 మ్యాచుల్లో ఆర్సీబీ నెగ్గగా.. ఒక మ్యాచ్​లో లక్నో గెలిచింది. అయితే బెంగళూరు ఆటగాళ్ల పెర్ఫార్మెన్స్​ను బట్టి చూస్తే ఈ మ్యాచ్​లో ఆ టీమ్​కు కష్టాలు తప్పేలా లేవు. ప్లేయర్ల ఫామ్​ను చూస్తుంటే లక్నో గెలవడం ఖాయం.

ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)

బెంగళూరు:
ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్​వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అనూజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, మయాంక్ డగర్, విజయ్​కుమార్ వైశాఖ్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్.

లక్నో:
క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), కైల్ మేయర్స్, దేవ్​దత్ పడిక్కల్, నికోలస్ పూరన్ (కెప్టెన్), మార్కస్ స్టొయినిస్, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, రవి బిష్ణోయ్, మోసిన్ ఖాన్, మయాంక్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్.

ఇదీ చదవండి: హార్దిక్​ను ఎగతాళి చేసిన ఫ్యాన్స్.. రోహిత్ ఏం చేశాడో తెలిస్తే మెచ్చుకోవాల్సిందే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి