Nidhan
ఐపీఎల్-2024లో రోహిత్ శర్మ కేవలం ప్లేయర్‌గానే ఆడుతున్న విషయం తెలిసిందే. సీజన్ మొదలవడానికి చాలా ముందే అతడ్ని ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించారు.
ఐపీఎల్-2024లో రోహిత్ శర్మ కేవలం ప్లేయర్‌గానే ఆడుతున్న విషయం తెలిసిందే. సీజన్ మొదలవడానికి చాలా ముందే అతడ్ని ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించారు.
Nidhan
ఐపీఎల్-2024 చాలా కొత్త విషయాలకు వేదికగా మారింది. లెజెండరీ ప్లేయర్లు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ సీజన్లో కేవలం బ్యాటర్స్గానే బరిలోకి దిగడం అందులో ఒకటి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ నుంచి కోహ్లీ ఎప్పుడో తప్పుకున్నాడు. నయా సీజన్ మొదలవడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు సారథ్య బాధ్యతల నుంచి ధోని వైదొలిగాడు. ఇక మీదట తనకు బదులుగా యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా టీమ్‌ను ముందుకు నడిపిస్తాడని మాహీ ప్రకటించాడు. అయితే కోహ్లీ, ధోని కంటే ఈ విషయంలో రోహిత్‌ది కాస్త డిఫరెంట్ స్టోరీ. టీమ్‌కు 5 ట్రోఫీలు అందించిన హిట్‌మ్యాన్‌ను అర్ధంతరంగా కెప్టెన్సీ నుంచి తీసేసింది ముంబై యాజమాన్యం. ఇది అతడి ఫ్యాన్స్‌తో పాటు టీమిండియా అభిమానులను కూడా ఎంతగానో బాధించింది. అయితే కెప్టెన్సీ పోవడం వల్ల రోహిత్‌కే ప్లస్సు అయింది.
ఏడాది మొత్తం టీమిండియాకు ఆడుతూ ఒక బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ఎంతో అలసిపోయేవాడు రోహిత్. ఐపీఎల్లో కూడా 45 రోజల పాటు ముంబై ఇండియన్స్‌కు సారథ్యం వహిస్తూ, అలాగే బ్యాట్స్‌మన్‌గా ఎంతో బిజీ అయిపోయేవాడు. మ్యాచుల టైమ్‌లో ఎప్పుడూ సీరియస్‌గా, అప్పుడప్పుడూ ఫ్రస్ట్రేషన్‌తో కనిపించేవాడు హిట్‌మ్యాన్. గెలవాలనే ప్రెజర్ వల్ల కావొచ్చు రోహిత్ ముఖంలో నవ్వే కనిపించేది కాదు. టైట్ షెడ్యూల్‌తో శారీరకంగానే కాదు మానసికంగా కూడా అలసిపోయేవాడు. కానీ కెప్టెన్సీ భారం పోవడంతో అతడిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ముంబై ప్రాక్టీస్ సెషన్స్‌లో తన పనేదో తాను అన్నట్లు రోహిత్ ఒక్కడే బ్యాటింగ్ సాధన చేస్తున్నాడు. హార్దిక్ పాండ్యాతో కెప్టెన్సీ వివాదం నేపథ్యంలో టీమ్ ప్లేయర్లతో పెద్దగా కలవడం లేదు హిట్‌మ్యాన్. జస్ప్రీత్ బుమ్రా లాంటి ఒకరిద్దరు సీనియర్లతో మాత్రమే ఉంటున్నాడు.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేయాల్సిందిగా రోహిత్‌ను ఆదేశించాడు కొత్త కెప్టెన్ హార్దిక్. తనను వెళ్లమంటున్నావా? అంటూ మొదట్లో కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేసిన హిట్‌మ్యాన్ ఆ తర్వాత కూల్‌గా ఓకే చెప్పి ఫీల్డింగ్ చేశాడు. హార్దిక్ అలా అన్నప్పుడు రోహిత్ నో చెబితే కాంట్రవర్సీ అయ్యేది. కానీ వివాదాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్న హిట్‌మ్యాన్ కూల్‌గా చెప్పిన పని చేసుకుపోయాడు. అలాగే కెప్టెన్సీ బర్డెన్ పోవడంతో బ్యాట్‌తో కూడా చెలరేగిపోయాడు. 29 బంతుల్లో 43 పరుగులు చేశాడు. స్వేచ్ఛగా షాట్లు కొడుతూ డేంజరస్‌గా కనిపించాడు.
రీసెంట్గా హోలీ సెలబ్రేషన్స్‌తో భార్య రితికా సజ్దే, కూతురు సమైరాతో కలసి ఫుల్ ఫన్ మోడ్‌లో కనిపించాడు రోహిత్. రంగులు చల్లుకుంటూ చిల్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో హిట్‌మ్యాన్‌ను ఇలా నవ్వుతూ, రిలాక్స్డ్గా చూడటం ఇదే తొలిసారి అని అతడి అభిమానులు కూడా అంటున్నారు. ఎంఐ కెప్టెన్సీ నుంచి తీసేయడం హిట్‌మ్యాన్‌కు బిగ్ ప్లస్ అయిందని.. అతడు తిరిగి తనను తాను రీఫ్రెష్ చేసుకోవడానికి ఇది ఎంతో హెల్ప్ అయిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. రోహిత్లో మీరు కొత్తగా ఇంకేమైనా మార్పులు చూసినట్లయితే కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: ధావన్ అరుదైన ఘనత.. IPL చరిత్రలో ఒకే ఒక్కడిగా సరికొత్త రికార్డు!
This version of Rohit Sharma ☺️
📸: Rohit Sharma pic.twitter.com/JI9LOd7bMv
— CricTracker (@Cricketracker) March 26, 2024