మొన్న మైక్రోసాఫ్ట్.. నేడు యూట్యూబ్.. ఆందోళన చెందుతున్న యూజర్లు

After Microsfot Youtube Down In India: మొన్న మైక్రోసాఫ్ట్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. కోట్లలో నష్టం వాటిల్లింది. తాజాగా గూగుల్ కి చెందిన యూట్యూబ్ సర్వర్ డౌన్ అయ్యింది. దీంతో దేశవ్యాప్తంగా యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. ట్విట్టర్ లో యూట్యూబ్ కి ఫిర్యాదులు చేస్తున్నారు.

After Microsfot Youtube Down In India: మొన్న మైక్రోసాఫ్ట్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. కోట్లలో నష్టం వాటిల్లింది. తాజాగా గూగుల్ కి చెందిన యూట్యూబ్ సర్వర్ డౌన్ అయ్యింది. దీంతో దేశవ్యాప్తంగా యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. ట్విట్టర్ లో యూట్యూబ్ కి ఫిర్యాదులు చేస్తున్నారు.

ఇటీవల మైక్రోసాఫ్ట్ క్రౌడ్ స్ట్రైక్ తో ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్ వేర్లతో పని చేసే విమానాయాన సంస్థలు, పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు, స్టాక్ మార్కెట్లపైతీ తీవ్ర ప్రభావాన్ని చూపించింది. వందల కోట్ల నష్టం వాటిల్లింది. తాజాగా ఇప్పుడు యూట్యూబ్ డౌన్ అయ్యింది. ప్రస్తుతం ట్విట్టర్ లో యూట్యూబ్ డౌన్ ట్రెండ్ నడుస్తోంది. గూగుల్ కి చెందిన యూట్యూబ్ యాప్, యూట్యూబ్ వెబ్ సైట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. యాప్ లో గానీ, వెబ్ సైట్ లో గానీ వీడియోలు అప్ లోడ్ చేస్తుంటే యూజర్లు సాంకేతిక సమస్యను ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే కొంతమంది యూట్యూబ్ యూజర్లు దీని మీద యూట్యూబ్ సంస్థకు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి యూట్యూబ్ లో సమస్య తలెత్తినట్లు చెబుతున్నారు.

అయితే ఈ ఫిర్యాదుల్లో 43 శాతం మంది యూజర్లు యూట్యూబ్ యాప్ తో సమస్య ఉన్నట్లు చెప్పగా.. 33 శాతం మంది వీడియో అప్లోడింగ్ లో సమస్య ఉన్నట్లు చెప్పారు. 23 శాతం మంది యూట్యూబ్ వెబ్ సైట్ లో సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు. యూట్యూబ్ వీడియో అప్లోడ్ అవుతుంది కానీ యాప్ లోనూ, యూట్యూబ్ స్టూడియోలోనూ చూపించడం లేదని.. ఈ సమస్యను పరిష్కరించాలి అంటూ పీయూష్ జోషి అనే నెటిజన్ యూట్యూబ్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.  న్యూఢిల్లీ, కోల్కతా, ముంబై, బెంగళూరు నగరాల్లో ఎక్కువగా ఈ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ దేశాలకు చెందిన యూజర్లు కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే యూట్యూబ్ టీమ్ దీనిపై దృష్టి సారించింది. సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించింది.

ప్రస్తుతం ట్విట్టర్ లో  మాత్రం యూట్యూబ్ డౌన్ ట్రెండ్ మాత్రం నడుస్తోంది. యూజర్లు ఫన్నీగా మీమ్స్ వేస్తున్నారు. మొన్న మైక్రోసాఫ్ట్, ఇప్పుడు యూట్యూబ్ వంతు వచ్చింది అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. యూట్యూబ్ డౌన్ అవ్వడంపై కొంతమంది టెక్ నిపుణులు స్పందించారు. డివైజ్, ఇంటర్నెట్ కనెక్షన్, యూట్యూబ్ లో సమస్యల వల్ల అంతరాయం ఏర్పడి ఉండవచ్చునని చెబుతున్నారు. మీకు కనుక ఈ సమస్య వస్తే డివైజ్ ని రీస్టార్ట్ చేయాలని చెబుతున్నారు. దీని వల్ల తాత్కాలిక మాల్ ఫంక్షన్స్ ఉంటే పరిష్కరించబడతాయి. డివైజ్ క్యాచీ అండ్ డేటాను క్లియర్ చేయడం వల్ల ఈ సమస్యను పరిష్కారించవచ్చునని చెబుతున్నారు. లేదా యూట్యూబ్ యాప్ ని అప్డేట్ చేసుకోవాలని చెబుతున్నారు.

ఇంటర్నెట్ కనెక్షన్ సరిగా లేకున్నా యూట్యూబ్ యాప్ లేదా వెబ్ సైట్ డౌన్ అవుతుందని చెబుతున్నారు. యూట్యూబ్ సర్వర్ స్టేటస్ ని చెక్ చేయడం ద్వారా సమస్య మీ డివైజ్ లో ఉందా లేక యూట్యూబ్ సైడ్ ఉందా అనేది తెలుస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. అన్ని ఎక్స్ టెన్షన్స్ ని డిజేబుల్ చేసి ఇన్ కాగ్నిటో విండోలో యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి అవుతుందో లేదో చూడవచ్చునని చెబుతున్నారు. అయితే యూట్యూబ్ కొంతమందికి వస్తుంది కానీ కొంతమందికి రావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. మరి మీకు యూట్యూబ్ వస్తుందా? లేదా? కామెంట్ చేయండి.

Show comments