Arjun Suravaram
2024 అనేది ప్రపంచ వ్యాప్తంగా చాలా కీలకమైన ఏడాది. కారణం.. ప్రపంచంలోని సగం జనాభా ఉన్న 80 దేశాల్లో 2024లో కీలక ఘటనలు జరగనున్నాయి. అవి ఏకంగా ప్రపంచంపై ప్రభావం కూడా చూపనున్నాయి. మరి.. ఆ వివరాలు..
2024 అనేది ప్రపంచ వ్యాప్తంగా చాలా కీలకమైన ఏడాది. కారణం.. ప్రపంచంలోని సగం జనాభా ఉన్న 80 దేశాల్లో 2024లో కీలక ఘటనలు జరగనున్నాయి. అవి ఏకంగా ప్రపంచంపై ప్రభావం కూడా చూపనున్నాయి. మరి.. ఆ వివరాలు..
Arjun Suravaram
ప్రపంచమంతా కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టింది. పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి.. న్యూ ఇయర్ కి వెలకమ్ చెప్పారు. ఇక ఈ న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇక గతేడాదిలో ఎన్నో అరుదైన అద్భుతమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. అలానే పలు విషాద ఘటనలు జరిగాయి. ఈ విషయాలు పక్కన పెడితే.. 2024లో కొన్ని ముఖ్యమైన ఘటనలు జరగనున్నాయి. 2024లో ప్రపంచంలో సగం జనాభాకు ప్రాతినిధ్యం వహించే 80 దేశాల్లో కీలక పరిణామాలు జరగనున్నాయి. విదేశీ సంబంధాల కౌన్సిల్ ఆధారంగా కీలక అంశాలు తెలిశాయి. మరి.. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
2024లో అత్యధిక దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో కొన్ని దేశాల్లో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతుంటాయి. మరికొన్ని దేశాల్లో మాత్రం పరిస్థితులు వేరేలా ఉంటాయి. అయితే రానున్న కాలంలో ఈ ఎన్నికలు ప్రపంచ దిశాను నిర్ణయిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఈ ఎలక్షన్ జరగనున్న దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇతర విషయాల్లో కీలకమైనవి. అందుకే ఈ దేశాల్లో జరిగే ఎన్నికలు, ఇతర ప్రధాన అంశాలపై అందరిలో ఆసక్తికరంగా ఉంది. ఇక మరి..ఎన్నికలు జరగనున్న ఆ ప్రధాన దేశాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
ప్రపంచంలో అతిపెద్ద, ప్రధానమైన దేశాల్లో రష్యా ఒకటి. ఈ దేశంలో మార్చిలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్న వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. మరోసారి కూడా ఆయన ఆ పదవిలో కూర్చుకోవడం ఖాయం గా కనిపిస్తుంది. కారణం.. ఇక్కడ ప్రతిపక్షాలు చాలా బలహీనంగా ఉన్నాయి. అంతేకాక మీడియా స్వేచ్ఛఅనేది చాలా తక్కువగా ఉంటుంది. అలానే వివిధ కారణాలతో రష్యా అధ్యక్షుడిగా మరోసారి పుతిన్ కానున్నారు. అయితే ఓటింగ్ శాతం తగ్గడం అనేది ఆ నేతకు కాస్తా ఇబ్బందికరం కావచ్చు.
ఇక భారత దేశంలో కూడా మార్చి లేదా ఎప్రిల్ నెలలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీకి వ్యూహాలు రచిస్తుంది. ప్రధాని మోదీ కూడా హ్యాట్రిక్ కొట్టాలనే ధృడ నిశ్చయంతో ఉన్నారు. మోదీని విస్తృత ప్రజాధరణ గల నేతగా కొందరు చూస్తుంటే, మరికొందరు మాత్రం ఆయన ముస్లిం వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఏది ఏమైనా 2024లో జరగబోయే ఎన్నికల్లో మరోసారి మోదీనే ప్రధాని అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
అలానే బ్రిటన్ లో కూడా 2024లో ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవానికి 2025లో జరగాల్సి ఉన్న.. పరిస్థితులు మాత్రం ఈ ఏడాదిలోనే జరిగేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రధాని రిషి సునాక్ కూడా చాలా గట్టి పోటీనే ఎదుర్కొనున్నారు. 2019 ఘన విజయాన్ని సాధించిన కన్జర్వేటీ పార్టీ విజయం సాధించింది. ఆ తరువాత.. కన్జర్వేటివ్ పార్టీ గట్టి ఎదురు దెబ్బలే చవిచూసింది. ఈ క్రమంలోనే రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయ కుంభకోణాలు, పార్టీలో లుకలుకలు అధికార పార్టీకి తలనొప్పిగా మారాయి. ఏది ఏమైనా మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ , ప్రధాని రిషి వ్యూహాలు రచిస్తున్నారు.
ఇక ఆఫ్రిక ఖండంలో అతి ప్రధానమైన, ఆర్థిక పరంగా బలంగా ఉన్న దేశం..సౌతాఫ్రికా. ఈ దేశంలో కూడా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ దేశ అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా, అధికార ఏఎన్సీ పార్టీకి గట్టి సవాళ్లే ఎదురుకానున్నాయి. వర్ణవిక్ష శకం ముగిసినప్పటి నుంచి అధికారంలో కొనసాగుతున్న ఏఎన్సీ త్వరలోనే 30 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ప్రస్తుతం ఇక్కడ నిరుద్యోగం సమస్య ఎక్కువగా ఉంది. విద్యుత్ రంగంలో సుదీర్ఘ సంక్షోభంతో తరచూ బ్లాక్ అవుట్ సంభవిస్తున్నాయి. ఏడాది జరిగే ఎన్నికల్లో ఎఏన్సీ అధికారం కోల్పోయే పరిస్థితి లేక పోవచ్చు కానీ, ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకోవాల్సిన పరిస్థితి రావచ్చు.
ప్రపంచ అగ్రదేశాల్లో అమెరికా ఒకటి. ఇదే ప్రపంచానికి పెద్దన్న పాత్రను పోషిస్తుంది. ఇక్కడ కూడా ఈ ఏడాది నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు కూడా బహుశా గతంలో జరిగినట్లే రసవత్తరంగా ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుత అధ్యక్షడు జోబైడెన్ రెండో సారి కూడా అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటున్నారు. అలానే మరోసారి వైట్ హౌస్ లో అడుగు పెట్టాలని మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుకుంటున్నారు. ఉక్రెయిన్ కి అమెరికా మద్దతు, పశ్చిమాసియా దేశాలకు ఇష్యూల్లో జోక్యం, ఇతర అంశాలకు సంబంధించి.. అమెరికాలో ఈ ఏడాది జరిగే ఎన్నికలు చాలా కీలకం.
ఇక అమెరికాకు దక్షిణ సరిహద్దుగా దక్షిణ అమెరికాలో ఉన్న మెక్సికో దేశం చాలా ప్రధానమైనది. అమెరికాకు భిన్నమైన పరిస్థితి. ఇక్కడ కూడా 2024లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులుగా మహిళే ఉన్నారు. ఎవరు గెలిచిన ఈ దేశానికి మహిళా అధ్యక్షురాలు కానున్నారు. ఈ ఎన్నికలను అన్నిటి కంటే ముందు ఓ దేశంలో జరగనున్నాయి. డ్రాగన్ దేశమైన చైనాకు సరిహద్దులో ఉన్న తైవాన్ లో జనవరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ చిన్న ద్వీపంలో జరిగే ఎన్నికలు ఓ పెద్ద ప్రభావాన్నే చూపించ వచ్చనే అభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి.
తైవాన్ దేశంలో చైనా మద్దతు తెలిపే పార్టీ, మరింత స్వేచ్ఛ ఉండాలనుకునే పార్టీలు పోటీ పడుతున్నాయి. స్వేచ్చతో ఉండాలనుకునే పార్టీకి అమెరికా పరోక్షం మద్దతుగా నిలబడుతుంది. మరి.. ఇక్కడి ప్రజలు మరింత స్వేచ్ఛకు ఓటు వేస్తారా.. లేక చైనాతో సహకారాన్ని కోరుకునే అభ్యర్థిని గెలిపిస్తారా? లేకా మరింత స్వేచ్ఛ, అధికారాలను కోరుకునే అభ్యర్థిని గెలిపిస్తారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాలి. ఇలా ఈ ఏడాది రికార్డు బ్రేకింగ్ స్థాయిలో జరిగే ఎన్నికల తరువాత ప్రపంచం పూర్తిగా భిన్నంగా కనిపించ వచ్చు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.