P Venkatesh
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ ట్యాక్సీ డ్రైవర్లకు పరిహారం చెల్లించనుంది. వంద కాదు రెండు వందలు కాదు ఏకంగా రూ. 1,475 కోట్ల పరిహారాన్ని చెల్లించేందుకు అంగీకరించింది.
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ ట్యాక్సీ డ్రైవర్లకు పరిహారం చెల్లించనుంది. వంద కాదు రెండు వందలు కాదు ఏకంగా రూ. 1,475 కోట్ల పరిహారాన్ని చెల్లించేందుకు అంగీకరించింది.
P Venkatesh
ప్రస్తుత రోజుల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే సొంత వెహికిల్ ఉండాల్సిన పనిలేదు. క్షణాల్లోనే ఆన్ లైన్ లో బైక్ బుక్ చేసుకుని మీ గమ్యాన్ని చేరుకోవచ్చు. ప్రైవేట్ రవాణా రంగంలో ఓలా, ర్యాపిడో, ఉబర్ వంటి సంస్థలు ప్రవేశించినప్పటి నుంచి ప్రయాణం సులువైపోయింది. బుక్ చేసుకోగానే ఇంటి ముందుకే వాహనం వస్తుండడంతో ఈ రవాణా యాప్ లకు డిమాండ్ పెరిగింది. అయితే వీటి వల్ల కొంత మందికి ఉపాధి లభిస్తుండగా మరికొంత మందికి ఉపాధికరువైన పరిస్థితులు దాపరించాయి. ఈ క్రమంలో ఉబర్ వల్ల ఉపాధి కోల్పోయిన ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 1475 కోట్ల పరిహారం చెల్లించనుంది. అయితే ఇది మనదేశంలో మాత్రం కాదు. ఆస్ట్రేలియాలోని ట్యాక్సీ డ్రైవర్లకు పరిహారం చెల్లించేందుకు ఉబర్ అంగీకరించింది. ఇంతకీ ట్యాక్సీ డ్రైవర్లకు ఉబర్ నష్టపరిహారం ఎందుకు చెల్లిస్తుందంటే?
ఆస్ట్రేలియాలో ఉబర్ తన సేవలను 2012 నుంచి ప్రారంభించింది. క్రమక్రమంగా సేవలను విస్తరిస్తూ పోయింది. అయితే ఉబర్ వల్ల ప్రయాణికులకు జర్నీ సులువు కాగా ట్యాక్సీలు నడుపుకుని బ్రతికే వారి పొట్ట కొట్టినట్లైంది. ఉబర్ ప్రవేశంతో ట్యాక్సీ డ్రైవర్లకు బుకింగ్స్ తగ్గిపోయి వాహనాల ఈఎంఐలు కట్టలేక, కుటుంబాన్ని పోషించలేక నానా ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఉబర్ తమ దేశంలోకి ప్రవేశించడం వల్ల తాము ఉపాధి కోల్పోయామని దాదాపు 10 వేల మంది ట్యాక్సీ డ్రైవర్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. తాజాగా ఉబర్ ట్యాక్సీ డ్రైవర్లకు 178 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,475 కోట్లు) చెల్లించేందుకు ఉబర్ అంగీకరించింది.
కాగా కొంత కాలం నుంచి ఉబర్ ట్యాక్సీ డ్రైవర్లకు పరిహారాన్ని నిరాకరిస్తూ వస్తుంది. కానీ ఉబర్ పలు ప్రాంతాల్లో పరిహార ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ కారణంగా ఉబర్ వారికి నష్ట పరిహారాన్ని చెల్లించేందుకు అంగీకరించింది. ట్యాక్సీ డ్రైవర్ల పక్షాన న్యాయవాది మైఖేల్ డోనెల్లీ వాధించారు. ట్యాక్సీ డ్రైవర్ల డిమాండ్ కు సాధారణ ప్రయాణికుల నుంచి కూడా మద్దతు లభించిందని ఆయన తెలిపారు. ఇక ఆస్ట్రేలియాలో ఉబర్ సేవలతో ప్రయాణ సౌకర్యాలు మెరుగయ్యాయని ఉపాధి అవకాశాలు లభించాయని చెప్పుకొచ్చింది.