మంచి ఉద్యోగం.. పై చదువులకు లండన్ వెళ్లింది.. అంతలోనే..

London Crime News: ఉన్నతమైన ఉద్యోగం.. మంచి భర్త, ఎంతో ఆనందమైన జీవితం. పై చదువుల కోసం లండన్ వెళ్లిన ఓ మహిళకు అనుకోని సంఘటన ఎదురైంది.

London Crime News: ఉన్నతమైన ఉద్యోగం.. మంచి భర్త, ఎంతో ఆనందమైన జీవితం. పై చదువుల కోసం లండన్ వెళ్లిన ఓ మహిళకు అనుకోని సంఘటన ఎదురైంది.

ఆమె ఉన్నత విద్యావంతురాలు.. చక్కటి ఉద్యోగం. భర్త ఎప్పుడూ ఆమెకు వెన్నంటి ప్రోత్సహించేవాడు. ఈ క్రమంలోనే పై చదువుల కోసం లండన్ వెళ్లి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పీహెచ్‌డీ చేస్తుంది. ఆమెకు తోడుగా భర్త కూడా వెళ్లాడు. ఎంతో హ్యాపీగా జీవితం గడుస్తుంది. పీహెచ్‌డీ పూర్తి చేసి తిరిగి స్వదేశానికి వచ్చి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. అయితే మనమొకటి తలిస్తే.. దైవమొకటి తలిచాడు అని అంటారు కదా.. ఆమె విషయంలో కూడా అలాంటిదే జరిగింది. ఎవరూ ఊహించని సంఘలన ఆమె జీవితంలో జరిగింది. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఏం జరిగిందీ? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

బ్రిటన్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో భారతీయ మహిళ చైస్తా కొచ్చర్ (33) దుర్మరణం చెందారు. చైస్తా కొచ్చర్ గతంలో నీతి అయోగ్ లో ఉద్యోగం చేసింది. చైస్తా కొచ్చర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో పీహెచ్‌డీ చేసేందుకు లండన్ వెళ్లింది. అంతా హ్యాపీగా సాగుతున్న సమయంలో మృత్యువు ట్రక్కు రూపంలో వెంటాడింది. మార్చి 19న భర్తలో కలిసి సైక్లింగ్ చేస్తుండగా చైస్తా కొచ్చర్ ను ఓ ట్రక్కు వచ్చింది గుద్దింది. ఆ సమయంలో భర్త ముందుగా వెళ్తున్నాడు. ఈ ప్రమాదంలో ఆమె అక్కడిక్కడే మృతి చెందారు. అప్పటి వరకు తనతో మాట్లాడుతూ ఎంతో సంతోషంగా ఉన్న తన భార్య ప్రమాదంలో మరణించడంతో భర్త కన్నీరుమున్నీరయ్యాడు.

చైస్తా కొచ్చర్ మృతి పై నీతి అయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నీతి అయోగ్ లోని లైఫ్ ప్రోగ్రామ్ లో చైస్తా కొచ్చర్ జాబ్ చేసినట్లుగా తెలిపారు. ఎంతో బంగారు భవిష్యత్ ఉన్న ఆమె ఇలా అర్ధాంతరంగా చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. ఆమె ఎంతో ధైర్యవంతురాలు.. ఎంతోమందికి గొప్ప ఇన్స్పిరేషన్ గా ఉండేవారు అని అన్నారు. గుర్‌గ్రామ్ నుంచి ఇటీవల పీహెచ్‌డీ చేయడానికి లండన్ వెళ్లారు. ఆర్గనైజేషన్ బిహేవియరల్ మేనేజ్ మెంట్ లో ప్రస్తుతం ఆమె పీహెచ్‌డీ చేస్తున్నారు. గతంలో ఆమె నితి అయోగ్ లోని నేషనల్ బిహేవియరల్ యూనిట్ లో సీనియర్ సలహాదారుగా పనిచేశారు. ఆమె మృతిపై పలువురు అధికారులు నివాళులర్పించారు.

Show comments