మృతదేహాలను భద్రపరుస్తున్న కంపెనీ! కారణం తెలిస్తే..మీరు షాకే..

మానవుడు సాకేంతిక సాయంతో ఇప్పటికే ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. అలానే మరిన్ని ప్రయోగాలు చేస్తున్నాడు. ఈక్రమంలోనే ఓ కంపెనీ చనిపోయిన వారి శవాలను భద్రపరుస్తుంది. అందుకు గల కారణాలను కూడా చెబుతున్నారు.

మానవుడు సాకేంతిక సాయంతో ఇప్పటికే ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. అలానే మరిన్ని ప్రయోగాలు చేస్తున్నాడు. ఈక్రమంలోనే ఓ కంపెనీ చనిపోయిన వారి శవాలను భద్రపరుస్తుంది. అందుకు గల కారణాలను కూడా చెబుతున్నారు.

ప్రస్తుతం సమాజం టెక్నాలజీ పరంగా ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది. వైద్య రంగంలో కూడా సాకేంతికత చాలా వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే అనేక రకాల వ్యాధులకు చికిత్సలను కనిపెట్టారు. అలానే టెక్నాలజీ సాయంతో ఎన్నో అద్భుతమైన, ఆశ్చర్యాన్ని కలిగించే ఆపరేషన్లు నిర్వహించారు. ఇలానే ఇంకా ఎన్నో అంతుచిక్కని, ప్రాణాంతక వ్యాధులను సైతం నయం చేసే దిశగా కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ కంపెనీ చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చనిపోయిన వారి శవాలను భద్రపరుస్తుంది. అందుకు గల కారణాలను కూడా చెబుతున్నారు. మరి.. ఆ సంస్థ ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

మానవుడు సాకేంతిక సాయంతో ఇప్పటికే ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. అలానే మరిన్ని ప్రయోగాలు చేస్తున్నాడు. భవిష్యత్తుల్లో ముసలినతనం రాకుండా ఉండేందుకు కూడా రిసెర్చ్ చేస్తున్నారు. ఇదే సమయంలో చనిపోయిన మని షిని కూడా బతికించే టెక్నాలజీ వస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ఆల్కోర్ లైఫ్ ఎక్స్ టెన్షన్ ఫౌండేషన్ అనే శవాలను ప్రిజర్వ్ చేస్తోందట. ఈ సంస్థ ఇప్పటికే 233 మంది శవాలను సురక్షితంగా భద్రపరిచిందట. భవిష్యత్ లో వైద్య శాస్త్రం అభివృద్ధి చెందినప్పుడు భద్రపరిచిన శవాలకు ప్రాణాలు పోయాలనే ఆశ ఉందట. అక ఈ సంస్థ క్రయోనిక్స్ అనే ప్రక్రియ ద్వారా శవాలను భద్ర పరుస్తుంది. ఈ ప్రాసెస్ లో మానవ శరీరాలను చాలా చల్లని, ఉష్ణోగ్రతలు తక్కువ ఉండే వాతావరణం క్రియేట్ చేసి.. భద్రపరుస్తారు. భవిష్యత్తులో వైద్యరంగం చాలా అభివృద్ధి చెంది, ఈ శరీరాలను మళ్లీ బతికిస్తుందని కంపెనీ భావిస్తోంది.

ఈ అడ్వాన్స్‌డ్ ప్రొసీజర్‌ను “విట్రిఫికేషన్” అంటారు. ఈ ప్రక్రియలో, శరీరంలోని రక్తాన్ని మొదట “క్రయోప్రొటెక్టెంట్” అనే ద్రావణంతో రీప్లేస్ చేస్తారు. ఇది లోపల మంచు స్ఫటికాలు ఏర్పడకుండా కాపాడుతుంది, ఎందుకంటే అవి కణాలు, కణజాలాలకు నష్టం కలిగిస్తాయి. విట్రిఫికేషన్ పూర్తయిన తర్వాత, శరీరాన్ని నెమ్మదిగా -196 డిగ్రీల సెల్సియస్‌కు చల్లబరుస్తారు. లిక్విడ్ నైట్రోజన్‌తో నిండిన ఒక వాక్యూమ్ ఇన్సులేటెడ్ మెటల్ కంటైనర్‌లో నిల్వ చేస్తారు. భవిష్యత్తులో  చనిపోయిన మనిషిని బతికించేంతాగా వైద్య శాస్త్రం అభివృద్ధి చెందుతుందా అనేది పెద్ద ప్రశ్న. ప్రస్తుత వైద్య రంగం ఆ స్థాయిలో అభివృద్ధి చెందలేదు. భవిష్యత్తులో నానో-టెక్నాలజీ, రివైవల్ మెడికల్ టెక్నాలజీ ద్వారా ఇది సాధ్యమయ్యే అవకాశముంటుందని ఆ కంపెనీ భావిస్తోదట. గ్యారెంటీ లేకపోయినా ఒక చిన్న హోప్‌తో ఆల్కోర్ సంస్థ శవావలను భద్ర పరుస్తోందట.

క్రియోప్రెజర్వేషన్ కోసం మెంబర్‌షిప్ తీసుకున్న వారికి వివిధ రకాల ధరలు అందుబాటులో ఉన్నాయి అంట. మొత్తం శరీరాన్ని ప్రిజర్వేషన్‌ చేసేందుకు 115,000 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.96 లక్షలు, మెదడు మాత్రమే కుళ్లిపోకుండా కాపాడాలంటే 25,000 డాలర్లు  అంటే మన కరెన్సీలో సుమారు రూ.21 లక్షలు చెల్లిస్తారు. వయస్సును బట్టి, ప్రతి నెలా 17 నుంచి 100 డాలర్ల మధ్య సబ్‌ స్క్రిప్షన్ ఫీజు చెల్లించాలి. పిల్లలను కూడా ఈ ప్రక్రియలో చేర్చాలనుకుంటే  ఒక్కొక్కరి ఏటా 60 డాలర్లు అదనంగా  చెల్లించాలి. అయితే ఈ ప్రాసెస్ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చనిపోయినా వారిని తిరిగి ఎలా బతికిస్తారు అనే విషయంపై అనుమానాలు వ్యక్తం చేశారు.

Show comments