Arjun Suravaram
బోనస్ అనేది కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు ఓ ఎమోషన్. దాని కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలానే ఓ కంపెనీ ఉద్యోగులు కూడా తమకు ప్రకటించబోయే బోనస్ కోసం ఎదురు చూశారు. అయితే వారి బాస్.. ఆ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చారు.
బోనస్ అనేది కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు ఓ ఎమోషన్. దాని కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలానే ఓ కంపెనీ ఉద్యోగులు కూడా తమకు ప్రకటించబోయే బోనస్ కోసం ఎదురు చూశారు. అయితే వారి బాస్.. ఆ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చారు.
Arjun Suravaram
చాలా మంది ఉద్యోగులు కంపెనీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తుంటారు. అలానే కంపెనీలు కూడా జీతంతో పాటు వారికి పలు సదుపాయాలు కల్పిస్తుంటాయి. ఇక ఉద్యోగులు రోజుల తరబడి శ్రమించినా వారికి బోనస్ వచ్చినప్పుడు ఉండే సంతోషం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలా ప్రత్యేక సందర్భాల్లో కంపెనీలు ఈ బోనస్ లను ప్రకటిస్తుంటాయి. అయితే కేవలం నామమాత్రంగానే, ఉద్యోగులు ఉహించిన స్థాయిలోనే ఎక్కువ కంపెనీ యజమానాలు బోనస్ లు ప్రకటిస్తుంటారు. అయితే ఓ కంపెనీ బాస్ ప్రకటించిన బోనస్ కి మాత్రం ఆ సంస్థలోని ఉద్యోగులు షాకయ్యారు. ఏకంగా రూ.83 కోట్లను బోనస్ ప్రకటించారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
బోనస్ అనేది కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు ఓ ఎమోషన్. దాని కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలానే ఓ కంపెనీ ఉద్యోగులు కూడా తమకు ప్రకటించబోయే బోనస్ కోసం ఎదురు చూశారు. అయితే వారి బాస్.. ఆ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చారు. వారు ఊహించని విధంగా భారీ స్థాయిలో బోనస్ ను ప్రకటించారు. అమెరికాకు చెందిన సెయింట్ జాన్స్ ప్రాపర్టీస్ అనే కంపెనీ తన ఉద్యోగులకు ఈ భారీ బోనస్ ను ప్రకటించింది. ఈ కంపెనీలో 198 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. నిత్యం కంపెనీ అభివృద్ధి కోసం శ్రమిస్తుంటారు. ఈ ఉద్యోగులందరికి దాదాపు పది మిలియన్ డాలర్స్ ను బోనస్ గా సదరు కంపెనీ యజమాని ప్రకటించారు. ఈ పది మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో 83 కోట్లను సదరు కంపెనీ యజమాని బోనస్ ను ప్రకటించింది.
ఇక ఈ బోనస్ ఒక్కొక్క ఉద్యోగి సగటున 50 వేల డాలర్స్ పొందన్నారు. అంటే ఇండియన్ కరెన్సీలో ఒక్కొక్క ఉద్యోగికి 41 లక్ష రూపాయలు అందినట్లు అవుతోంది. తాము ఊహించి దాని కంటే ఎక్కువగా రావడంతో కంపెనీ ఉద్యోగులు సంతోషంతో కన్నీరు పెట్టుకున్నారు. మామూలుగా కంపెనీ లాభాలు తీసుకుంటున్నప్పుడు.. అలా వాళ్లు లాభలు పొందడంలో కీలక పాత్ర పోషించే ఉద్యోగులకు బోనస్ రూపంలో ఇస్తే వారు సంతోషంతో మరింతగా కష్టపడి కంపెనీ ఆదాయాన్ని పెంచుతారు. అదే సూత్రాన్ని ఈ నేపథ్యంలోనే భారీ బోనస్ ప్రకటించిన ఆకంపెనీ ప్రెసిడెంట్ ఎడ్వర్డ్ సెయింట్ జాన్ ఫాలో అయ్యారు. ఇంకా ఆయన మాట్లాడుతూ… తమ కంపెనీ మంచి లాభాలు అందుకోవడంతో తాము తమ ఉద్యోగులకు ఇంత భారీ మొత్తంలో రివార్డులను ఇచ్చామని తెలిపాడు. తాము ఇలా ఇచ్చిన బోనస్ తో ఉద్యోగస్తుల కుటుంబానికి ఉపయోగ పడుతుందని ఆయన పేర్కొన్నారు. తమ కంపెనీలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి కృషికి, నిజాయితీ, అంకితభావాతంతో వారు నిర్వర్తిస్తున్న విధులకు తాను కృతజ్ఞత తెలుపుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. మరి.. ఇలా భారీ బోనస్ ప్రకటించిన ఈ బాస్ సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి.