iDreamPost
android-app
ios-app

పెషావర్ కంటే ఢిల్లీ అంటేనే ఎక్కువ ఇష్టం: పాక్ మాజీ FBR ఛైర్మన్

Shabbar Zaidi: భారత్, పాకిస్థాన్ గురించి ఇరు దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు ప్రస్తావిస్తుంటారు. ఇదే సమయంలో ఆ దేశానికి చెందిన పలువురు ప్రముఖులు భారత్ దేశాన్ని ప్రశంసిస్తున్నారు. తాజాగా పాక్ ఎఫ్బీఆర్ ఛైర్మన్ భారత్ ను ప్రశంసించారు.

Shabbar Zaidi: భారత్, పాకిస్థాన్ గురించి ఇరు దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు ప్రస్తావిస్తుంటారు. ఇదే సమయంలో ఆ దేశానికి చెందిన పలువురు ప్రముఖులు భారత్ దేశాన్ని ప్రశంసిస్తున్నారు. తాజాగా పాక్ ఎఫ్బీఆర్ ఛైర్మన్ భారత్ ను ప్రశంసించారు.

పెషావర్ కంటే  ఢిల్లీ అంటేనే ఎక్కువ ఇష్టం: పాక్ మాజీ FBR ఛైర్మన్

భారత్, పాక్ మధ్య ఉండే గొడవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ఉప్పు నిప్పులా ఉంటుంది… ఈ రెండు దేశాల మధ్య వ్వవహారం. ముఖ్యంగా భారత్ పై పాకిస్థాన్ ఎక్కువ అసూయ పడుతుంది. తనకు అభివృద్ధి చెందడం చేతకాక, అభివృద్ధి పథంలో వెళ్తున్న భారత్ ను చూసి..అసూయపడుంది.  ఇదే సమయంలో ఆ దేశానికి చెందిన పలువురు ప్రముఖులు భారత్ దేశాన్ని ప్రశంసిస్తున్నారు. గతంలో ఓ పార్టీ అధినేత భారత్ అభివృద్ధి పథంలో వెళ్తుంటే..పాక్ అడుక్కునే స్థితికి వెళ్తోందంటూ చెప్పారు. తాజాగా పెషావర్ కంటే ఢిల్లీలోనే ఉండటం అంటే ఎక్కువ ఇష్టమని పాకిస్థాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ మాజీ ఛైర్మన్ వ్యాఖ్యానించారు.

భారత్, పాకిస్థాన్ గురించి ఇరు దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు ప్రస్తావిస్తుంటారు. ఇది ఇలా ఉంటే.. శత్రువులు మనల్ని ప్రశంసిస్తుంటే ఆ కిక్కే వేరు ఉంటాది. అలానే ఇప్పటికే పాకిస్తాన్ కి చెందిన పలువురు ప్రముఖులు భారత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ మాజీ ఛైర్మన్ సయ్యద్ మొహమ్మద్ షబ్బర్ జైదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్ విభజనకు సంబంధించి పలు అంశాలను ప్రస్తావించారు. 1947లో భారత్, పాక్ విభజన సమయంలో తన తల్లితండ్రుల పాకిస్థాన్ లో ఉండటం కంటే.. భారత్ లో జీవించాలనే భావించి ఉంటే.. తమకు మరింత ఆనందంగా ఉండేదని అభిప్రాయపడ్డారు.

భారత్ పాక్ విభజనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాఫ్తార్ అనే ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఆయన ఇంటర్యూ ఇస్తూ కీలక వ్యాఖ్యాలు చేశారు. తన తాతగారు ప్రభుత్వోద్యోగి అని,  విభజన సమయంలో పొరపాటున పాకిస్థాన్‌ ఉండాలని ఎంచుకుని తప్పు చేశారని చెప్పుకొచ్చారు.  ఆయన తప్పు చేశారని, అందుకు తాను తన కుటుంబం చింతిస్తున్నానని తెలిపాడు. 1947లో విభజన సమయంలో  ఢిల్లీలోనే ఉంటే.. తాము ఇండియాలో నివసించే ఉండేవారమని తెలిపింది. కానీ తన తాత పాక్ ను పాకిస్తాన్‌ను ఎందుకు ఎంపిక చేసుకున్నాడో తెలియదని షబ్బర్ జైదీ చెప్పారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. పెషావర్, లాహోర్, కరాచీ వంటి పాకిస్థాన్ లోని ప్రధాన పట్టణాలతో పోల్చితే.. ఢిల్లీలో తాను సంతోషంగా ఉంటాననీ తెలిపారు. నేటీకి కూడా  ఇఫ్తారీ సందర్భంగా ముంబైలోని మహ్మద్ అలీ స్ట్రీట్ మార్కెట్ కి వెళ్తే..మక్కా మదీనాలో కూర్చున్న ఫీలింగ్ వస్తుందని ఆయనత లిపారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక భారత్ పరిస్థితి ఇంకా మెరుగైందని అన్నారు. సయ్యద్ మొహమ్మద్ షబ్బర్ జైదీ పాకిస్థానీ చార్టర్డ్ అకౌంటెంట్. ఆయన  మే 2019 నుండి ఏప్రిల్ 2020 వరకు పాకిస్తాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూకి ఛైర్మన్‌గా పనిచేశారు. అంతేకాక పాకిస్థాన్ లోని వివిధ కీలక పదవుల్లో ఆయన విధులు నిర్వహించారు. మరి..  షబ్బర్ జైదీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.