మహిళల విషయంలో మోస్ట్ డేంజరస్‌గా ఉన్న దేశాలు.. భారత్ స్థానం ఎంతంటే?

If Women Goes To These Countries It's Over: మహిళలు పొరపాటున ఈ దేశాలకు వెళ్తే అంతే పరిస్థితి. ఎందుకంటే అక్కడ పరిస్థితులు మరీ ఘోరంగా ఉన్నాయి. బయట దేశాల నుంచి వచ్చే మహిళలే కాదు.. ఆ దేశంలో ఉండే మహిళల పరిస్థితి కూడా ఘోరంగా ఉంది.

If Women Goes To These Countries It's Over: మహిళలు పొరపాటున ఈ దేశాలకు వెళ్తే అంతే పరిస్థితి. ఎందుకంటే అక్కడ పరిస్థితులు మరీ ఘోరంగా ఉన్నాయి. బయట దేశాల నుంచి వచ్చే మహిళలే కాదు.. ఆ దేశంలో ఉండే మహిళల పరిస్థితి కూడా ఘోరంగా ఉంది.

2024లో మహిళలకు ఏ మాత్రం భద్రత లేని కొన్ని దేశాల జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కొన్ని గణాంకాల ప్రకారం.. దక్షిణాఫ్రికా, బ్రెజిల్, రష్యా సహా పలు దేశాలు మహిళల విషయంలో మోస్ట్ డేంజరస్ దేశాలుగా ఉన్నాయి. ఈ దేశాల్లో మహిళలపై హింసలు ఎక్కువగా జరగడం, మహిళలు లింగ వివక్షకు గురవ్వడం, ఆరోగ్య సంరక్షణ, చట్టపరమైన రక్షణ వంటి విషయాల్లో మహిళలకు ప్రాధాన్యత లేకపోవడం వంటివి ఈ దేశాల్లో కనిపిస్తాయి. కొన్ని దేశాలు మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులు ఇచ్చినప్పటికీ ఇప్పుడు చెప్పుకోబోయే దేశాలు మాత్రం మహిళలకు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి.

దక్షిణాఫ్రికా:

మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా దక్షిణాఫ్రికా ప్రపంచ దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. లింగం ఆధారంగా ఇక్కడ హింస జరుగుతుంది. వీధుల్లో నడిచే మహిళలకు భద్రత విషయంలో ఆందోళన అయితే ఉంది. వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకారం కేవలం 25 శాతం మంది మహిళలు మాత్రమే దక్షిణాఫ్రికాలో ఒంటరిగా నడవడానికి సేఫ్ అని భావిస్తున్నారట. లైOగిక హింస, వేధింపులు, మహిళల అక్రమ రవాణా వంటివి మహిళల విషయంలో ప్రమాదకర ముప్పుగా ఉన్నాయి. ముఖ్యంగా మహిళా ట్రావెలర్స్ కి.. ఒంటరిగా వెళ్లే మహిళలకు.      

బ్రెజిల్:

దక్షిణాఫ్రికా తర్వాత మోస్ట్ డేంజరస్ దేశంగా బ్రెజిల్ దేశం రెండో స్థానంలో ఉంది. ఈ దేశంలో 28 శాతం మంది మహిళలు రాత్రి సమయంలో ఒంటరిగా నడవడం సురక్షితం కాదని భావిస్తున్నారట.  

రష్యా:

మహిళల మీద అంతర్జాతీయంగా జరుగుతున్న న*ర హత్యల విషయంలో రష్యా రెండవ స్థానంలో ఉండగా.. మహిళల విషయంలో మోస్ట్ డేంజరస్ దేశాల జాబితాలో మూడవ స్థానంలో ఉంది.  

మెక్సికో:

మహిళలకు సురక్షితం కానటువంటి దేశాల జాబితాలో మెక్సికో నాల్గవ స్థానంలో ఉంది. కేవలం 33 శాతం మంది మహిళలు మాత్రమే రాత్రిపూట ఒంటరిగా వెళ్లడం సురక్షితం అని భావిస్తున్నారట. మిగతా 67 శాతం మంది మహిళలు మాత్రం సురక్షితం కాదని ఫీలవుతున్నారు.    

ఇరాన్:

మహిళలకు ప్రమాదకరంగా ఉన్న దేశాల జాబితాలో ఇరాన్ ఐదో స్థానంలో ఉంది. లింగ అంతరం అనేది ఈ దేశంలో ప్రబలంగా ఉంది.  

భారతదేశం:

మహిళలకు సురక్షితం కాని దేశాల జాబితాలో ఆసియాలో ఇండియా ఒకటి ఉంది. అధిక లైOగిక హింస, వేధింపుల కారణంగా ఇండియా ఆరవ స్థానంలో ఉంది. మహిళలతో బలవంతపు పనులు, మహిళల అక్రమ రవాణా వంటివి ఈ దేశంలో ఇంకా జరుగుతున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి.మరో నివేదిక ప్రకారం.. మహిళల విషయంలో మోస్ట్ డేంజరస్ దేశాల్లో 9వ స్థానంలో ఉంది. 37.2% మహిళలు భర్త పెట్టే హింసకు గురవుతున్నారని తేలింది. లింగ అసమానతలో కూడా టాప్ లో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

డొమినికన్ రిపబ్లిక్, ఈజిప్టు, మొరాకో, థాయిలాండ్ దేశాలు కూడా మహిళల విషయంలో అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని తేలింది. థాయిలాండ్ లో 44 శాతం మంది మహిళలు భర్త పెట్టే హింసకు గురవుతున్నట్లు తేలింది. అయితే 61 శాతం మంది మహిళలు కొన్ని సందర్భాల్లో తమ మీద జరిగిన హింసకు న్యాయం జరిగిందని వెల్లడించారు. మొరాకోలో కూడా భర్తలు తమ భార్యల మీద భౌతిక దాడులు చేయడం, లైOగిక వేధింపులకు గురి చేయడం వంటివి చేస్తున్నారు. ఇలా ఆ దేశంలో ఉండే మహిళల మీద, ఇతర దేశాల నుంచి వచ్చే మహిళా టూరిస్టుల మీద హింసకు పాల్పడుతున్నారు.

Show comments