Dharani
Dharani
ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చిన తర్వాత.. ప్రపంచం చాలా చిన్నదిగా మారిపోయింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోతూ వస్తుంది. ఇక నేటి కాలంలో అయితే.. మన అర చేతిలోకి వచ్చేసింది. సోషల్ మీడియా, వాట్సాప్ వంటి యాప్‌ల వల్ల ప్రపంచంలో ఏ మూలన ఉన్న వారిని అయినా సరే చూడగలుగుతున్నా.. వారితో మాట్లాడగలుగుతున్నాం. ఇక సోషల్ మీడియా వల్ల.. విదేశాల వారితో కూడా స్నేహం ఏర్పడుంది. అయితే కొన్ని సార్లు ఇలాంటి స్నేహాలు చాలా ప్రమాదకర పరిస్థితులకు తావు తీస్తాయి.
ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పరిచయం అయిన వారి కోసం కుటుంబాన్నే కాక.. ఏకంగా దేశాలు దాటి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా పాకిస్తాన్ మహిళ సీమ.. తన ఫేస్‌బుక్ ప్రియుడి కోసం దేశం వదిలి ఇండియా వచ్చింది. అయితే ఆమె వ్యవహారం ఇంకా అనుమానస్పదంగానే ఉంది. ఇది ఓ కొలిక్కి రాకముందే.. రాజస్థాన్‌కు చెందిన వివాహిత అంజూ తన ఫేస్‌బుక్ ప్రియుడి కోసం పాకిస్తాన్ వెళ్లడం కలకలం రేపుతోంది.
ఇక తాజాగా వీరి ప్రేమకథలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రియుడి కోసం పాకిస్తాన్ వెళ్లిన అంజూ.. మతం మారడమే కాక.. అతడిని వివాహం చేసుకుందనే వార్తలు వచ్చాయి. అంతేకాక వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, మ్యారేజ్ సర్టిఫికేట్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. నిన్నంతా అంజూ పెళ్లి వార్తలే ట్రెండింగ్‌లో ఉంది. అయితే తాజాగా ఈ వార్తలపై అంజూ స్పందించింది. భారత్‌కు చెందిన ఓ జాతీయ న్యూస్ ఛానెల్.. అంజూ, ఆమె పాక్ ప్రేమికుడు నస్రుల్లాను విడివిడిగా సంప్రందించి.. పెళ్లి, మత మార్పిడి అంశాలపై ప్రశ్నించారు. ఈ క్రమంలో అంజూ, నస్రుల్లా కీలక ప్రకటన చేశారు.
‘‘మాకు పెళ్లి కాలేదు.. అంజూ మతం కూడా మారలేదు. మా పేరుతో వైరలవుతోన్న మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా ఫేకే. అవన్ని పుకార్లే. అంజూ నాకు మంచి ఫ్రెండ్. మా ఇద్దరి గురించి మీడియాలో వార్తలు రావడంతో.. భద్రత కోసం కోర్టుకు వెళ్లాం. అంజు విదేశీయురాలు.. అందునా భారతీయ మహిళ. సహజంగానే తనకు ముప్పు పొంచి ఉండే అవకాశం ఉంది. అందుకే భద్రత కోసం కోర్టకు వెళ్లాం. ఇక్కడి సంప్రదాయం ప్రకారం అంజు బుర్ఖా ధరించింది. అంతే.. తనేం మతం మారలేదు. ఇక ప్రభుత్వం 50 మంది పోలీసులతో మాకు భద్రత కల్పిస్తున్నారు’’ అని తెలిపాడు.
‘‘అంతేకాక అంజూ టూరిస్ట్ వీసా మీద పాకిస్తాన్ వచ్చింది. ఆమె ఇంకా హిందువుగానే ఉంది. భర్తతో తనకు గొడవలు ఉన్నాయని.. విడాకులు ప్రక్రియ నడుస్తోందనే విషయం నాకు తెలుసు. విడాకులు మంజూరు అయ్యాక.. అప్పటికి ఆమె నన్ను ఇష్టపడితే.. అప్పుడు తప్పకుండా అంజూను వివాహం చేసుకుంటాను. అయితే అది ఆమె నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైతే ఆగస్ట్ 4 వరకు అంజూ వీసా గడువు ఉంది. అది ముగిశాక తను ఇండియా వెళ్తుంది’’ అని తెలిపాడు నస్రుల్లా.
ఈ వార్తలపై అంజూ స్పందిస్తూ.. ‘‘నేను ఎవరినీ వివాహం చేసుకోలేదు. కాకపోతే ఇక్కడ ఒక ఫేమస్ వ్లోగర్.. మా ఇద్దరిని కలిపి ఫొటో షూట్ చేశాడు. అంతే తప్ప అది ప్రీ వెడ్ షూట్ కాదు. మా పెళ్లి, మ్యారేజ్ సర్టిఫికెట్ అంటూ వస్తోన్న వార్తలన్ని పుకార్లే. నేను, నస్రుల్లా మంచి స్నేహితులం మాత్రమే. నేనింకా భారతీయురాలినే.. ఇండియాకు తిరిగి వచ్చాక.. దీనిపై నిర్ణయం తీసుకుంటాను అని తెలిపింది. అయితే అంజూ ఇంటి నుంచి పాకిస్తాన్ వెళ్లిన తర్వాత ఫాతిమా తన పేరు మార్చుకోవడమే కాక.. పాక్, ఖైబర్‌ఫంక్తుఖ్వా ప్రావిన్స్‌కు చెందిన నస్రుల్లాను వివాహం చేసుకుందంటూ దాయాది దేశం నుంచి వార్తలు వెలువడ్డాయి. వీటిపై అంజూ తల్లిదండ్రులు స్పందిస్తూ.. ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిడ్డ చేసిన పని తలుచుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. ఆమె అక్కడే చచ్చింది అనుకుంటాం అని తెలిపారు. ఆమె ఇద్దరి పిల్లలను మేమే చూసుకుంటాం అని తెలిపారు.
Video: Indian girl #Anju with her Pakistani friend Nasrullah Khan in his home district Dir pic.twitter.com/jJJaCmxq1U
— Naimat Khan (@NKMalazai) July 25, 2023