Keerthi
ఇండియాలో ఒకప్పుడు ఎక్కువగా బ్లూ అండ్ వైట్ పారాగాన్ స్లిప్పర్స్ అనేవి ఎక్కువగా వినియోగించేవారు. ఈ స్లిప్పర్స్ ఇప్పుడు ఎవరికైనా గుర్తుందా. ఒకప్పుడు ఈ స్లిప్పర్స్ ట్రెండ్ అనేది జోరుగా కొనసాగేది. ముఖ్యంగా వందో రెండోందలకో ఈ స్లిప్పర్స్ మార్కెట్ లో దొరికేవి. కానీ, ఇప్పుడు ఇవి కనుమరుగయ్యాయి. కానీ, వీటి ధర మార్కెట్ లో ఇప్పుడు రూ. లక్ష పలుకుతుందాట. ఇంతకి ఎక్కడంటే..
ఇండియాలో ఒకప్పుడు ఎక్కువగా బ్లూ అండ్ వైట్ పారాగాన్ స్లిప్పర్స్ అనేవి ఎక్కువగా వినియోగించేవారు. ఈ స్లిప్పర్స్ ఇప్పుడు ఎవరికైనా గుర్తుందా. ఒకప్పుడు ఈ స్లిప్పర్స్ ట్రెండ్ అనేది జోరుగా కొనసాగేది. ముఖ్యంగా వందో రెండోందలకో ఈ స్లిప్పర్స్ మార్కెట్ లో దొరికేవి. కానీ, ఇప్పుడు ఇవి కనుమరుగయ్యాయి. కానీ, వీటి ధర మార్కెట్ లో ఇప్పుడు రూ. లక్ష పలుకుతుందాట. ఇంతకి ఎక్కడంటే..
Keerthi
సాధారణంగా చెప్పులు కొనుక్కోవాలంటే.. మార్కెట్ లో కానీ, సోషల్ మీడియాలో కానీ తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకు ఉంటాయి. ఈ క్రమంలోనే.. చాలామంది రకరకా మోడల్స్ ను వాళ్ల స్తోమతకు తగ్గ రేంజ్ లో కొనుగోలు చేస్తారు. అయితే ఒకప్పుడు మాత్రం భారతీయులు వందల విలువ చేసే సాదా చొప్పులను మాత్రమే ఎక్కువగా కొనుగోలు చేసేవారు.అలాంటి వాటిలో బ్లూ అండ్ వైట్ పారాగాన్ చెప్పులు కూడా ఒకటి. ఒకప్పటి కాలంలో ఈ రకపు చెప్పులు ట్రెండ్ అనేది జోరుగా కొనసాగేవి. ఇక వీటి ధర వందో, రెండొందలో మాత్రమే ఉండేవి.
అలాగే ఒకప్పుడు చిన్న వారి దగ్గర నుంచి పెద్ద వారి వరకు అందరూ ఈ చొప్పులనే వినియోగించేవారు. ఇక ఆ తర్వాత రకరకాల మోడల్ చొప్పులు మార్కెట్ లో దిగడంతో వీటి హవా అనేది కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. కానీ, ఇప్పటి మార్కెట్ లో కొన్ని షాపుల్లో ఈ అవాయి చొప్పులు దొరుకుతుంటాయి. కానీ, తాజాగా ఈ స్లిప్పర్స్ ధర మార్కెట్ రూ. లక్ష పలుకుతుందిట. అదేంటి వంద రూపాయలు కలిగి స్లిప్పార్స్ లక్ష రూపాయాలు ఉండటం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నరా.. అయితే ఇది ఇండియాలో మాత్రం కాదు. ఇంతకి ఎక్కడంటే..
మార్కెట్ లో వందో రెండొందలో పెడితే వచ్చే ఈ స్లిప్పర్స్ ధర తాజాగా రూ.లక్ష పలుకుతోంది. అయితే ఇది భారత్‌లో మాత్రం కాదు.. సౌది అరేబియాలో ఈ స్లిప్పర్స్ అంత ధర చూపిస్తుంది. తాజాగా అందుకు సంబంధించిన ఓ వీడియో ఎక్స్ ఖాతాలో రిషి బగ్రీ అనే వ్యక్తి పోస్టు చేయగా.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ విడియోలోని ఒక స్టోర్ లో స్లిప్పర్స్ ధర రూ. 4500 రియాల్స్‌గా (సౌదీ అరేబియా కరెన్సీ) చూపిస్తోంది. అంటే మన కరెన్సీ లో ఇది ఏకంగా రూ.లక్ష పలుకుంది. ఇకపోతే ఈ స్లిప్పర్స్ ఏదో బంగారంతో చేశారనుకుంటే పొరపాటే. ఎందుకుంటే.. ఈ చెప్పులు సాధారణ హవాయి చెప్పులానే ఉన్నాయి. కాకపోతే రంగులు మాత్రం కాస్త ఎక్కువగా ఉండటమే కాకుండా.. ధర కూడా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం వీటిని సౌదీ స్టోర్లలో విక్రయిస్తున్నారు. ఇక వాటిలో కూడా బ్రాండ్స్ ఉండవచ్చు. కానీ, ఇవి రూ. లక్ష అంటేనే కాస్త నమ్మశక్యంగా లేదని చెప్పవచ్చు.
ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరూ ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా, వారిలో ఒక నెటిజన్ భారత్‌లో టాయిలెట్ ఫుట్‌వేర్‌గా వాడుతుంటారని ట్వీట్ చేయగా.. మరొకరు ఇప్పుడు టాయిలెట్లలో కూడా వీటిని వాడట్లేదని కామెంట్స్ పెడుతున్నారు. మరొకరు మాత్రం ఇండియాలో రూ.100కు కొని సౌదిలో లక్షకు అమ్మితే ఏకంగా 1000 రెట్ల లాభం వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి, ఇండియాలో దొరికే సాదా స్లిప్పర్స్ ఇప్పుడు సౌది అరేబియాలో రూ లక్షకు దొరకడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
We Indians use these sandals as a toilet footwear 😀 pic.twitter.com/7EtWY27tDT
— Rishi Bagree (@rishibagree) July 16, 2024