Keerthi
ఈ మధ్య కాలంలో అందంగా కనిపించాలని చాలామంది కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ, ఈ ప్రయాత్నాల్లో చేసుకున్న సర్జరీలు వికటించడంతో.. ప్రాణాలు సైతం పొగొట్టుకుంటున్నారు. మరి కొంతమంది పూర్తిగా గుర్తుపట్టాలేని రీతిలో మారిపోతున్నారు. తాజాగా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా తనకు నచ్చిన కిమ్ కర్దాషియన్ లా కనిపించాలని అనుకుంది. కానీ, చివరికి జీవితాన్నే నాశనం చేసుకుంది.
ఈ మధ్య కాలంలో అందంగా కనిపించాలని చాలామంది కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ, ఈ ప్రయాత్నాల్లో చేసుకున్న సర్జరీలు వికటించడంతో.. ప్రాణాలు సైతం పొగొట్టుకుంటున్నారు. మరి కొంతమంది పూర్తిగా గుర్తుపట్టాలేని రీతిలో మారిపోతున్నారు. తాజాగా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా తనకు నచ్చిన కిమ్ కర్దాషియన్ లా కనిపించాలని అనుకుంది. కానీ, చివరికి జీవితాన్నే నాశనం చేసుకుంది.
Keerthi
అందం.. ఇది దేవుడి ఇచ్చిన ఒక వరం. కానీ, ప్రస్తుతం కాలంలో చాలామంది మరీంత అందంగా. యవ్వనంగా కనిపించాలని కోరుకుంటున్నారు.కాదు.. పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. అందుకోసం రకరకల డైట్స్ లు, వర్కవుట్లు, ఫేయిర్‌నెస్ క్రీములు వంటివి వినియోగిస్తున్నారు. ఇక్కడ వరకు ఫర్వాలేదు అనిపించిన అంతటి ఆగని ఆత్యశ.. సర్జరీల వరకు దారి తీస్తుంది. ఈ క్రమంలోనే..సామాన్యులు, సెలబ్రిటీస్ అని తేడా లేకుండా అందరూ ఈ సర్జరీల వెంటపడుతున్నారు. ముఖ్యంగా కొంతమంది తమకు నచ్చిన సెలబ్రిటీస్ మారిపోవాలని, మరీంత అందంగా కనిపించాలని కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ, ఈ ప్రయాత్నాల్లో చేసుకున్న సర్జరీలు వికటించడంతో.. ప్రాణాలు సైతం పొగొట్టుకుంటున్నారు. మరి కొంతమంది పూర్తిగా గుర్తుపట్టాలేని రీతిలో మారిపోతున్నారు. తాజాగా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా తనకు నచ్చిన సెలబ్రిటీలా మారిపోవాలని సర్జరీలు చేయించుకుంది. కానీ, ఆ సర్జరీలే ఆమె పాలిట శాపంగా మారి జరగరాని నష్టం జరిగింది. ఇంతకీ ఆమె ఎవరు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
బ్రెజిల్ కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ జెన్నిఫర్ పాంప్లేన్లా..అమెరికన్ రియాల్టీ టీవీ స్టార్స్ కిమ్ కర్దాషియన్ ఉండాలని ఆశ పడింది. అందుకోసం ఏకంగా రూ.8 కోట్లు ఖర్చుచేసింది. అయితే తనకు నచ్చిన హీరోయిన్లా మారానన్న ఆనందం ఆమెకు ఎంతోసేపు నిలువలేదు. ఎందుకంటే.. ఆమె కర్దాషియాన్లా కనిపించేందుకు చాలా కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంది. ఒక రకంగా చెప్పాలంటే.. కిమ్ కర్దాషియన్ ల రూపును మార్చెందుకు జెన్నిఫర్ శరీరంలో ఏ ఒక్క భాగాన్ని వదలకుండా సర్జరీలతో మార్పులు చేసుకుంది. అలా వరుస సర్జరీలు చేయించుకోవడంతో.. జెన్ని శరీరంలో నెమ్మదిగా దుష్ప్రభావాలు చూపించడం మొదలుపెట్టింది. చివరికి ఆమె వాటి కోసం చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఎంతలా అంటే ఆమె చావు అంచులాదాక వెళ్లే పరిస్థితి నెలకొంది.
ఎందుకంటే.. సాధారణంగా స్మెటిక్ సర్జరీల్లో బట్ ఫిల్లర్లను వినియోగిస్తారు. ఇది వక్షోజాలు, పిరుదులు ఆకృతిని పెంచేందుకు ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. అయితే ఇందులో వినియోగించే పాలీమిథైల్ మెథాక్రిలేట్ పలు దుష్ప్రభావాలను కలిగిస్తుంది. అందరికి ఇది సరిపోకపోవచ్చు. ఇక్కడ పాంఫోన్ల విషయంలో అదే జరిగింది. ఆమెకు ఈ సర్జరీల వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. దీంతో చివరికి ఆ ప్రభావం ప్రత్యుత్పత్తి అవయవాలపై చూపింది. దీని ఫలితంగా ఆమె సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటోంది. నిజం చెప్పాలంటే.. ఆమె జీవితంలో తల్లి అయ్యే అవకాశం చాలా తక్కువ. హీరోయిన్ కనిపించాలనే ఆమె కోరిక చివరికి మాతృత్వాన్ని దూరం చేసిందంటూ కన్నీటిపర్యంతమయ్యింది. ఇక ఆమెకు శస్త్ర చికిత్స చేసిన వైద్యుడు సైతం మాట్లాడుతూ.. జెన్నికి ఈ కాస్మెటిక్ సర్జరీ ప్రాణాంతకంగా మారింది. కానీ, ఆమెకు ఈ చికిత్సలో మరణం అంచుల నుంచి బయటపడింది. కాకపోతే ఈ సర్జరీ ఆమెకు మాతృత్వాన్ని కోల్పోయేలా చేస్తుందని ఊహించలేదు అంటూ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. సోషలో మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జెన్నిఫర్ పాంప్లేన్లా.. తన 17 ఏళ్ల వయసు నుంచి ఈ కాస్మోటిక్ సర్జరీలు చేయించుకోవడం ప్రారంభించింది. ఇలా దాదాపు ఇప్పటి వరకు 30 సర్జరీలు చేయించుకుంది. ఫలితంగా 2022లో బాడీ డిస్మోర్ఫియాతో చాలా ఇబ్బంది పడింది. దీంతో ఆమె సర్జరీలు ఆపేయాలని అనుకుంటుండగా శరీరం రియాక్షన్ ఇవ్వడం ప్రారంభించింది. అది కాస్తా ఆమె ప్రాణాలను రిస్క్ లో పడేలా చేసింది. దీంతో ఆమె దయచేసి నాలా ఎవ్వరూ సర్జరీలు జోలికి వెళ్లి ఆరోగ్యన్ని నాశనం చేసుకోవద్దంటూ అందరికీ సోషల్ మీడియా వేదికగా సలహాలు కూడా ఇచ్చింది. మరీ, అందం కోసం తన జీవితాన్నే నాశనం చేసుకున్న జెన్నిఫర్ పాంప్లేన్లా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.