Tirupathi Rao
Drinking Stored Plastic Bottle Water Health Risks: ప్రజలు అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగిపోయింది. అందుకే బయటకు వెళ్లినప్పుడు కూలింగ్ వాటర్ కాకుండా.. నార్మల్ వాటర్ తాగుతున్నారు. కానీ అలా నార్మల్ వాటర్ తాగడం వల్లే మీ ప్రాణానికి ముప్పు ఉందని తెలుసా?
Drinking Stored Plastic Bottle Water Health Risks: ప్రజలు అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగిపోయింది. అందుకే బయటకు వెళ్లినప్పుడు కూలింగ్ వాటర్ కాకుండా.. నార్మల్ వాటర్ తాగుతున్నారు. కానీ అలా నార్మల్ వాటర్ తాగడం వల్లే మీ ప్రాణానికి ముప్పు ఉందని తెలుసా?
Tirupathi Rao
మారుతున్న టెక్నాలజీ, హడావుడి జీవితాలు, ఉరుకుల పరుగుల జీవనంతో మనిషి జీవనశైలి కూడా చాలా మారిపోయింది. ఇప్పుడు అంతా ఇన్ స్టెడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ అంటూ అన్నీ బయట తినడానికే అలవాటు పడిపోతున్నారు. అయితే ఇప్పుడు కాస్త అలాంటి ధోరణి మారిపోయింది. వైద్యులు చెప్పే విషయాలను ప్రజలు వినడం మొదలు పెట్టారు. అలాగే హెల్తీ ఉండేందుకు కావాల్సిన ప్రికాషన్స్ ని బాగా తీసుకుంటున్నారు. అందుకే చాలా మంది బయటకు వెళ్లినప్పుడు కూలింగ్ వాటర్ కాకుండా.. నార్మల్ బాటిల్ తీసుకుని వాటర్ తాగడం కూడా స్టార్ట్ చేశారు. కానీ, అలా నార్మల్ వాటర్ బాటిల్ నీళ్లు తాగడమే ప్రమాదం అని మీకు తెలుసా?
సాధారణంగా ఏదో ఒక పని మీదో.. హోటల్ కో, రెస్టారెంట్ కో వెళ్తాం. అక్కడ కచ్చితంగా వాటర్ బాటిల్ తీసుకోవాలి. కానీ, కూలింగ్ వాటర్ బాటిల్ వల్ల మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయి అని.. కచ్చితంగా ప్లెయిన్ బాటిల్ తీసుకురామని చెప్తాం. అయితే అక్కడే మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెట్టిన బాటిల్ కంటే.. అలా బయట పెట్టిన బాటిల్ తోనే ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే హోటల్స్, రెస్టారెంట్స్, షాప్స్ లో వాటర్ బాటిల్స్ ని ప్రత్యేకంగా స్టోర్ చేయరు. వాటిని అలా ఒక రూమ్ లోనే.. బయట ఎండలోనే వదిలేస్తారు. అలా చేయడం వల్లే అసలు సమస్య వస్తుంది.
డైరెక్ట్ గా ఎండలో వాటర్ బాటిల్స్ ని పెడితే మీకు ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయి. క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్స్ లో ప్రమాదకరమైన బీపీఏ, ఫాథలేట్స్, పీఎఫ్ఏఎస్ వంటి కెమికల్స్ ఉంటాయి. బాటిల్స్ ని ఎండలో పెడితే.. అవి నీళ్లలో కలిసే ప్రమాదం ఉంటుంది. దాని వల్ల క్యాన్సర్ కూడా రావచ్చు. నేరుగా యూవీ కిరణాలు ప్లాస్టిక్ బాటిల్ పై పడితే.. నీళ్లు కనుషితమయ్యే ప్రమాదం కూడా ఉంది. అలా జరిగితే డియోక్సిన్స్, ఫ్యూరన్స్, పీసీబీ వంటి ప్రమాదకర కారకాలు ఏర్పడతాయి. వాటి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలా ఎండలో పెట్టిన ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగితే.. క్యాన్సర్, ప్రత్యుత్పత్తి సమస్యలు, హార్మోన్ సమస్యలు, న్యూరోలాజికల్ సమస్యలు, ఇమ్యునిటీ పరమైన సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.
అయితే కొంత మంది మేము ఎండలో పెట్టడం లేదు అంటారు. కానీ, ఎక్కువ రోజులు ప్లాస్టిక్ బాటిల్ లో నిల్వ ఉంచిన నీల్లను తాగడం కూడా ఎంతో ప్రమాదం. అలాంటి నీళ్లు తాగితే.. ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే వాటిలో మైక్రో ప్లాస్టిక్ కలుస్తుంది. దాని వల్ల మన శరీరానికి హాని కలుగుతుంది. అలాగే బాటిల్ లో ఎక్కువ రోజులు నీళ్లు అలాగే ఉంటే.. బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి ఫామ్ అయ్యి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాంటి నీళ్లు తాగితే హార్మోన్ పరమైన సమస్యలు వస్తాయి. అలాగే క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎండలో పెట్టినా.. ఎక్కువ రోజులు స్టోర్ చేసిన ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు తాగినా కూడా మీకు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఫ్రిడ్జ్ లో వాటర్ తాగినా.. ప్లెయిన్ వాటర్ తాగినా.. ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిల్ లో వాటర్ తాగితే మాత్రం మీ ఆరోగ్యాన్ని మీరు చేతులారా రిస్క్ లో పెట్టుకున్నట్లే.